Tuesday Puja Tips: మంగళవారం ఈ పనులు చేస్తున్నారా..సమస్యలు, దురదృష్టం మీ వెంటే.. అవి ఏమిటో తెలుసుకోండి

|

Apr 18, 2023 | 11:49 AM

సనాతన హిందూ సంప్రదాయంలో.. వారంలో ప్రతి రోజు ఒక నిర్దిష్ట గ్రహం లేదా దేవతను పూజించే విధానం ఉంది. అదే విధంగా ఆయా రోజుల్లో కొన్ని పనులు చేయడం నిషేధించబడింది. మంగళవారం నాడు కొన్ని రకాల పనులు చేస్తే అదృష్టానికి బదులు దురదృష్టం వారిని వెంటాడుతుంది. ఆ పనులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

Tuesday Puja Tips: మంగళవారం ఈ పనులు చేస్తున్నారా..సమస్యలు, దురదృష్టం మీ వెంటే.. అవి ఏమిటో తెలుసుకోండి
Lord Hanuman Puja
Follow us on

సనాతన హిందూ సంప్రదాయంలో.. వారంలో ప్రతి రోజు ఒక దేవతకు సంబంధించినదిగా పరిగణిస్తారు.  మంగళవారం రోజు  పవన్ పుత్రుడు శ్రీ హనుమంతుడికి సంబంధించింది. మంగళవారం ఆంజనేయ స్వామి, అంగారకుడిని పూజిస్తారు. ఈ రోజున ఈ రెండు దేవుళ్లను ఆరాధించడం ద్వారా.. భక్తుడికి బలం, తెలివి, జ్ఞానంలతో పాటు ఆ దేవుళ్ళ అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. సనాతన హిందూ సంప్రదాయంలో.. వారంలో ప్రతి రోజు ఒక నిర్దిష్ట గ్రహం లేదా దేవతను పూజించే విధానం ఉంది. అదే విధంగా ఆయా రోజుల్లో కొన్ని పనులు చేయడం నిషేధించబడింది. మంగళవారం నాడు కొన్ని రకాల పనులు చేస్తే అదృష్టానికి బదులు దురదృష్టం వారిని వెంటాడుతుంది. ఆ పనులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

1. పదునైన వస్తువులను కొనకండి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు పదునైన ఆయుధం కొనకూడదు. మంగళవారం నాడు కత్తెరలు, కత్తులు వంటివి కొనడం దోషంగా పరిగణిస్తారు.

2. తామసిక ఆహారానికి దూరంగా ఉండండి 
మంగళవారం హనుమంతుడికి పూజను చేస్తారు. అయితే ఆయన్ని ఆరాధించే సమయంలో పరిశుభ్రత,నిజాయితీ ప్రాముఖ్యత కలిగి ఉంది. అటువంటి పరిస్థితిలో మంగళవారాలలో శుభ ఫలితాలను కోరుకోవడానికి మరియు అశుభ ఫలితాలను నివారించడానికి.. ఎవరైనా సరే పొరపాటున కూడా తామసిక ఆహారాన్ని తినవద్దు. మంగళవారం నాడు మాంసం-మద్యం మొదలైన వాటిని తినడం వలన  జీవితంలో ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

3. ఉప్పు తీసుకోకండి
మీరు మంగళవారం ఉపవాసం ఉంటే..  ఈ రోజున ఉప్పు వినియోగానికి దూరంగా ఉండండి. ప్రసాదంలో కూడా ఉప్పు వేయకండి.  మంగళవారం నాడు ఉప్పు తీసుకోవడం శ్రేయస్కరం కాదు. మంగళవారం నాడు ఉపవాసం ఉండే వారు గోధుమలు, బెల్లంతో చేసిన ఆహారాన్ని తినండి.

4. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి
జ్యోతిష్యం ప్రకారం మంగళవారం పొరపాటున కూడా ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఈ రోజున ఏ వ్యక్తికి ఇచ్చిన అప్పు త్వరగా తిరిగి రాదని నమ్ముతారు. అయితే, ఈ రోజున ఎవరైనా రుణం తిరిగి ఇవ్వడం ప్రారంభిస్తే.. అది త్వరగా ముగుస్తుందని కూడా ఒక నమ్మకం.

5. జుట్టు, గోర్లు కత్తిరించవద్దు 
మంగళవారం రోజున నల్ల బట్టలు ధరించడం, జుట్టు , గోర్లు కత్తిరించడం కూడా నిషేధించబడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు ఇంట్లో ఏడుస్తూ ఉండడం శుభప్రదం కాదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)