మూలా నక్షత్రంలో సర్వస్వతి దేవిగా దుర్గమ్మ.. కూతురు ఆద్యతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

కనక దుర్గాదేవి సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అర్ధరాత్రి నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మరోవైపు సరస్వతి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రముఖులు సైతం పోతెట్టుతున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రికి  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్య కొణిదెలతో కలసి విచ్చేశారు.

మూలా నక్షత్రంలో సర్వస్వతి దేవిగా దుర్గమ్మ.. కూతురు ఆద్యతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Pawan At Indrakeeladri

Edited By:

Updated on: Oct 09, 2024 | 12:39 PM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు  ఘనంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు మూలా నక్షత్రం దీంతో కనక దుర్గాదేవి సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అర్ధరాత్రి నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మరోవైపు సరస్వతి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రముఖులు సైతం పోతెట్టుతున్నారు.

ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రికి  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్య కొణిదెలతో కలసి విచ్చేశారు. మూలా నక్షత్రంలో సరస్వతిదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను  పవన్ కళ్యాణ్, ఆద్య లు కలిసి దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ కు   అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేదాశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..