AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palmistry: మీ బొటన వేలు మీద ఈ గుర్తు ఉందా.? వారికి లక్కే లక్కు.. డబ్బే డబ్బు..

బొటనవేలి రెండో పర్వంపై వెంట్రుకలు ఉండటం అరుదైన రాజయోగ సంకేతంగా హస్తసాముద్రికం వివరిస్తోంది. సాధారణంగా అన్ని వేళ్ళకు వెంట్రుకలు ఉంటాయి కానీ, బొటనవేలి రెండో పర్వంపై వెంట్రుకలు ఉండటం సాధారణంగా కనిపించదు. ఒకవేళ ఎవరికైనా ఈ రెండో పర్వంపై వెంట్రుకలు ఉంటే..

Palmistry: మీ బొటన వేలు మీద ఈ గుర్తు ఉందా.? వారికి లక్కే లక్కు.. డబ్బే డబ్బు..
Finger 1
Ravi Kiran
|

Updated on: Mar 24, 2026 | 9:55 PM

Share

మన తలరాత మన చేతుల్లోనే ఉంటుందని పెద్దలు అంటుంటారు. ఇది నిజమా? మన అరచేతిలో ఉన్న ఆ చిన్న చిన్న గీతలు మన జీవితం గురించి, మన భవిష్యత్తు గురించి నిజంగానే చెబుతాయా? పలు ఆసక్తికర విషయాలు ఇక్కడ ఉన్నాయి. హస్త సాముద్రికం అనేది ఒక ప్రాచీన విజ్ఞానం. హస్తసాముద్రికం ప్రకారం, బొటనవేలి రెండో పర్వంపై వెంట్రుకలు ఉండటం అరుదైన సంకేతం.ఇది రాజయోగానికి సూచన. అటువంటి వారికి ధనం, హోదా, పరపతి వంటివి పుష్కలంగా లభిస్తాయని, జీవితంలో అన్ని సౌకర్యాలు సమకూరుతాయని నిపుణులు వివరిస్తున్నారు. బొటనవేలి రెండో పర్వంపై వెంట్రుకలు ఉండటం అరుదైన రాజయోగ సంకేతంగా హస్తసాముద్రికం వివరిస్తోంది.

సాధారణంగా అన్ని వేళ్ళకు వెంట్రుకలు ఉంటాయి కానీ, బొటనవేలి రెండో పర్వంపై వెంట్రుకలు ఉండటం సాధారణంగా కనిపించదు. ఒకవేళ ఎవరికైనా ఈ రెండో పర్వంపై వెంట్రుకలు ఉంటే, వారు రాజయోగం అనుభవిస్తారని ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక సంకేతం ఉన్న వ్యక్తులకు ధనం, హోదా, పరపతి వంటివి పుష్కలంగా లభిస్తాయని, వారికి లేనిదంటూ ఏదీ ఉండదని, జీవితంలో అన్ని సౌకర్యాలు సమకూరుతాయని వివరించారు. ఈ అరుదైన గుర్తు ఉన్నవారికి సమాజంలో ఉన్నత స్థానం, ఆర్థిక స్థిరత్వం ఉంటాయని నొక్కి చెప్పారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి.. చేతి గీతలు మారుతుంటాయి, కానీ మన కృషి, పట్టుదల మాత్రమే మన గమ్యాన్ని మార్చగలవు.

Follow Us