Significance of Shankha: ఈ రకమైన శంఖం లభించడం కష్టం.. దర్శనం, పూజ అత్యంత ఫలప్రదం.. ఆ శంఖం ఏమిటో తెలుసా

|

Sep 18, 2022 | 7:14 PM

ప్రధానంగా వామవర్తి, దక్షిణావర్తి అనే రెండు రకాల శంఖాలున్నాయి. పూజలో ఉపయోగించే వృత్తాకార శంఖం ఎడమ వైపున ఉంటుంది. సాధారణంగా, ఈ శంఖాన్ని పూజలో ఉపయోగిస్తారు.

Significance of Shankha: ఈ రకమైన శంఖం లభించడం కష్టం.. దర్శనం, పూజ అత్యంత ఫలప్రదం.. ఆ శంఖం ఏమిటో తెలుసా
Astro Remedies
Follow us on

Significance of Shankha: హిందూ మతంలో శంఖం చాలా పవిత్రమైంది. పూజ సమయంలో శంఖం ఊదడం శుభాలను ఇస్తుందని పరిగణించబడుతుంది. పురాణాలలో లక్ష్మీ దేవి సోదరుడిగా పేర్కొన్నారు. దీంతో శంఖం ఉన్న ఇంట్లో ఐశ్వర్యం, సంతోషం ఉంటుందని నమ్మకం. సముద్ర మథనం సమయంలో శంఖం కూడా లక్ష్మీదేవితో ఉద్భవించిందని పురాణాల కథనం. ఐశ్వర్యం, విజయం, సంతోషం కోసం దేవాలయాలతో సహా అన్ని ప్రార్థనా స్థలాల్లో పవిత్ర శంఖాన్ని ఊదడానికి కారణం ఇదే. శంఖాన్ని ఊదడం వల్ల ఆయుష్షుకు సంబంధించిన అన్ని దోషాలు తొలగిపోతాయని భావిస్తారు. శంఖంలోని రకాలు, లాభాల గురించి వివరంగా తెలుసుకుందాం.

శంఖంలో రకాలు

ప్రధానంగా వామవర్తి, దక్షిణావర్తి అనే రెండు రకాల శంఖాలున్నాయి. పూజలో ఉపయోగించే వృత్తాకార శంఖం ఎడమ వైపున ఉంటుంది. సాధారణంగా, ఈ శంఖాన్ని పూజలో ఉపయోగిస్తారు. వీటిని వాయించడం ద్వారా ఇంటికి సంబంధించిన అన్ని దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు ఉంటాయి. అదే సమయంలో దక్షిణవర్తి శంఖం వృత్తం కుడి వైపున ఉంటుంది. ఈ శంఖం లభించడం చాలా కష్టం. ఈ శంఖుని దర్శనం, పూజ రెండూ చాలా ఫలప్రదం. ఇది లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణించబడుతుంది. దక్షిణవర్తి శంఖం కొలువుదీరిన ఇంట్లో ఎప్పుడూ ధన, ధాన్యాలకు లోటు ఉండదని ప్రతీతి.

ఇవి కూడా చదవండి

శంఖం ఊదడం వల్ల కలిగే ప్రయోజనాలు:

  1. శంఖాన్ని ఊదడం ద్వారా వాక్కు సంబంధిత దోషాలు, మానసిక ఒత్తిడి తొలగిపోతాయి.
  2. శంఖం ఊదడం వల్ల శ్వాస సామర్థ్యం మెరుగుపడి ఊపిరితిత్తులు బలపడతాయి.
  3. శంఖం ఊదడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు, అడ్డంకులు తొలగిపోయి సానుకూల శక్తి నిలువ ఉంటుంది.
  4. శంఖాన్ని ఊదడం, పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని విశ్వాసం.
  5. ఏ ఇంట్లో రోజూ శంఖం ఊదుతారో ఆ ఇంటికి సంబంధించిన అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడూ ఉంటుంది.
  6. శంఖాన్ని పూజించే ఇంట్లో, సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి ఎల్లప్పుడూ నివాసం ఉంటుంది. తద్వారా ఆ ఇంట్లో నివసించే వారికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)