Maha Shivaratri 2022: శివరాత్రి జాగారం చేస్తున్నారా.. లింగోద్భవ సమయం ఎప్పుడో తెలుసా..!

| Edited By: Ravi Kiran

Mar 01, 2022 | 7:19 PM

Maha Shivaratri 2022: మహాశివరాత్రి హిందూవులకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు శివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. శివరాత్రి పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా

Maha Shivaratri 2022: శివరాత్రి జాగారం చేస్తున్నారా.. లింగోద్భవ సమయం ఎప్పుడో తెలుసా..!
Maha Shivaratri 2022
Follow us on

Maha Shivaratri 2022: మహాశివరాత్రి హిందూవులకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు శివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. శివరాత్రి పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ జాగరణ చేయడం, రోజంతా శివనాస్మరణతో గడపడం, శివుడిని అభిషేకించడం, బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేయడం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. శివరాత్రి రోజు చాలామంది పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం చేస్తారు. ఆరోగ్య పరిస్థితుల కారణంగా కొందరు ఉపవాస నియమాలు పాటించలేనివాళ్లు ద్రవ పదార్థాలతో, ప్రసాదాలతో ఉపవాసం పాటించవచ్చు. శివుడి అనుగ్రహం మనపై ఉండాలంటే శివుడికి మంచి నీటితో అభిషేకం చేసిన ఆయన కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. శివుడు లింగరూపంలోకి ఉద్భవించిన రోజున శివరాత్రి పండుగను జరుపుకుంటారు. లింగోద్భవసమయంలో స్వామివారికి అభిషేకాలు, పూజలు చేయటం వల్ల రెట్టింపు ఫలితాలను పొందవచ్చు.

అయితే లింగోద్భవ సమయం ఎప్పుడని అందరిలో సందిగ్ధత నెలకొంది. మంగళవారం రాత్రి 12 గంటల 29 నిమిషాల 4 సెకెండ్ల నుంచి 12 గంటల 31 నిమిషాల 59 సెకెండ్ల పాటు లింగోద్భవ సమయం ఉంటుంది. ఈ లింగోద్భవ సమయంలో భక్తులు స్వామి వారిని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పటికే శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివ నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. శివుడిని లింగరూపంలో పూజిస్తారు.  ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని భక్తుల నమ్మకం. శివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్లాలి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివుడిని స్మరించుకోవాలి. అలాగే శివుడికి సమర్పించే నైవేద్యంలో పులిహోర ఉండేలా చూసుకోవాలి. శివ లింగానికి పంచామృతాన్ని సమర్పించాలి. మారేడు ఆకులతో ఇంట్లో, ఆలయంలో శివుడిని పూజించాలి. ఉపవాసం ఉండేవారు కేవలం పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారమే తీసుకోవాలి.

March Changes: మార్చిలో జరిగే ఈ 5 మార్పుల వల్ల అందరికి నష్టమే.. ఆర్థిక స్థితిపై పెను ప్రభావం..!

Kidney Stone: కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి ఈ ఆకుకూర విషంతో సమానం.. అస్సలు తినకండి..!

ఈ స్కీంలో పెట్టుబడి పెడితే నెలకి రూ. 4,950 వడ్డీ.. ఎఫ్డీలతో పోల్చితే చాలా ఎక్కువ..!