శ్రావణ మాసం ప్రారంభమైన వెంటనే పండగలు, పర్వదినం, ఉపవాసాలు మొదలవుతాయి. శ్రావణ మాసంలో వచ్చే పండగల్లో ఒకటి నాగ పంచమి పండుగ ఒకటి. నాగ పంచమి రోజున నాగదేవతను పూర్తి ఆచారాలతో పూజిస్తారు. ఈ సంవత్సరం నాగ పంచమి పండుగను ఎప్పుడు జరుపుకుంటారు. పూజ చేసే శుభ సమయం ఎప్పుడు తెలుసుకుందాం..
ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ పంచమి రోజుని నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం నాగ పంచమి ఆగస్టు 21, సోమవారం వచ్చింది. ఈ రోజు బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజుగా భావించి పుట్టలో పాలు పోసి పూజాదికార్యక్రమాలను నిర్వహిస్తారు. నాగ పంచమి రోజున నాగదేవతని పూజించడం వల్ల సంతోషం, అదృష్టంతో పాటు ఐశ్వర్యం కలుగుతుందని విశ్వాసం.
నాగ పంచమి తిథి ఆగస్టు 21న మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ ఆగష్టు 22, మంగళవారం మధ్యాహ్నం 2:00 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ పండుగ ఆగష్టు 21న మాత్రమే జరుపుకోనున్నారు. పూజకు అనుకూలమైన సమయం ఆగస్టు 21, సోమవారం. ఉదయం 5.53 నుండి 8.30 వరకు శుభ ముహూర్తంలో నాగదేవతని పూజిస్తే శుభ ఫలితాలు వస్తాయని విశ్వాసం.
శివుని మెడలోని ఆభరణం నాగుపాము. శ్రావణ మాసంలోని నాగ పంచమి రోజున నాగ దేవతని పూజిస్తే జీవితం సంతోషంగా ఉంటుందని విశ్వాసం. ఈ రోజున పాలు నైవేద్యంగా పెట్టడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని పాముల బాధల నుంచి కుటుంబానికి రక్షణ లభిస్తుందని విశ్వాసం.
నాగ పంచమి రోజున పాములకు పాలు సమర్పించండి.
నాగదేవతని పసుపు, కుంకుమ, గంధం, అక్షతలతో పూజించి, ఆపై అతని హారతి చేయండి.
ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషాన్ని తొలగించడానికి, ప్రవహించే నీటిలో వెండితో చేసిన ఒక జత పాములను సమర్పించండి.
నాగ పంచమి రోజున ఒక జత వెండి నాగు పామును బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల సంపదలు, ధాన్యాలు పెరుగుతాయి. పాముల నుంచి తమకు , తమ కుటుంబానికి భయం ఉండదని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)