Astro Tips: జాతకంలో గ్రహ దోషాలున్నాయా.. కుంకుమ పువ్వుతో ఈ పరిహారాలు ఫలవంతం..

సనాతన ధర్మం ప్రకారం నవ గ్రహాల దోష నివారణ వంటగదిలోనే ఉంది. ఇక్కడ ఉండే చాలా వస్తువులు గ్రహాల ప్రభావంతో ముడిపడి ఉన్నాయి. వాటిలో కుంకుమ పువ్వు ఒకటి. దీనితో చేసే నివారణ వలన జాతకంలో గురువు, బుధుడు రెండింటినీ బలోపేతం చేయవచ్చు. ఈ రోజు కుంకుమ పువ్వుతో చేసే నివారణలతో సంపద, శ్రేయస్సు, అదృష్టం లభిస్తాయో తెలుసుకుందాం.

Astro Tips: జాతకంలో గ్రహ దోషాలున్నాయా.. కుంకుమ పువ్వుతో ఈ పరిహారాలు ఫలవంతం..
Saffron Remedies Astrology

Updated on: Jul 10, 2025 | 2:42 PM

జ్యోతిషశాస్త్రంలో జీవితాన్ని గడపడానికి గ్రహాలను సరైన స్థితిలో, దిశలో ఉంచడానికి అనేక నివారణలు ఇవ్వబడ్డాయి. ఈ నివారణలలో చాలా వరకు మన గృహోపకరణాలు, జీవితానికి సంబంధించినవి. వంటగదిలో ఉండే అనేక సుగంధ ద్రవ్యాలను గ్రహాలకు నివారణలుగా ఉపయోగిస్తారు. వాటిలో ఒకటి కుంకుమ పువ్వు. పూజలో, వంటల్లో తరచుగా కుంకుమపువ్వును ఉపయోగిస్తాము. కుంకుమ పువ్వు విష్ణువు, గురు బృహస్పతి, లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది. కుంకుమ పువ్వు గురువు, బుధ గ్రహాలతో ముడిపడి ఉంది. కనుక గురువు, బృహస్పతిని బలోపేతం చేయడానికి జ్యోతిషశాస్త్రంలో కుంకుమ పువ్వు నివారణలను వివరించబడ్డాయి. కుంకుమ పువ్వును ఉపయోగించడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, డబ్బు సమస్యలు, ప్రతికూలతలను వదిలించుకోవచ్చని చెబుతారు. పూర్వ కాలంలో దైవిక మంత్రాలను కుంకుమ పువ్వు సిరాతో రాసేవారట. కనుక ఈ రోజు జాతకంలో అదృష్టాన్ని పెంచుకునేందుకు కుంకుమ పువ్వుతో చేసే నివారణలు ఏమిటో తెలుసుకుందాం.

కుంకుమపువ్వుతో చేసే పరిపూర్ణ నివారణలు

  1. జాతకంలో గురువు స్థానం బలహీనంగా ఉంటే లేదా ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతుంటే.. గురువారం రోజున కుంకుమ పువ్వుని దానం చేయాలి. ఇలా చేయడం వలన జాతకంలో గురువు దోషాలను తొలగిస్తుంది.
  2. కుంకుమపువ్వును కుజ దోషాన్ని తొలగించడానికి కూడా ఉపయోగిస్తారు. కుంకుమపువ్వును ఎర్ర చందనంతో కలిపి హనుమంతుడికి తిలకం వేయడం వల్ల కుజగ్రహ ప్రభావం తగ్గుతుంది.
  3. పితృ దోషాన్ని వదిలించుకోవడానికి కుంకుమ పువ్వును కూడా ఉపయోగించవచ్చు. చతుర్దశి, అమావాస్య రోజున కుంకుమ పువ్వును దహనం చేయడం ద్వారా మీ పూర్వీకులను శాంతింపజేయవచ్చు.
  4. గురువారం నాడు కుంకుమపువ్వును తెల్లటి వస్త్రంలో చుట్టి సేఫ్‌లో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు.
  5. ఇవి కూడా చదవండి
  6. గురువారం నాడు కుంకుమపువ్వు, కొద్దిగా పసుపు కలిపిన నీటిలో స్నానం చేయడం వల్ల గురు గ్రహం అశుభ దోషాలు తొలగిపోతాయి.
  7. భార్యాభర్తల మధ్య ఏదైనా వివాదం ఉంటే నుదిటిపై, నాభిపై కుంకుమపువ్వు తిలకం దిద్దడం వలన బార్యాభర్తల మధ్య సంబంధం తీపిగా ఉంటుంది.
  8. కుంకుమపువ్వును వెండి పెట్టెలో ఉంచి పూజా స్థలంలో పెడితే అది మీ అదృష్టాన్ని పెంచుతుంది.
  9. ఏదైనా శుభ కార్యానికి వెళ్లే ముందు కుంకుమ తిలకం దిద్దుకుంటే ఆ పనిలో విజయం లభిస్తుంది.
  10. ఇంట్లోని ప్రతికూలతను తొలగించడానికి కుంకుమపువ్వును ‘గుగ్గిలం’, కర్పూరంతో కలిపి వెలిగించండి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు