Sankranti 2022: మకర సంక్రాంతి రోజు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..! అవేంటో తెలుసుకోండి..?

Makar Sankranti 2022: పురాతన హిందు సంప్రదాయంలో మకర సంక్రాంతికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. చాలా ప్రదేశాలలో ఈ రోజును సంవత్సర

Sankranti 2022: మకర సంక్రాంతి రోజు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..! అవేంటో తెలుసుకోండి..?
Makar Sankranti 2022

Edited By: Anil kumar poka

Updated on: Jan 10, 2022 | 8:13 PM

Makar Sankranti 2022: పురాతన హిందు సంప్రదాయంలో మకర సంక్రాంతికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. చాలా ప్రదేశాలలో ఈ రోజును సంవత్సర ప్రారంభంగా భావిస్తారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున సూర్య భగవానుడు, శని దేవుడిని పూజిస్తారు. గంగాస్నానం, ఉపవాసం, కథ, దానధర్మాలు చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులతో కూడిన వాతావరణం నెలకొంటుందని విశ్వాసం. ఈ రోజున సూర్యభగవానుని పూజించి చేసిన దానానికి ఫలితం దక్కుతుందని నమ్ముతారు.

ఈ పండుగ రోజు నువ్వులతో చేసిన వస్తువులను తప్పనిసరిగా దానం చేయాలి. అంతే కాదు 14 వస్తువులను దానం చేస్తే చాలా మంచిది. ఈ రోజున చేసిన దానాల ఫలాలు మిగిలిన రోజుల కంటే చాలా రెట్లు ఎక్కువని ప్రజలు నమ్ముతారు. ఇది మాత్రమే కాదు ఖరీఫ్ పంటలైన వరి, శనగ, వేరుశెనగ, బెల్లం, నువ్వులతో చేసిన పదార్థాలను సూర్య భగవానుడు శని దేవుడికి నైవేద్యంగా పెడుతారు. ఈ రోజున కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

సంక్రాంతి రోజు ఏమి చేయాలి..
1. ఈ రోజున నదీస్నానం చేయడం శుభప్రదంగా భావించినప్పటికీ అది కుదరకపోతే ఇంట్లో నల్ల నువ్వులను నీటిలో వేసి స్నానం చేయవచ్చు.
2. ఈ పండుగకి శని దేవుడిని ప్రసన్నం చేసుకుంటే చాలా మంచిదని భావిస్తారు. నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా మీరు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.
3. ఈ రోజు నువ్వులు కలిపిన నీరు తాగాలి. అలాగే నువ్వుల లడ్డూలు తినడం శుభప్రదంగా భావిస్తారు.
4. మకర సంక్రాంతి రోజున కిచిడీ తినడం చాలా శ్రేయస్కరం. ఉపవాసం తర్వాత మీరు కిచిడీని ప్రసాదంగా తినాలి.

సంక్రాంతి రోజు ఏమి చేయకూడదు..
1. ఈ రోజున దాన, ధర్మాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఒక బిచ్చగాడు లేదా పేదవాడు ఏదైనా అడగడానికి మీ ఇంటికి వస్తే పొరపాటున కూడా అతనిని ఖాళీ చేతులతో పంపకండి. అతనికి ఆహారం, తినుబండారాలు, ఇతర వస్తువులను ఇచ్చి పంపిస్తే శుభం కలుగుతుంది.
2. హిందూ మతంలో ఈ రోజును పవిత్రమైనదిగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున మత్తుకు దూరంగా ఉండాలి. మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగం అశుభం.
3. ఉపవాసం ఉండేవారు ప్రతి నియమాన్ని పాటించాలి. ఉపవాసం లేనివారు పూజలను విశ్వసించే వారు కూడా కొన్ని నియమాలను పాటించాలి. స్నానానికి, పూజకు ముందు ఏ విధమైన ఆహారం తినరాదు.

Amazon: జనవరి 10 నుంచి అమెజాన్‌ మొబైల్, టీవీ సేల్‌.. ఈ ఉత్పత్తులపై భారీ తగ్గింపు..

ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత ప్రయాణం క్యాన్సిల్‌ అయిందా..! అయితే కొత్త ఆఫర్‌ గురించి తెలుసుకోండి..?

మీరు జీతం తీసుకునే వ్యక్తులైతే కచ్చితంగా ఈ 5 విషయాలు తెలుసుకోండి.. లేదంటే అన్ని సమస్యలే..?