
Nagamani is Real or Not : భారతదేశంలో నాగుపాము అంటే ఎంతో భక్తి, భయము. హిందూ పురాణాలలో కూడా వాటికి ప్రత్యేక స్థానం ఉంది. పరమశివుడు నాగుపామును మెడలో ధరిస్తాడు. నాగులచవితి నాడు నాగుపామును పూజిస్తారు. విశ్వాన్ని కాపాడే విష్ణుమూర్తి సర్ప రాజైన ఆదిశేషువుపై పవళిస్తాడని హిందువుల నమ్మకం.. అయితే నాగుపాముని పూజించే హిందువులు సైతం నాగుపాము కనిపిస్తే దూరంగా పారిపోతారు. కాని నాగమణి కనిపిస్తే మాత్రం ఆశగా ముందుకువెళతారు. దాని మహత్యం అలాంటిది. వందల ఏళ్లుగా నాగమణి కోసం ప్రయత్నించినవారు ఎందరో. దానిని చేజిక్కించుకోవాలని జీవితాంతం ట్రైచేసిన వాళ్లు మరికొందరు. నాగమణి అంటే వెలకట్టలేని వజ్రంగా భావిస్తారు. దానిని దేనితోనూ పోల్చలేం. నాగమణి దొరికితే.. ఇక చావు ఉండదని, అష్టైశ్వర్యాలు వస్తాయని చాలామంది నమ్మకం. దీనికి పురాణాలను, శాస్త్రాలను ఉదాహరణగా చూపిస్తారు. మరి నాగమణికి అంత శక్తి ఉందా? అసలు నాగమణి అంటూ ఏదైనా ఉందా? లేకపోతే అంతా కట్టుకథేనా?
నాగమణి అనేదే లేకపోతే.. నాగుపాము తలపై కనిపించేదానిని ఏమంటారు? ఇదో పెద్ద ప్రశ్న. నాగమణి గురించి తెలుసుకోవాలంటే పురాణాలను పరిశీలించాలి. దానిప్రకారం చూస్తే.. భూగర్భంలో 7 లోకాలు ఉంటాయి. అవే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు. వీటిలో ఎన్నో జీవరాశులు ఉంటాయి. ఇక పాములకు రారాజైన ఆదిశేషుడు భూగోళాన్ని తన వేయి తలలతో మోస్తాడంటున్నాయి పురాణాలు. ఆదిశేషు, వాసుకి ఇలాంటివన్నీ భూగర్భంలోనే ఉంటాయి. వీటికి ముఖ్య అనుచరులు నాగుపాములు. ఆ నాగుపాములకే నాగమణులు ఉంటాయంటారు. ఇదంతా పురాణాల కథనం.
నాగమణి గురించి శాస్త్రీయంగా చూస్తే.. భూమిలోపల చాలా ఖనిజాలుంటాయి. వాటిలో కొన్ని వింత కాంతితో మెరుస్తూ ఉంటాయి. ఆ కాంతిలోనే పాములు.. తమ ఆహారమైన చిన్న జీవులను వెదుక్కుంటాయని అంటారు. ఆ కాంతితో కూడిన ఖనిజాలనే చాలామంది నాగమణి అని పొరబడతారంటారు. నాగుపాము తలపై నల్లని మచ్చలాంటిది కనిపిస్తుంది. నాగుపాము తలపై కొన్ని భాగాలు గట్టిగా ఉంటాయి. రాయిలాగా అనిపిస్తాయి. కొంతమంది ఈ రాళ్లనే నాగమణులుగా భ్రమపడతారు. వాటిని బయటకు తీస్తారు. అలా చేయడం వల్ల పాములు చనిపోయే ప్రమాదముంది. ఈ గట్టి పదార్థం పసుపు, తెలుపు, తేనె, నలుపు రంగుల్లో ఉంటుంది. వీటినే నాగమణులుగా అమ్ముతూ ప్రజలను మోసం చేస్తారు.
Also Read: మీ ఇంట్లో వివాహ వేడుకకి నగదు తగ్గిందా..! అటువంటి వారికోసమే ఎస్బిఐ బంపర్ ఆఫర్
ప్రేమపెళ్లి చేసుకున్న జంటను విడదీసిన పెద్దలు.. మనస్తాపంతో భర్త ఆత్మహత్యాయత్నం
భార్య ఫోటో, ఫోన్ నంబర్ ఉన్న పోస్టర్లను ఈ ప్రబుద్దుడు ఊరంతా అంటించాడు.. ఎందుకంటే..?