Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? పూర్తయ్యేది ఎప్పటికంటే..?

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నియమాలు, నిబంధనలు ఖరారయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికే రామ మందిర నిర్మాణం గురించి వ్యయం.. ఏర్పాటు చేయవల్సిన విగ్రహాల తదితర విషయాల నుంచి తాము గత కొన్ని నెలలుగా పని చేస్తున్నాము" అని చంపత్ రాయ్ చెప్పారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? పూర్తయ్యేది ఎప్పటికంటే..?
Ram Mandir In Ayodhya

Updated on: Sep 12, 2022 | 2:50 PM

Ayodhya Ram Mandir: కోట్లాది మంది హిందువుల కల అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  ఈ రామమందిర నిర్మాణానికి దాదాపు రూ.1,800 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకారం, ఈ మొత్తం నిర్మాణ వ్యయం సవరించిన అంచనా. రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ట్రస్ట్ తన నియమాలు, నిబంధనలను కూడా ఖరారు చేసింది. “అనేక సవరణల తర్వాత, తాము ఈ అంచనాకు చేరుకున్నామని.. నిర్మాణం ఖర్చులు కూడా పెరగవచ్చు,” అని రాయ్ నిర్మాణ వ్యయం గురించి చెప్పారు. రాముడి విగ్రహ నిర్మాణంలో తెల్లని పాలరాయిని ఉపయోగించాలని కూడా ట్రస్ట్ నిర్ణయించింది.

రామాలయం వద్ద రామాయణ కాలం నాటి అనేక ఇతర దేవతల విగ్రహాలను కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. “శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నియమాలు, నిబంధనలు ఖరారయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికే రామ మందిర నిర్మాణం గురించి వ్యయం.. ఏర్పాటు చేయవల్సిన విగ్రహాల తదితర విషయాల నుంచి తాము గత కొన్ని నెలలుగా పని చేస్తున్నాము” అని చంపత్ రాయ్ చెప్పారు.

డిసెంబర్ 2023 నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని, జనవరి 2024లో జరిగే మకర సంక్రాంతి పండుగ నాటికి రాముడు విగ్రహం గర్భగుడిలో పూజలను అందుకోనున్నదని రాయ్ చెప్పారు. 15 మంది ట్రస్టు సభ్యులలో 14 మంది సమావేశానికి హాజరయ్యారని కూడా ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..