Sabarimala: సాయంత్రం తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం.. రేపటి నుంచి మండల- మకరవిళక్కు వేడుకల ప్రారంభం

|

Nov 16, 2023 | 12:57 PM

గురువారం సాయంత్రం 5 గంటలకు అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. నూతనంగా నియమితులైన ప్రధాన అర్చకుడు పీఎన్ మహేశ్, మలికాపురం ప్రధాన అర్చకుడు పీజీ మురళి గురువారం సన్నిధానానికి చేరుకోనున్నారు. అయ్యప్ప దేవాలయం, మలికప్పురం ఆలయ ప్రధాన అర్చకులుగా మహేశ్‌, మురళీలకు అభిషేకం నిర్వహించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.

Sabarimala: సాయంత్రం తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం.. రేపటి నుంచి మండల- మకరవిళక్కు వేడుకల ప్రారంభం
Sabarimala Ayyappa Temple
Follow us on

కేరళలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శబరిమలలో భక్తుల సందడి మొదలు కానుంది. శబరిమలలో అయ్యప్ప ఆలయ గర్భగుడి రెండు నెలల పాటు తెరవనున్నారు. మండల-మకరవిళక్కు సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం అయ్యప్ప ఆలయం తెరవనున్నారు. రేపటి నుంచి అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ ఏడాది మండల- మకరవిళక్కు వేడుకలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయని కేరళ మంత్రి కే రాధాకృష్ణన్‌ చెప్పారు.

ఇప్పటికే అయ్యప్ప ఆలయ పరిసరాలు అయ్యప్ప కీర్తనలతో మారుమ్రోగుతుంది. వివిధ రాష్ట్రాలు, విదేశాల నుండి భక్తులు అయ్యప్ప స్వామివారికి దర్శించుకోవడానికి వస్తారు.  భక్తుల రద్దీని నియంత్రించేందుకు తగిన సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే ఆలయాన్ని సందర్శించేందుకు లక్షలాది మంది భక్తులు వర్చువల్ క్యూ సిస్టమ్‌లో తమ స్లాట్‌లను బుక్ చేసుకున్నారు.

గురువారం సాయంత్రం 5 గంటలకు అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. నూతనంగా నియమితులైన ప్రధాన అర్చకుడు పీఎన్ మహేశ్, మలికాపురం ప్రధాన అర్చకుడు పీజీ మురళి గురువారం సన్నిధానానికి చేరుకోనున్నారు. అయ్యప్ప దేవాలయం, మలికప్పురం ఆలయ ప్రధాన అర్చకులుగా మహేశ్‌, మురళీలకు అభిషేకం నిర్వహించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

అయ్యప్ప భక్తుల యాత్ర సజావుగా సాగేందుకు వివిధ శాఖలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. నిలక్కల్, పంబా వద్ద భక్తులు సన్నిధానంలో రద్దీని ఎప్పటికప్పుడు గుర్తించి అందుకు వీలుగా వీడియో వాల్‌తో కూడిన డైనమిక్ క్యూ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.

భక్తుల దర్శనానికి పోలీసులు సర్వం సిద్ధం

పంబలో పోలీసులు చేసిన ఏర్పాట్లను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ షేక్ దర్వేష్ సాహెబ్ సమీక్షించారు. ఈ సీజన్‌లో శబరిమల వద్ద ఆరు దశల్లో 13000 మంది పోలీసులను మోహరిస్తామని చెప్పారు. వృద్ధులు, చిన్నారులకు ‘దర్శనం’ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

పంబలో పోలీసు ఉన్నతాధికారుల సమావేశం

సన్నిధానం, నిలక్కల్, వడస్సెరిక్కరలో మూడు తాత్కాలిక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నత స్థాయి సమావేశం నిర్ణయించింది. భద్రత కోసం పోలీసులు డ్రోన్‌ల నిఘాను ఉపయోగించనున్నారు. 15 కౌంటర్లలో వర్చువల్ క్యూ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.

యాత్రికులు తమ వాహనాలను అలంకరించుకోవద్దని, వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి అని, పార్కింగ్ ప్లేస్ ను ఉపయోగించాలని పోలీసులు కోరారు. నిలక్కల్ వద్ద 17 పార్కింగ్ గ్రౌండ్‌లను ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..