Medaram Jatara: సమ్మక్క సారలమ్మ జాతర పనుల్లో అధికారుల పరుగో.. పరుగు.. మేడారంలోనే మంత్రి సీతక్క మకాం

| Edited By: Surya Kala

Jan 27, 2024 | 8:46 AM

వరంగల్ జిల్లా కు చెందిన ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క - కొండా సురేఖ జాతర నిర్వహణ బాధ్యతలు వారి భుజాల పై వేసుకున్నారు. ఇదే ములుగు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క మేడారంలోనే తిష్ట వేశారు.. అన్నీ తానై జాతర అభివృద్ది పనులను చక్కదిద్దుతున్నారు. గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తు తను కూడా తల్లుల సేవలో తరిస్తున్నారు.

Medaram Jatara: సమ్మక్క సారలమ్మ జాతర పనుల్లో అధికారుల పరుగో.. పరుగు.. మేడారంలోనే మంత్రి సీతక్క మకాం
Medaram Jataara
Follow us on

మేడారం మహాజాతరకు కేవలం 25 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. జాతరకు నెల రోజుల ముందు నుండే భక్తులు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జాతర ఏర్పాట్లలో మరింత స్పీడు పెంచింది. ఈ నెల 31వ తేదీ లోపు అభివృద్ది పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు డెడ్ లైన్ విధించారు. ఫిబ్రవరి 21 నుండి 24వ తేదీవరకు మేడారం మహాజాతర నిర్వహిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాట్లు చేస్తోంది.

ఈసారి జాతరకు ఆరు రాష్ట్రాల నుండి కోటి 50 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనాలు వేస్తున్నారు.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌర్యాలు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ జిల్లా కు చెందిన ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క – కొండా సురేఖ జాతర నిర్వహణ బాధ్యతలు వారి భుజాల పై వేసుకున్నారు.

ఇదే ములుగు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క మేడారంలోనే తిష్ట వేశారు.. అన్నీ తానై జాతర అభివృద్ది పనులను చక్కదిద్దుతున్నారు. గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తు తను కూడా తల్లుల సేవలో తరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మేడారం జాతర పనులను ఆకస్మికంగా తనిఖీచేసిన మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శబరిష్ తో కలిసి పనులను పరిశీలించారు.. పోలిస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించి సీసీ కెమెరాల నిఘా ను పరిశీలించారు.. దొంగతానాల నివారణ, మిస్సింగ్ అయిన వారిని ట్రాక్ చేయడం, క్యూ లైన్లలో తొక్కిసలాట జరుగకుండా చేపట్టాల్సిన చర్యలపై పోలీసులకు పలు సూచనలు చేశారు. విఐపి పార్కింగ్ స్థలాన్ని, ఆర్టీసీ బస్ స్టాండ్, హరిత హోటల్, జంపన్న వాగు స్నాన ఘట్టాలు, స్థూపం రోడ్, కొత్తూరు సమీపం లోని మరుగు దొడ్ల పనులను పరిశీలించారు. కన్నేపల్లి గ్రామంలోని సారలమ్మ దేవాలయ పరిసరాలను పరిశీలించారు. టాయిలెట్స్, త్రాగు నీరు , లైటింగ్ ఏర్పాటు పై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..