శివుడు అభిషేకప్రియుడు. కలశంలో నీళ్లు.. దోసెడు విభూతి.. కాస్త కంకుమతో అభిషేకిస్తే సంతోషిస్తాడు. మనస్సు నిండా భక్తితో కాసిన్ని నీళ్లు పోసి వేడుకున్నా .. సర్వైశ్వర్యాలను ఆ శివయ్య ప్రసాదిస్తాడు. భోళా శంకరుడు.. శివయ్య అని వేడుకుంటే.. కష్టాలను దూరం చేసి అభీష్టాలను నెరవేరుస్తాడు. మహా శివరాత్రి.. హిందూవులకు అత్యంత పవిత్రమైన పండగ. ఈ మహాశివరాత్రికి పవిత్రమైన మనస్సుతో శివుడిని పూజిస్తే..కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ ప్రత్యేకమైన రోజున చాలా మంది ఉదయాన్నే శివాలయాలకు వెళ్లి భోళా శంకరుడిని పూజిస్తుంటారు. సాయంకాలంలో శివుడికి పూజా చేసే సమయంలో కొన్ని పద్దతులను పాటించాలి. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ముందుగా శివలింగానికి నీటిని సమర్పించడం ద్వారా ఆ శివయ్య ప్రసన్నమవుతాడని విశ్వాసం. కాబట్టి శివరాత్రి రోజున శివలింగానికి నీటిని సమర్పించే నియమాలను తెలుసుకుందామా.
శివలింగానికి నీటిని అభిషేకించేందుకు సరైన దిశ..
హిందూ సంప్రదాయ ప్రకారం.. శివలింగానికి నీటిని సమర్పించేటప్పుడు ఎల్లప్పుడూ ఉత్తరం వైపు ముఖం ఉంచాలి. ఉత్తర దిశను శివుడికి ప్రధాన ద్వారంగా భావిస్తారు. ఈ వైపున నీటిని సమర్పించడం ద్వారా శివుడు తలుపులో అడ్డంకి ఉంటుంది. ఉత్తర దిశను భోలేనాథ్ ఎడమవైపుగా పరిగణిస్తారు. ఎడమ భాగం పార్వతీ దేవికి అంకితం చేయబడింది. ఈ వైపున నీరు అభిషేకించడం ద్వారా పార్వతి అనుగ్రహం ఉంటుంది.
నీటిని అభిషేకించడానికి సరైన పాత్ర..
శివలింగానికి నీటిని అభిషేకించడానికి సరైన పాత్రను ఎంచుకోవాలి. హిందూ గ్రంథాల ప్రకారం శివలింగానికి నీటిని అందించడానికి రాగి ఉత్తమ పాత్ర. కానీ.. రాగి పాత్రలో పాలు మాత్రం ఎప్పుడు అభిషేకించడకూడదు. రాగి పాలు విషంతో సమానం.
అభిషేకించే విధానం..
హిందూ గ్రంధాల ప్రకారం.. శివలింగంపై నీటిని సమర్పించేటప్పుడు చాలా పవిత్రంగా జాగ్రత్తలు పాటించాలి. వేగంగా.. పదునైన అంచుతో శివలింగంపై నీటిని ఎప్పుడూ అభిషేకించకూడదు. సన్నని అంచుతో శివలింగంపై నీటిని అభిషేకిచండం ద్వారా శివయ్య అనుగ్రహం లభిస్తుంది.
కూర్చుని నీరు అభిషేకించాలి..
శివలింగానికి నీరు సమర్పించేటప్పుడు ఎప్పుడూ నిలబడకూడదు. వేద పురాణాల ప్రకారం శివలింగానికి లేచి నిలబడి నీటిని సమర్పిచచడం వలన శివయ్య అనుగ్రహం లభించదు.
శంఖంతో నీరు సమర్పించవద్దు..
శివలింగానికి శంఖంతో నీరు సమర్పించకూడదు. పురాణాల ప్రకారం శివుడు.. శంఖ చూర్ అనే రాక్షసుడిని శంఖంతోనే వధించాడు.. శంఖం.. ఆ రాక్షసుడి ఎముకల నుంచి తయారైందని విశ్వాసం.
నీటిలో దేనిని కలపవద్దు..
శివలింగానికి నీటిని సమర్పించేటప్పుడు రోలీ, గంధం, పువ్వులు వంటి పదార్థాలను ఎప్పుడు కలపకూడదు. ఇలా చేయడం వలన నీటి స్వచ్చత కోల్పోతుంది. శివలింగానికి ఎప్పుడూ సాధారణ నీటిని అభిషేకించాలి.
గమనిక:- ఈ కథనం పురాణాలు.. ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. భక్తులను మనోభావాలని దెబ్బతీయడం మా ఉద్దేశ్యం కాదు.
Kajal Viral Video: తగ్గేదేలే అంటున్న అందాల చందమామ.. గర్భవతి అయినప్పటికీ.. వైరల్ వీడియో..!
Sebastian PC524 Trailer: యంగ్ హీరో కోసం విజయ్ దేవరకొండ.. ఆసక్తికరంగా సెబాస్టియన్ పీసీ 524 ట్రైలర్ ..