AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ప్రాకార నిర్మాణ పనులు జరుగుతుండగా అద్భుతం.. పోటెత్తిన భక్తులు.. !

పరమేశ్వరుడు ఎక్కడ ఉంటారు అని ప్రశ్నిస్తే.. శివుడు సృష్టి సర్వంలోఉన్నారని సమాధానం వినిపిస్తుంది. హిమాలయాలు, నదులు, కొండలు, అరణ్యాలు అన్నింటిలోనూ ఆయన శక్తీ అంతర్లీనంగా కనిపిస్తుంటుందని భక్తుల నమ్మకం. భక్తితో పూజించే వారి మదిలో నిత్యం కొలువుతీరి ఉంటారని చెబుతారు. పంచారామాలు, జ్యోతిర్లింగాలు చాలా ప్రసిద్దమనవి.

Andhra Pradesh: ప్రాకార నిర్మాణ పనులు జరుగుతుండగా అద్భుతం.. పోటెత్తిన భక్తులు.. !
Sri Pathala Bhogeshwara Swamy Temple
B Ravi Kumar
| Edited By: |

Updated on: Feb 07, 2026 | 4:34 PM

Share

పరమేశ్వరుడు ఎక్కడ ఉంటారు అని ప్రశ్నిస్తే.. శివుడు సృష్టి సర్వంలోఉన్నారని సమాధానం వినిపిస్తుంది. హిమాలయాలు, నదులు, కొండలు, అరణ్యాలు అన్నింటిలోనూ ఆయన శక్తీ అంతర్లీనంగా కనిపిస్తుంటుందని భక్తుల నమ్మకం. భక్తితో పూజించే వారి మదిలో నిత్యం కొలువుతీరి ఉంటారని చెబుతారు. పంచారామాలు, జ్యోతిర్లింగాలు చాలా ప్రసిద్దమనవి. కాశీ క్షేత్రంలో శివుడు విశ్వనాధునిగా కొలవబడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు రూపాల్లో పూజలు అందుకున్నారు ఆ పరమేశ్వరుడు.

అయితే ఆ కైలాస నాధుడికి భువిలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అలాంటి అతి పురాతన ఆలయాల్లో ఏలూరు జిల్లా కలిదిండిలో ఉన్న శ్రీపాతాళ భోగేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఇక్కడ తాజాగా ఆలయ ప్రాకార పనులు జరుగుతున్నాయి. వేంగిరాజు రాజరాజచోళుడు పాలనా కాలంలో ఆలయం నిర్మించినట్లు స్థల పురాణం. ఈ ప్రాంతానికి చెందిన రైతు తన పొలంలో దున్నుతుండగా నాగలికి శివలింగం తగిలింది. దీంతో నెత్తురు వరదలై పారిందనేది పూరణ కధనం. రాజరాజ చోళుడి కుమారుడు రాజరాజ నరేంద్రుని కాలంలో ఈ ఘటన జరిగిందని చెబుతారు.

కలిదిండికి మూడు మైళ్ళ దూరంలో శివలింగం బయట పడటం, నాగలికర్రుకు తగిలి లింగం విరిగిపోయింది. విరిగిపోయిన శివలింగాన్ని తిరిగి అతికించారు. ఇలా అతికించిన బాగాన్ని భక్తులు గర్భగుడిలో ఇప్పటికి పూజలు చేస్తూ.. చూసి తరిస్తారు. ఇక ఈ ఆలయంలో మరో విశేషముంది. ఇక్కడి కోనేరులోకి వెళ్లి హర హర అంటే బుడ బుడ అనే శబ్దంతో నీరు ఉబికి వస్తుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆలయంలో ప్రాకార పనులు జరుగుతున్నాయి.

తాజాగా ఆలయ పునః నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరుపుతుండగా, మరో పురాతన శివలింగం బయట పడింది. ఇది అతి ప్రాచీనమైన పురాతన శివలింగంగా భావిస్తున్నారు. పరమ శివుడి ప్రతిమ బయటపడిందని ఊరూ వాడ ప్రచారం జరిగింది. దీంతో బయటపడ్డ రాతి శివలింగాన్ని చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. కొద్దీ రోజుల్లో శివరాత్రి మహోత్సవాలు జరుగుతుండగా విశేషంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పురాతన లింగానికి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు పులకించిపోతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆధ్మాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రాకార నిర్మాణ పనులు జరుగుతుండగా అద్భుతం..!
ప్రాకార నిర్మాణ పనులు జరుగుతుండగా అద్భుతం..!
సమస్యంటూ సోషల్‌ మీడియాలో విద్యార్థుల పోస్ట్.. క్షణాల్లో ..
సమస్యంటూ సోషల్‌ మీడియాలో విద్యార్థుల పోస్ట్.. క్షణాల్లో ..
15 ఏళ్ల క్రితం ఫ్లాప్.. ఇప్పుడు యూత్ కు తెగ నచ్చేస్తుంది..
15 ఏళ్ల క్రితం ఫ్లాప్.. ఇప్పుడు యూత్ కు తెగ నచ్చేస్తుంది..
నిరుద్యోగులకు అలర్ట్.. సికింద్రాబాద్‌ రైల్వేలో 1012 ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. సికింద్రాబాద్‌ రైల్వేలో 1012 ఉద్యోగాలు
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా షాహీన్ అఫ్రిది పతనం
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా షాహీన్ అఫ్రిది పతనం
ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టికెట్స్‌ బుకింగ్‌ పరిమితి పెంపు
ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టికెట్స్‌ బుకింగ్‌ పరిమితి పెంపు
ఊరిస్తున్న స్టార్ హీరోల క్రాస్ ఓవర్ చిత్రాలు
ఊరిస్తున్న స్టార్ హీరోల క్రాస్ ఓవర్ చిత్రాలు
శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
యూనివర్స్ లోకి వెళ్తే హిట్ పక్కా.. ఇదే ఇప్పటి ట్రెండ్ మామా
యూనివర్స్ లోకి వెళ్తే హిట్ పక్కా.. ఇదే ఇప్పటి ట్రెండ్ మామా
ఛీ.. ఛీ నువ్వేం టీచర్‌రా.. చదువు చెప్పడం మాని స్కూల్‌లో ఆవేం పను
ఛీ.. ఛీ నువ్వేం టీచర్‌రా.. చదువు చెప్పడం మాని స్కూల్‌లో ఆవేం పను