
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఒక పవిత్ర స్థలం ఉంది. ఇక్కడ త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతా దేవి, లకష్మణుడి పాద ముద్రలు ఉన్నాయి. శ్రీరాముడు తన 14 సంవత్సరాల వనవాసానికి బయలుదేరినప్పుడు.. ఆయన ఖాండ్వాకు చేరుకుని ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఈ సమయంలో ఆయన తన భక్తి, శక్తి, గౌరవానికి చెరగని గుర్తును మిగిల్చారు. ఈ గుర్తులు ఇప్పటికీ ఆయన రాకకు సాక్ష్యంగా ఉన్నాయి. భగవంతుడు అడుగు పెట్టిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం రామేశ్వరంగా ప్రసిద్ధి చెందింది.
ఖాండవ అరణ్యం నుంచి రామేశ్వరానికి ప్రయాణం
త్రేతాయుగంలో శ్రీరాముడు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలోని రామేశ్వరానికి పయనం అయ్యాడని చెబుతారు. ఆ సమయంలో దీనిని “ఖాండవ అడవి” అని పిలిచేవారట. శ్రీరాముడు, సీతా , లక్ష్మణుల పాదాలు భూమిని తాకిన ప్రదేశం ఇది. నేటికీ దీనికి సంబంధించిన అనేక కథలు, చిహ్నాలు ఈ పవిత్ర భూమిపై ఉన్నాయి.
రాంబన్ బావి మరియు సీతా బావడి
ఒక పురాణం ప్రకారం సీతా దేవికి దాహం వేసినప్పుడు, రాముడు భూమిలోకి బాణం వేసి నీటి ప్రవాహాన్ని బయటకు తీశాడు. ఈ నీటి ప్రవాహం తరువాత ఒక బావి లోపల చేరడం ప్రారంభమైంది. దీనిని కాలక్రమంలో రాంబాన్ కువాన్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ బావి గోడలచే రక్షించబడుతోంది. తద్వారా భక్తులు ఇప్పటికీ ఈ అద్భుతమైన నీటిని చూడవచ్చు. ఇది మాత్రమే కాదు ఇక్కడ సీతా బావడి కూడా ఉంది. దీని చరిత్ర సీతాదేవితో ముడిపడి ఉంది. స్థానిక ప్రజలు సీతా మాత ఈ బావడిలో స్నానం చేసిందని నమ్ముతారు. అప్పటి నుంచి దీనికి సీతా బావడి అని పేరు వచ్చింది. ఈ నీటి వనరులు సహజ సౌందర్యానికి ముఖ్యమైనవి మాత్రమే కాదు.. మత విశ్వాసానికి కూడా కేంద్రంగా ఉన్నాయి.
రామేశ్వర మహాదేవ ఆలయం
శ్రీరాముడు స్వయంగా విష్ణువు అవతారమే.. అయితే రాముడుగా అవతారం దాల్చిన ఆయన శివ ఆరాధకుడు కూడా. ఆయన ఎక్కడికి వెళ్ళినా తన శివారాధనను కొనసాగించాడు. రామేశ్వర కుండం వద్ద రాముడు మహాదేవుడి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ఇక్కడ ఆ ఆలయం కూడా ఉంది. నేటికీ భక్తులు శివయ్య దర్శనం, పూజల కోసం ఈ ఆలయానికి వస్తారు.
ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన దివ్య శివలింగాన్ని శ్రీరాముడు స్వయంగా ప్రతిష్టించాడని నమ్మకం. అందుకనే ఇక్కడ లింగాన్ని రామేశ్వర మహాదేవ అని పిలుస్తారు అని భక్తులు చెబుతారు. శ్రావణ మాసం, మహాశివరాత్రి సమయంలో వేలాది మంది భక్తులు ఈ త్రేతా యుగ రామేశ్వర ఆలయాన్ని సందర్శించి శివుని ఆశీస్సులు పొందుతారు. ఈ ఆలయం మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాకుండా, పురాతన భారతీయ వాస్తుశిల్పానికి కూడా ఒక అందమైన ఉదాహరణ.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.