Maha kumbhamela: ప్రయాగరాజ్ కు చేరుకున్న విదేశీయులు.. భజనలతో సందడి చేస్తోన్న భక్తులు.. అమృత స్నానమాచరిస్తున్న యాత్రికులు

|

Jan 14, 2025 | 10:35 AM

మహాకుంభ 2025 ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజునే కోట్లాది మంది భక్తులు త్రివేణీ సంగమ క్షేత్రంలో స్నానమాచరించారు. ఈరోజు 13 అఖారాలకు చెందిన సాధువులు మహాకుంభంలో అమృత స్నానం చేయనున్నారు. ఈ నేపధ్యంలో అధికార యంత్రాంగం భద్రతకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేసింది.

Maha kumbhamela: ప్రయాగరాజ్ కు చేరుకున్న విదేశీయులు.. భజనలతో సందడి చేస్తోన్న భక్తులు.. అమృత స్నానమాచరిస్తున్న యాత్రికులు
Maha Kumbhamela 2025
Follow us on

ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్న మహాకుంభ వేడుక రెండవ రోజుకు చేరుకుంది. తొలి రోజే మహాకుంభానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తి విశ్వాసాలతో గంగా నదిలో స్నానమాచరించారు. అదే సమయంలో ఈ రోజు మకర సంక్రాంతి మొదటి అమృత స్నానాన్ని చేయనున్నారు. భక్తులు సంగమానికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. తొలిరోజు మహాకుంభానికి 1.5 కోట్ల మందికి పైగా భక్తులు చేరుకున్నట్లు అంచనావేస్తున్నారు.

సనాతన ధర్మానికి చెందిన 13 అఖారాలకు చెందిన ఋషులు, సాధువులు మంగళవారం మహాకుంభానికి చేరుకున్నారు. అన్ని అఖారాలకు చెందిన సాధువులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేస్తారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు స్నానం చేయనున్నారు. తొలిరోజు మహాకుంభానికి అనేక దేశాల నుంచి భక్తులు చేరుకోగా..ఈ రోజు వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తులు మహాకుంభలో అమృతస్నానం చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇటలీ నుంచి కూడా భక్తులు ఈరోజు మహాకుంభానికి చేరుకున్నారు. తనకు భారత దేశం అంటే ప్రేమ కనుక భారత్‌కు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కుంభమేళాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.. ఇప్పటి కి తాను ఆరు సార్లు ఇండియా వచ్చినట్లు చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన భక్తుల బృందం ‘ఓం జై జగదీష్ హరే’ అంటూ గీతాలాపన చేస్తూ భజనలు చేస్తున్నారు.

బెల్జియం నుంచి ప్రయాగ్‌రాజ్ మహాకుంభానికి వచ్చిన అరోరా అనే భక్తుడు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందని తెలిపారు. కుంభమేళా ఉత్సాహాన్ని మనం నిజంగా అనుభవించవచ్చు. ఇక్కడ ఉన్నందుకు ఈ వేడుకలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

మకర సంక్రాంతి శుభ సందర్భంగా త్రివేణి సంగమంలో మహానిర్వాణి పంచాయతీ అఖారాకు చెందిన సాధువులు పవిత్ర స్నానం చేయడంతో మహా కుంభం మొదటి అమృత స్నానం ప్రారంభమైంది. మంగళవారం పంచాయతీ అఖారా మహానిర్వాణి శ్రీ కమలానంద్ గిరి మహారాజ్ కూడా మహాకుంభానికి చేరుకున్నారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అని తెలిపారు. అఖారాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పవిత్ర స్నానాలు చేయనున్నాయి. ఈ మహాకుంభ సనాతన ధర్మానికి చెందిన ప్రజలు ఒకచోట చేరి ప్రార్థించే శుభ సందర్భం.”

శంభు పంచాయతీ అటల్ అఖారా, మహానిర్వాణి పంచాయతీ అఖారా కలిసి రాజ స్నానం చేస్తున్నారు. శంభు పంచాయతీ అటల్‌ అఖారాకు చెందిన నాగ బాబా ప్రమోద్‌ గిరి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇది తమకు సంతోషకరమైన విషయమన్నారు. అఖారాలు ఒక్కొక్కరుగా మొదటి అమృత స్నానం చేస్తున్నారు. ఈరోజు 3 నుంచి 4 కోట్ల మంది ప్రజలు పుణ్యస్నానాలు చేస్తారని గురు స్వామి కైలాసానంద గిరి తెలిపారు.

ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ నిరంజనీ అఖారా రాజ రాజ స్నానానికి సిద్ధమవుతోందని చెప్పారు. యాపిల్ సీఈవో స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ మాట్లాడుతూ.. ఆమె తన క్యాంపులో ఉంది. అంత రద్దీగా ఉండే ప్రదేశానికి ఆమె ఎప్పుడూ వెళ్లలేదని చెప్పారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..