AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navaratri 2023: దసరాకు కన్య పూజ చేయనున్నారా.. ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసుకోండి..

బాలికలను అష్టమి లేదా నవమి తిథి నాడు పిలిచి పూజిస్తారు. అష్టమి తిథి రోజున  అమ్మ స్వరూపంగా భావించి బాలికలను పిలిచి పూజించాలంటే.. కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నవరాత్రులలో కన్య పూజను నిర్వహించే ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకుందాం..నియమాలను అనుసరిస్తూ కన్య పూజను చేస్తే.. కోరుకున్న ఆశీర్వాదాలను పొందుతారు. వాటిని విస్మరిస్తే, నవరాత్రి ఉపవాసం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. 

Navaratri 2023: దసరాకు కన్య పూజ చేయనున్నారా.. ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసుకోండి..
Navratri Ashtami 2023
Surya Kala
|

Updated on: Oct 22, 2023 | 11:17 AM

Share

పవిత్రమైన శరన్నవరాత్రి పండుగలో 2 నుండి 10 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలను దేవతలుగా భావించి పూజించే సంప్రదాయం ఉంది. దుర్గాదేవి స్వరూపంగా భావించి.. అమ్మాయిలను పిలిచి ప్రతిరోజూ పూజిస్తారు. మరికొందరు బాలికలను అష్టమి లేదా నవమి తిథి నాడు పిలిచి పూజిస్తారు. అష్టమి తిథి రోజున  అమ్మ స్వరూపంగా భావించి బాలికలను పిలిచి పూజించాలంటే.. కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

నవరాత్రులలో కన్య పూజను నిర్వహించే ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకుందాం..

నియమాలను అనుసరిస్తూ కన్య పూజను చేస్తే.. కోరుకున్న ఆశీర్వాదాలను పొందుతారు. వాటిని విస్మరిస్తే, నవరాత్రి ఉపవాసం అసంపూర్ణంగా మిగిలిపోతుంది.

ఇవి కూడా చదవండి

కన్యపూజ సమయంలో ఏమి చేయాలంటే

  1. బాలికలను పూజించాలంటే ముందుగా 11 ఏళ్ల లోపు బాలికలను తొమ్మిది మందిని ఎంచుకుని ఇంటికి గౌరవ మర్యాదలతో పిలవాలి.
  2. కన్యపూజలో 9 మంది అమ్మాయిలను 9 మంది దేవతల రూపంగా పరిగణిస్తారు. అందుకే కన్య పూజకు 9 మంది అమ్మాయిలను పూజిస్తారు.
  3. అయితే 9 అమ్మాయితో పాటు ఒకరిద్దరు అబ్బాయిలను ఆహ్వానించాలనే నియమం కూడా ఉంది. హిందూ విశ్వాసం ప్రకారం.. ఈ ఇద్దరు బాలురు గణపతి. భైరవుని చిహ్నాలు. ఆడపిల్లలు ఇంట్లోకి అడుగు పెట్టిన  తర్వాత వారి పాదాలను కడగాలి. .
  4. ఆడపిల్లల పాదాలు కడిగిన తర్వాత పాదాలకు పుసుపు రాసి పారాణి పెట్టాలి.
  5. అమ్మాయికి పూజ చేసిన తర్వాత బాలికలకు అక్షతలు ఇచ్చి.. తమని ఆశీర్వదించమని కోరండి. చివర్లో  బాలికలను వారి ఇంటి వద్ద గౌరవప్రదంగా వదలండి.

కన్యపూజలో ఏమి చేయకూడదంటే..

  1. బాలికలకు పూజ అనంతరం ఆహారం, పండ్లు అందించండి. ఇంటికి పిలిచిన ఏ బాలికను అవమానించవద్దు. ఏ ఆడపిల్లనైనా ఏడిపించకుండా.. సంతోషంగా ఉండేలా చేసి గౌరవంగా పంపించండి.
  2. ఇంటికి వచ్చిన 9 మంది అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలను తగిన బహుమతులు ఇవ్వండి.
  3. అమ్మవారి స్వరూపంగా భావించిన బాలికలకు తినడానికి తాజాగా తయారుచేసిన నైవేద్యాన్ని మాత్రమే ఇవ్వండి.
  4. ఇలా అమ్మవారి కోసం తయారుచేసిన ఆహారంలో వెల్లుల్లి, ఉల్లిపాయ మొదలైన వాటిని వేయకూడదు.
  5. కన్యాపూజ చేసిన తర్వాత.. బాలికలు వెళ్లిన వెంటనే ఇంటిని శుభ్రం చేయకూడదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.