పశుపతినాథ్ దర్శనం లేని కేదార్‌నాథ్ దర్శనం అసంపూర్ణం.. ఈ 2 క్షేత్రాలకు సంబంధం.. పురాణ కథ ఏమిటంటే..

|

Jun 19, 2024 | 2:26 PM

శివపురాణం ప్రకారం కేదార్‌నాథ్ ధామ్‌ను సందర్శించడం ద్వారా ప్రజలు మోక్షాన్ని పొందుతారు. ప్రాపంచిక సుఖాలను అనుభవించిన తరువాత నేరుగా స్వర్గాన్ని చేరుకుంటారు. లింగ పురాణం ప్రకారం జీవితాన్ని త్యజించి కేదార్‌కుండ్‌లో నివసించే వ్యక్తి కూడా శివుడిలా అవుతాడు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌కు నేపాల్‌కు చెందిన పశుపతినాథ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. పశుపతినాథుడు లేని కేదార్‌నాథ్ దర్శనం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది.

పశుపతినాథ్ దర్శనం లేని కేదార్‌నాథ్ దర్శనం అసంపూర్ణం.. ఈ 2 క్షేత్రాలకు సంబంధం.. పురాణ కథ ఏమిటంటే..
Kedarnath Pashupatinath
Follow us on

హిందూ మతంలో సృష్టి లయకారుడైన శివునికి అంకితం చేయబడిన 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి కేదార్‌నాథ్ ధామ్. ఇక్కడ శివుడు కేదార్‌నాథుదిగా పూజలు అందుకుంటున్నాడు. శివుని 11వ జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది. ఈ క్షేత్రంలో కొలువైన శివుడిని దర్శనం వలన భక్తుల కోరికలన్నీ తీరుతాయి. కేదార్‌నాథ్ ధామ్‌లోని ప్రతి అణువులో శివుని ఉనికి ఉందని భక్తుల నమ్మకం. ఇక్కడ మహాదేవుడు శివలింగ రూపంలో ఉన్నాడు. ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో భక్తులు భోలేనాథుడి దర్శనం కోసం కేదార్‌నాథ్ చేరుకుంటారు.

మహాభారతంలో కూడా శివుని కేదార్‌నాథ్ ఆలయ ప్రాముఖ్యత ప్రస్తావించబడింది. పురాణాల ప్రకారం పాండవులు తమ పాపా ప్రక్షాళన కోసం పంచ కేదార్లను నిర్మించారు. ఈ ఐదు ఆలయాల్లో కేదార్‌నాథ్ ఒకటి. అంతేకాదు ఈ ఐదు కేదార్లలో కేదార్‌నాథ్ ధామ్ అత్యుత్తమమైనదిగా పరిగణించబడుతుంది. కేదార్‌నాథ్ ధామ్‌ను సందర్శించే ఏ భక్తుడి కోరికనైనా శివుడు ఖచ్చితంగా నెరవేరుస్తారు. ముఖ్యంగా కేదార్‌నాథ్ దర్శనం కోసం ఇక్కడికి వచ్చే భక్తులను సర్వ పాపాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు. శివుడు పాండవులను వారి వంశాన్ని, గురువును చంపిన పాపం నుంచి విముక్తినిచ్చాడు. కనుక ఎవరైతే కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్లి అక్కడ ఉన్న శివయ్యను దర్శించుకుంటారో వారి సకల పాపాలను పోగొట్టి పాపాల నుండి విముక్తి చేస్తాడని నమ్మకం.

శివపురాణం ప్రకారం కేదార్‌నాథ్ ధామ్‌ను సందర్శించడం ద్వారా ప్రజలు మోక్షాన్ని పొందుతారు. ప్రాపంచిక సుఖాలను అనుభవించిన తరువాత నేరుగా స్వర్గాన్ని చేరుకుంటారు. లింగ పురాణం ప్రకారం జీవితాన్ని త్యజించి కేదార్‌కుండ్‌లో నివసించే వ్యక్తి కూడా శివుడిలా అవుతాడు.

ఇవి కూడా చదవండి

కేదార్‌నాథ్ దర్శనం ఎందుకు అసంపూర్తి అంటే

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌కు నేపాల్‌కు చెందిన పశుపతినాథ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. పశుపతినాథుడు లేని కేదార్‌నాథ్ దర్శనం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. కేదార్‌నాథ్‌లో శివుడి శరీరం ఉందని.. పశుపతినాథ్‌లో శివుడి తల ఉందని నమ్మకం. అందుకనే కేదార్‌నాథ్ దర్శనం చేసుకోని పశుపతినాథ్ ఆలయ దర్శనం అసంపూర్తిగా పరిగణించబడుతుంది. పశుపతినాథుని దర్శించిన పుణ్యఫలితాలను పొందాలంటే కేదార్‌నాథ్‌ను సందర్శించడం అవసరమని భావిస్తారు. పరమశివుడు కేదార్‌నాథ్‌లో గేదె మూపురం రూపంలోనూ, పశుపతినాథ్‌లో గేదె తల రూపంలోనూ ఉన్నట్లు నమ్మకం..

కేదార్‌నాథ్- పశుపతినాథ్ అనుసంధానం

పురాణాల ప్రకారం మహాభారత యుద్ధంలో తన సొంతవారి మరణాన్ని కారణమైన పాండవులపై శివుడు చాలా కోపంగా ఉన్నాడు. యుద్ధం ముగిసిన అనంతరం తమ పాప ప్రక్షాళన కోసం పాండవులు శివుడి పూజించాలనుకున్నారు. శివుడిని క్షమాపణ కోరడానికి శివుడి దర్శనం కోసం పాండవులు కాశీకి చేరుకున్నారు. అయితే శివుడు పాండవులకు తన దర్శనం భాగ్యం కలిగించరాదని వారణాసి నుంచి మాయమై.. కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకున్నాడు. అయితే శివుడిని వెంబడిస్తూ పాండవులు కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకున్నప్పుడు.. శివుడు గేదె రూపాన్ని ధరించి సంచరిస్తున్నాడు.

పాండవులు శివుడిని గుర్తించినప్పుడు.. అతను భూమిలోకి వెళ్లి అదృశ్యం కావాలనుకున్నాడు. అప్పుడు ఈ విషయాన్నీ గుర్తించిన పాండవుల మధ్యముడు భీముడు గేదె రూపంలో ఉన్న శివుడిని పట్టుకున్నాడు. దీంతో శివుడు తల మరొక ప్రదేశానికి చేరుకుంది. శరీరం మాత్రమే కేదార్‌నాథ్‌లో మిగిలిపోయింది. అప్పటి నుంచి శివుని శరీర భాగాన్ని కేదార్‌నాథ్‌లో పూజించడం ప్రారంభమైంది. గేదె రూపంలో ఉన్న శివుడి తల చేరిన ప్రదేశం పశుపతినాథ్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం నేపాల్‌లో ఉంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.