Lunar Eclipse 2023: భారతదేశంలో కనిపించనున్న చంద్రగ్రహణం.. ఎప్పుడు, ఏ సమయంలో పూర్తి వివరాలు
ఈ చంద్ర గ్రహణం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. ఈ ఏడాది రెండవది చివరిదైన చంద్రగ్రహణం ఈ నెలల్లో ఏర్పడనుంది. అక్టోబర్ 14, 2023న సూర్యగ్రహణం ఏర్పడగా.. అక్టోబర్ 29వ తేదీన రెండవ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం సూర్యగ్రహణం తర్వాత కేవలం 14 రోజుల్లో ఏర్పడుతుండడం విశేషం.
హిందూ సనాతన ధర్మంలో గ్రహణాలు ప్రత్యేక స్థానం ఉంది. సూర్య, చంద్రగ్రహణలు రాహు కేతు ల ప్రభావంతో ఏర్పడతాయని నమ్మకం. సైన్స్ గ్రహణాలు ఏర్పడడానికి రీజన్ వెల్లడించింది. చంద్రునికి సూర్యునికి మధ్య భూమి వచ్చినపుడు.. సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి పడ్డుపడుతుందని అప్పుడు చంద్రుడు భూమి మీద ఉన్నవారికి కనిపించడని దీనిని చంద్ర గ్రహణం అంటరాని పేర్కొంది. ఈ చంద్ర గ్రహణం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. ఈ ఏడాది రెండవది చివరిదైన చంద్రగ్రహణం ఈ నెలల్లో ఏర్పడనుంది. అక్టోబర్ 14, 2023న సూర్యగ్రహణం ఏర్పడగా.. అక్టోబర్ 28వ తేదీన రెండవ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం సూర్యగ్రహణం తర్వాత కేవలం 14 రోజుల్లో ఏర్పడుతుండడం విశేషం.
పాక్షిక చంద్రగ్రహణం అంటే ఏమిటంటే?
భూమి సూర్యుని నుండి పౌర్ణమి వరకు కాంతిని పాక్షికంగా నిరోధించినప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సందర్భంలో భూమి మీద ఉన్నవారికి చంద్రునిపై కాంతి చంద్రవంకగా మాత్రమే కనిపిస్తుంది.
పాక్షిక చంద్రగ్రహణం
చంద్రుడు పెనుంబ్రా దశలోకి ప్రవేశిస్తాడు.. ఇది తేలికపాటి నీడ. శరత్ పౌర్ణమి రోజున అంటే అక్టోబర్ 28వ తెల్లవారు జామున 3 గంటల 17 నిమిషాలకు ప్రారంభమై.. అక్టోబర్ 29 తెల్లవారుజామున 2.22 గంటల వరకు కొనసాగుతుంది. దాదాపు 1 గంట 19 నిమిషాల పాటు కొనసాగుతుంది.
భారత్ సహా ఏయే దేశాల్లో కనిపించనున్నదంటే..
భారతదేశంలో పాక్షిక చంద్రగ్రహణం కనిపించనున్నది. అర్ధరాత్రి సమయంలో భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. గ్రహణం 1 గంట 19 నిమిషాల పాటు కొనసాగుతుంది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, ఆసియా, యూరప్, ఆఫ్రికా, తూర్పు దక్షిణ అమెరికా , ఈశాన్య ఉత్తర అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో గ్రహణ ప్రభావం పడనుంది.
భారతదేశంలో తదుపరి చంద్రగ్రహణం
PIB నివేదిక ప్రకారం.. నెక్స్ట్ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7, 2025న సంభవిస్తుంది. అయితే ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. భారతదేశం చివరిసారిగా నవంబర్ 8, 2022న సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.