Durga Devi: ఈరోజు భక్తులకు దుర్గాదేవిగా దర్శనమివ్వనున్న అమ్మవారు.. నేటి ప్రత్యేకత ఏంటంటే..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Oct 13, 2021 | 7:51 AM

నవరాత్రులు ప్రారంభమయ్యి.. నేటికి ఎనిమిది రోజులు.. ఈ ప్రత్యేక రోజులలో అమ్మవారి చల్లని చూపు యావత్ ప్రపంచంపై ఉండాలని

Durga Devi: ఈరోజు భక్తులకు దుర్గాదేవిగా దర్శనమివ్వనున్న అమ్మవారు.. నేటి ప్రత్యేకత ఏంటంటే..
Durga Devi

Follow us on

నవరాత్రులు ప్రారంభమయ్యి.. నేటికి ఎనిమిది రోజులు.. ఈ ప్రత్యేక రోజులలో అమ్మవారి చల్లని చూపు యావత్ ప్రపంచంపై ఉండాలని అమ్మవారిని వేడుకుంటారు. శరన్నవరాత్రులు… దేవికి మరింత ప్రీతికరం… అయితే ఈ తొమ్మిది రాత్రులు పూజించడానికి వీలు లేని వారు… అష్టమిరోజు తప్పనిసరిగా అమ్మవారిని పూజిస్తే.. తొమ్మిది రోజుల పూజా ఫలితం కలుగుతుంది అంటారు. అంతేకాకుండా.. ఈ నవరాత్రులలో ఒక్కో రోజు ఒక్క అమ్మవారిగా తలచి పూజిస్తుంటారు. మొదటి రోజు శైలపుత్రి. రెండవ రోజు బాలాత్రిపురసుందరీ దేవి, మూడవ రోజు గాయత్రీ దేవి.. నాలుగో రోజు లలితా దేవి.. ఐదవ రోజు సరస్వతి దేవి.. ఆరవ రోజు అన్నపూర్ణ దేవి.. ఏడవ రోజు మహాలక్ష్మీ.. ఎనిమిదవ రోజు దుర్గా దేవిగా.. తొమ్మిదవ రోజు మహిషాసురమర్ధనిగా.. పదవ రోజు.. రాజరాజేశ్వరీ దేవిగా అలంకరించి పూజిస్తుంటారు. ఈరోజు నవరాత్రులలో ఎనిమిదవ రోజు..

ఈ ఎనిమిదవ రోజున అమ్మవారు.. దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది. “విద్యుద్ధామ సమప్రభాం.. మృగపతి స్కందస్థితాం భీషణాం.. కన్యాభీఃకరవాల ఖేట విలద్దస్తాభిరాసేవితాం.. హస్తైశ్చక్రగదాసిఖేట విశిఖాంశ్చాపం గుణం తర్జనీం.. బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే”.. అమ్మవారిని ఆరాధించే మంత్రం… ఈరోజు అమ్మవారిని దుర్గాదేవిగా కోలిచేందుకు ఒక కథను చెబుతుంటారు. పూర్వం.. దుర్గముడు ఆనే రాక్షసుడిని సంహారం చేసిన శక్తి స్వరూపం దుర్గాదేవి.. కోటి సూర్య ప్రభలతో వెలిగే ఈ వేది భక్తులను సర్వ దుర్గతుల నుంచి కాపాడుతుంది.. ఈమె మహా ప్రకృతి స్వరూపిణి.. సమస్త దేవీ దేవతా శక్తులు..తేజస్సులు.. మూర్తీభవించిన తేజో రూపం.. సకల శత్రు సంహారిణి.. సర్వ దుఃఖాలను నశింపజేస్తుంది… అదే సమయంలో పరమశాంతమూర్తిగా తనను కొలిచిన భక్తులను కాపాడుతుంది. అష్టమినాడు అమ్మవారిని పూజిస్తే.. రోజూ ఆరాధించిన ఫలితం కలుగుతుంది. ఈరోజు అమ్మవారిని చామంతి, పొగడ, సంపెంగ… మల్లెపూలతో అర్చించాలి.. అలాగే.. అమ్మవారికి దానిమ్మ పండు సమర్పించాలి.. పొంగలి.. పులిహోర, పులగం దేవికి నివేదించాలి.

Also Read: Seetimaarr: ఓటీటీలోకి గోపిచంద్ సినిమా.. దసరాకు సీటీమార్ మూవీ స్ట్రీమింగ్..

Bigg Boss 5 Telugu: రెచ్చిపోయిన యానీ మాస్టర్.. నేను రూడ్ కాదంటూ సిరిపై చిందులు..

Amitabh Bachchan : అమితాబ్ పై సల్మాన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. చేసింది ఇక చాలు అంటూ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu