AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karwa Chauth: కర్వా చౌత్.. వీరవతి, కర్వామాత, శివపార్వతుల వ్రత కథలు.. ఇలా చేస్తే శుభ ఫలితాలు!

karwa chauth 2026 vrat katha telugu: కర్వా చౌత్ 2026ను అక్టోబర్ 29, గురువారం నాడు ఆచరిస్తున్నారు. భర్త దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, వైవాహిక సౌభాగ్యం కోసం మహిళలు పాటించే ఈ పవిత్ర వ్రతంలో వీరవతి కథ, కర్వామాత కథ, శివపార్వతుల కథలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ మూడు వ్రత కథల ప్రాముఖ్యత, పూజా సంప్రదాయాలు, ఆచారాల గురించి తెలుసుకోండి.

Karwa Chauth: కర్వా చౌత్.. వీరవతి, కర్వామాత, శివపార్వతుల వ్రత కథలు.. ఇలా చేస్తే శుభ ఫలితాలు!
Karwa Chauth Vrat Katha
Rajashekher G
|

Updated on: Oct 29, 2026 | 8:15 AM

Share

Karwa Chauth Vrat Katha Telugu: హిందూ సంప్రదాయంలో కర్వా చౌత్ వ్రతానికి విశేష ప్రాధాన్యం ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 29, గురువారం నాడు ఈ పండుగను ఆచరిస్తున్నారు. ముఖ్యంగా వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, సుఖసంతోషాలతో కూడిన వైవాహిక జీవితం కోసం ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో పాటిస్తారు. సంప్రదాయం ప్రకారం, రోజంతా నిర్జల ఉపవాసం ఉండి, సాయంత్రం శివుడు, పార్వతీ దేవి, గణేశుడు, చంద్రదేవుడిని పూజిస్తారు. అనంతరం చంద్రుడిని దర్శించుకుని అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు. కర్వా చౌత్ రోజున వ్రత కథలను చదవడం, వినడం కూడా ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు. వీరవతి కథ, కర్వామాత కథ, శివపార్వతుల కథలు దాంపత్య ప్రేమ, అచంచలమైన విశ్వాసం, భక్తి, అంకితభావానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఆ కథల విశేషాలు తెలుసుకుందాం.

1. వీరవతి, ఆమె ఏడుగురు సోదరుల కథ

పూర్వకాలంలో వేదశర్మ అనే బ్రాహ్మణుడికి ఏడుగురు కుమారులు, వీరవతి అనే కుమార్తె ఉండేవారు. సోదరులందరికీ ఎంతో ప్రియమైన వీరవతికి వివాహమైన తర్వాత మొదటి కర్వా చౌత్ వచ్చింది. ఆ సందర్భంగా పుట్టింటికి వచ్చిన ఆమె తన భర్త క్షేమం కోసం నిర్జల వ్రతాన్ని ఆచరించింది. రోజంతా ఆకలిదప్పులతో అలసిపోయిన వీరవతిని చూసి సోదరులు తట్టుకోలేకపోయారు. ఆమె ఉపవాసాన్ని విరమింపజేయాలనే ఉద్దేశంతో, చెట్టు వెనుక దీపాన్ని వెలిగించి చంద్రుడు ఉదయించినట్లు భ్రమ కల్పించారు. అది నిజమైన చంద్రుడని నమ్మిన వీరవతి పూజ చేసి భోజనం చేయడానికి సిద్ధమైంది. అయితే ఆమె భోజనం ప్రారంభించిన వెంటనే అపశకునాలు ఎదురయ్యాయని, అనంతరం భర్త మరణవార్త తెలిసిందని కథ చెబుతుంది.

దుఃఖించిన వీరవతి తన తప్పును తెలుసుకుని, ఆ తర్వాతి కర్వా చౌత్‌ను పూర్తి నియమనిష్ఠలతో ఆచరించి, నిజమైన చంద్రుడికి అర్ఘ్యం సమర్పించింది. ఆమె భక్తికి మెచ్చిన దైవానుగ్రహంతో భర్త తిరిగి ప్రాణాలు పొందాడని పురాణ కథనం. ఈ కథ వ్రతాన్ని శ్రద్ధతో, సంప్రదాయబద్ధంగా ఆచరించాలనే సందేశాన్ని అందిస్తుంది.

2. కర్వామాత కథ

కర్వ అనే భక్తురాలు తన భర్తతో కలిసి నదీ తీరంలో నివసించేది. ఒకరోజు ఆమె భర్త నదిలో స్నానం చేస్తుండగా మొసలి అతని కాలును పట్టుకుని నీటిలోకి లాగింది. భర్త ఆర్తనాదాలు విన్న కర్వ వెంటనే అక్కడికి చేరుకుంది. తన పాతివ్రత్య బలంతో పచ్చి దూది దారంతో మొసలిని బంధించి, యమధర్మరాజును ప్రార్థించిందని కథనం. తన భర్త ప్రాణాలను కాపాడాలని, మొసలికి శిక్ష విధించాలని ఆమె కోరింది. కర్వ భక్తి, ధైర్యం, భర్తపై ఉన్న అపారమైన ప్రేమకు మెచ్చిన యముడు మొసలిని సంహరించి, ఆమె భర్తకు దీర్ఘాయుష్షును ప్రసాదించాడని చెబుతారు. ఈ కథ దృఢమైన సంకల్పం, ప్రేమ, విశ్వాసం మనిషికి కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాయని తెలియజేస్తుంది.

3. శివపార్వతుల కథ..

పౌరాణిక విశ్వాసాల ప్రకారం, ఒకసారి పార్వతీ దేవి వైవాహిక సౌభాగ్యాన్ని కాపాడే వ్రతం గురించి శివుడిని అడిగింది. అప్పుడు శివుడు.. కర్వా చౌత్ వ్రతం ప్రాముఖ్యతను వివరించాడని చెబుతారు. ఈ రోజున శివపార్వతులు, గణేశుడు, చంద్రదేవుడిని భక్తితో పూజించడం వల్ల దాంపత్య జీవితంలో సుఖశాంతులు, కుటుంబంలో శ్రేయస్సు కలుగుతాయని భక్తుల నమ్మకం. భర్త ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, కుటుంబ సౌభాగ్యం కోసం మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

కర్వా చౌత్ వ్రత కథల ప్రాముఖ్యత

కర్వా చౌత్ సందర్భంగా ఈ మూడు కథలను పఠించడం భక్తులు ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు. ఉపవాసంతో పాటు పూజ, వ్రత కథా శ్రవణం, చంద్రదర్శనం ఈ పండుగలో ప్రధాన భాగాలు. ఈ కథలు ప్రేమ, పరస్పర నమ్మకం, త్యాగం, భక్తి వంటి విలువలను గుర్తుచేస్తాయి. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం, భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించడం కుటుంబంలో సంతోషం, శాంతి, సౌభాగ్యం కలగాలని కోరుకునే ఆధ్యాత్మిక మార్గంగా భావిస్తారు.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న కర్వా చౌత్ వ్రత కథలు, ఆచారాలు, పూజా విధానాలు హిందూ మత విశ్వాసాలు, పురాణ కథనాలు, సంప్రదాయాల ఆధారంగా అందించబడ్డాయి. ప్రాంతం, కుటుంబ సంప్రదాయాలను బట్టి ఆచారాల్లో మార్పులు ఉండవచ్చు. ఈ కథనంలోని సమాచారం భక్తుల అవగాహన కోసం మాత్రమే అందించబడింది. మతపరమైన ఆచారాలను పాటించే ముందు మీ కుటుంబ సంప్రదాయాలు లేదా సంబంధిత పండితుల సూచనలను పరిగణనలోకి తీసుకోండి.)

Follow Us
కర్వా చౌత్.. వీరవతి, కర్వామాత, శివపార్వతుల వ్రత కథలు.. ఇలా చేస్తే
కర్వా చౌత్.. వీరవతి, కర్వామాత, శివపార్వతుల వ్రత కథలు.. ఇలా చేస్తే
భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే జీర్ణక్రియ మందగిస్తుందా?నిపుణులు
భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే జీర్ణక్రియ మందగిస్తుందా?నిపుణులు
క్యాన్సర్ రోగులకు ఉపశమనం: 543 రకాల మందుల ధరలు భారీగా తగ్గింపు
క్యాన్సర్ రోగులకు ఉపశమనం: 543 రకాల మందుల ధరలు భారీగా తగ్గింపు
త్వరలో భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఏ విధంగా తయారవుతాయంటే
త్వరలో భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఏ విధంగా తయారవుతాయంటే
నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్.. ఇవి తప్పనిసరి
నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్.. ఇవి తప్పనిసరి
దీపావళికి ఇల్లు క్లీన్ చేస్తున్న యజమాని.. కిటికీ ఓపెన్ చేయగా..
దీపావళికి ఇల్లు క్లీన్ చేస్తున్న యజమాని.. కిటికీ ఓపెన్ చేయగా..
పన్నీర్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మకాలపై ఏడాదిపాటు బ్యాన్..
పన్నీర్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మకాలపై ఏడాదిపాటు బ్యాన్..
Video: రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ.. స్పెయిన్‌లో 68 మంది మృతి!
Video: రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ.. స్పెయిన్‌లో 68 మంది మృతి!
కర్వా చౌత్.. చంద్రోదయం సమయం, పూజా ముహూర్తం, వ్రత నియమాలు ఇవే!
కర్వా చౌత్.. చంద్రోదయం సమయం, పూజా ముహూర్తం, వ్రత నియమాలు ఇవే!
35 ఏళ్ల తర్వాత అద్భుతం.. అసలెవరీ నయా ఆల్ రౌండర్..!
35 ఏళ్ల తర్వాత అద్భుతం.. అసలెవరీ నయా ఆల్ రౌండర్..!