యావత్ దేశ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే శమరిమల కొండు భక్తులతో కిటకిటలాడుతోంది. కేరళలలోని శబరిమలకు భక్తుల తాకిడీ పెరిగింది. అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంతమంది ఉన్నారు. నిన్న ఒక్క రోజే లక్ష మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. అయితే, టికెట్లు పొంది కూడా స్వామి దర్శనం కాని వారు ఇంకా చాలా మందే ఉన్నట్లు తెలుస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం.. ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన 1.10 లక్షల మంది భక్తులు దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక పంబ నుంచి శబరిమల కొండపైకి వెళ్లేందుకు దాదాపు 10 గంటల సమయం పడుతుంది. ఇక ఇప్పటి వరకు భక్తుల దర్శనం ద్వారా ట్రావెన్ కోర్ దేవస్థానానికి 130 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మేరకు దేవస్థానం అధికారులు అధికారికంగా ప్రకటించారు.
ఇక అయ్యప్ప దర్శనానికి భక్తులు భారీ స్థాయిలో వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు అన్నదానం, మంచి నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పోలీసులు భారీగా మోహరించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..