Astro News: జ్యోతిషశాస్త్రం ద్వారా ఒకరి జాతకచక్రం, భూత, భవిష్యత్తు, వర్తమానం గురించి చెబుతారు. అలాగే సాముద్రక శాస్త్రం ద్వారా కూడా ఒక వ్యక్తి గుణాలు, స్వభావం మొదలైనవాటిని తెలుసుకోవచ్చు. మీరు పాదాలు, వేళ్ల నిర్మాణాన్ని చూడటం ద్వారా ఒక వ్యక్తి బలం, బలహీనత, ప్రవర్తన గురించి సులభంగా తెలుసుకోవచ్చు. మీరు ఒక వ్యక్తి రహస్యం, భవిష్యత్తును తెలుసుకోవాలనుకుంటే ఈ జ్ఞానం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాదాల సైజును బట్టి వ్యక్తి స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు.
1. సాముద్రిక శాస్త్రం ప్రకారం.. మీ బొటనవేలు, పక్కన వేలు సమానంగా ఉంటే ఆ వ్యక్తులు చాలా సంతోషంగా, ధనవంతులుగా ఉంటారు. వారు తెలివైన జీవిత భాగస్వామిని పొందుతారు. దీని కారణంగా వారి కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. వీరికి బంధువుల నుంచి ఎంతో సహకారం లభిస్తుంది.
2. బొటనవేలు పక్కన ఉన్నవేలు పెద్దదిగా ఉంటే అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు. వారి జీవిత భాగస్వామి కూడా చాలా తెలివైంది. డబ్బు పొదుపు చేయడంలో ఇద్దరు సిద్దహస్తులు.
3. రెండో వేలు కంటే మూడో వేలు పెద్దదిగా ఉంటే అతను చాలా ప్రశాంతంగా, సాధారణ స్వభావం కలిగి ఉంటాడు. అటువంటి వ్యక్తి నుంచి ఎవరైనా నిజాలు తెలుసుకోగలరు. వారి సరళత కారణంగా ఈ వ్యక్తులు చాలాసార్లు మోసపోతారు.
4. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఒకరి బొటనవేలు పక్కవేలుతో అతుక్కొన ఉంటే అతను చాలా పోరాటం తర్వాత జీవితంలో అన్ని పొందుతాడు.
5. సాముద్రిక శాస్త్రం ప్రకారం.. ఐదు వేళ్లు ఒకేలా ఉంటే ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడు. గౌరవప్రదమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి జీవితంలో చాలా ఆనందం, సంపద, గౌరవం పొందుతాడు.
గమనిక : (ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.)