Maha Kumbh: మహా సంగమం.. కుంభమేళాకు పోటెత్తిన భక్తులు.. ఒకే రోజు 6 కోట్లకు పైగా పుణ్యస్నానాలు

బుధవారం ఒక్కరోజే సాయంత్రం నాలుగు గంటల వరకు త్రివేణి సంగమంలో అమృతస్నానాలు చేసిన భక్తుల సంఖ్య 6 కోట్లు దాటింది. మొత్తంగా కుంభమేళాకు వచ్చే భక్తుల సంఖ్య 8 కోట్లు దాటవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, మహా కుంభమేళా లో అపశ్రుతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా విపరీతమైన రద్దీ నెలకొనడంతో తొక్కిసలాట జరిగింది.

Maha Kumbh: మహా సంగమం.. కుంభమేళాకు పోటెత్తిన భక్తులు.. ఒకే రోజు 6 కోట్లకు పైగా పుణ్యస్నానాలు
Maha Kumbh Mela

Updated on: Jan 29, 2025 | 9:36 PM

ఉత్తరప్రదేశ్‌‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తున్నారు. జనవరి 29 బుధవారం మౌని అమావాస్య ప్రభావంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. బుధవారం ఒక్కరోజే సాయంత్రం నాలుగు గంటల వరకు త్రివేణి సంగమంలో అమృతస్నానాలు చేసిన భక్తుల సంఖ్య 6 కోట్లు దాటింది. మొత్తంగా కుంభమేళాకు వచ్చే భక్తుల సంఖ్య 8 కోట్లు దాటవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి:

ఇదిలా ఉంటే, మహా కుంభమేళా లో అపశ్రుతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా విపరీతమైన రద్దీ నెలకొనడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 30 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: అంతా మనదే.. ఉద్యోగులకు ఏకంగా రూ. 70 కోట్ల బోనస్.. కానీ ఒక్క కండీషన్

ఇది కూడా చదవండి: బీచ్‌లో వాకింగ్‌ చేస్తున్న వ్యక్తి కాలికి తగిలిన అదృష్టం..అదేదో చెత్తాచెదారం అనుకుంటే.. 66 మిలియన్ల..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి