Rath Yatra: రథయాత్ర పర్వదినం సందర్భంగా మహంత్ స్వామి మహారాజ్ సందేశం
రథయాత్ర సందర్భంగా పరమ పూజ్య మహంత్ స్వామి మహారాజ్ భక్తులందరికీ ఆనందం, శాంతి, సంపదలు కలగాలని ప్రార్థనలు చేసి.. భగవంతుడి ధార్మిక మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ సందేశం భక్తి, సమానత్వం, శ్రేయస్సుకు చిహ్నంగా నిలిచింది. ఆయన పంపిన సందేశం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

ఈ రోజు రథయాత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని.. భగవంతుడి మహిమను ప్రస్తుతిస్తూ హిందూ సంప్రదాయానికి చెందిన పవిత్ర ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహంత్ స్వామి మహారాజ్ తన వ్యక్తిగత ప్రార్థనలు, ఆశీర్వచనాలను పంచుకున్నారు.
మహంత్ స్వామి మహారాజ్… భక్తుల పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తూ, రథయాత్ర సార్ధకతను గుర్తుచేశారు. భగవంతుడి కృపతో జీవితం సాఫల్యాన్ని పొందేందుకు ప్రతి ఒక్కరూ నిష్కలంకమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ఈ సందేశం ద్వారా ఆయన భక్తుల హృదయాలను స్పృశించారు. భగవంతుడి చింతనలో మునిగిపోయి… ధర్మాన్ని నమ్ముతూ… పరస్పర ప్రేమతో సమాజ సేవ చేస్తూ అందరూ జీవితాన్ని నడపాలని ఆయన పిలుపునిచ్చారు. రథయాత్ర మహత్యాన్ని తెలుపుతూ… ఈ విశేష పర్వదినం భక్తి, సామరస్యానికి ప్రతీకగా నిలవాలని ఆయన సందేశం ద్వారా ఆకాంక్షించారు.
మహంత్ స్వామి మహారాజ్ సందేశం దిగువన వినండి…
మహంత్ స్వామి మహారాజ్ భగవాన్ స్వామినారాయణ్… ఆరవ ఆధ్యాత్మిక వారసుడు. BAPS స్వామినారాయణ్ సంస్థ ప్రస్తుత గురువు. విధి పట్ల ఆయనకున్న అంకితభావం, వివరాలపై ఆయన చూపిన శ్రద్ధ చాలా మందికి ప్రేరణనిచ్చాయి. తన లోతైన హృదయపూర్వక ప్రసంగాల ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో సత్సంగ్‌ను ప్రేరేపించి బలోపేతం చేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




