Puja Tips: పూజ సమయంలో వెండి పళ్లెంలోనైనా అరటి ఆకు వేసి నైవేద్యంగా పెడతారు ఎందుకో తెలుసా..

|

May 23, 2024 | 8:33 PM

భారతదేశంలోని చాలా ప్రదేశాల్లో ప్రజలు అరటి ఆకుల్లో ఆహారం తింటారు. వివాహాది వంటి శుభ సందర్భాలలో కూడా అరటి ఆకుల్లో అతిథులందరికీ ఆహారం వడ్డిస్తారు. హిందూ మతంలో అరటి ఆకులపై ఆహారాన్ని ఉంచి కొంతమంది దేవుళ్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. హిందూ మతంలో అరటి ఆకులపై ఏయే దేవుళ్లకు నైవేద్యం సమర్పిస్తారో ఈ రోజు తెలుసుకుందాం.

Puja Tips: పూజ సమయంలో వెండి పళ్లెంలోనైనా అరటి ఆకు వేసి నైవేద్యంగా పెడతారు ఎందుకో తెలుసా..
Hindu Puja Tips
Follow us on

అరటి చెట్టును, అరటి ఆకును, అరటి పండ్లను హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే అరటి ఆకులలో శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు.అందుకే అరటి చెట్టును దైవంగా భావించి పూజిస్తారు. పూజలో లేదా పవిత్రమైన కార్యక్రమాలలో ఉపయోగిస్తారు. అరటి చెట్టు గురించి ఒక నమ్మకం ఉంది. అరటి ఆకుల నుండి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఇది ఇల్లు లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది.

భారతదేశంలోని చాలా ప్రదేశాల్లో ప్రజలు అరటి ఆకుల్లో ఆహారం తింటారు. వివాహాది వంటి శుభ సందర్భాలలో కూడా అరటి ఆకుల్లో అతిథులందరికీ ఆహారం వడ్డిస్తారు. హిందూ మతంలో అరటి ఆకులపై ఆహారాన్ని ఉంచి కొంతమంది దేవుళ్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. హిందూ మతంలో అరటి ఆకులపై ఏయే దేవుళ్లకు నైవేద్యం సమర్పిస్తారో ఈ రోజు తెలుసుకుందాం.

శ్రీ మహా విష్ణువు
అరటి చెట్టులో విష్ణువు స్వయంగా నివసిస్తాడని నమ్ముతారు. అందుకే అరటి ఆకులలో దేవుళ్లకు ఇష్టమైన ఆహారాన్ని శ్రీ మహా విష్ణువుకు నైవేధ్యంగా సమర్పిస్తారు. ఇంట్లో ఉన్న పూజ గదిలో కూడా అరటి ఆకులో విష్ణుమూర్తికి నైవేధ్యం సమర్పించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయని చెబుతారు. శ్రీ మహా విష్ణువును పూజించిన తరువాత ఎవరి వివాహంలో నైనా ఆటంకాలు ఎదురవుతుంటే వారు అరటి ఆకులపై ఆహారం నైవేద్యంగా పెట్టాలని, ఇలా చేయడం వల్ల వివాహానికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోతాయని కూడా నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

లక్ష్మీదేవి
లక్ష్మీదేవి అరటి ఆకులపై నివసిస్తుందని నమ్మకం. అందుకే అరటి ఆకులపై లక్ష్మీదేవికి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ఉంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని నమ్ముతారు.

గణేశుడు
అరటి ఆకులపై గణేశుడికి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించడం కూడా చాలా పవిత్రమైనది, ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది. నమ్మకాల ప్రకారం గణేశుడికి అరటిపండు అంటే చాలా ఇష్టం. అందుకే అరటి ఆకులో ఆహారం పెట్టడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల గణేశుడు ప్రసన్నుడై కోరిన కోర్కెలు తీరుస్తాడు.

దుర్గాదేవి
అరటి ఆకులపై జగదంబకు ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. హిందూ మతపరమైన విశ్వాసం ప్రకారం ఏ భక్తుడైనా దుర్గా దేవికి అరటి ఆకులో ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తే దుర్గాదేవిని ఆశీర్వదిస్తుందని విశ్వాసం. ఆ ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సును తెస్తుంది. జీవితంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు