Ganesh Chaturthi 2023: వినాయక చవితి ఆ రోజే.. భక్తులు ధర్మసందేహానికి వేద పండితుల క్లారిటీ..
Ganesh Chaturthi 2023: ఏదైనా పండుగ చేసుకోవాలంటే ఆ పండుగకు సంబంధించిన శుభ ఘడియలు ఉన్న సమయంలోనే జరుపుకోవాలి. పండితులు కూడా అదే చెబుతుంటారు. అయితే ఈ ఏడాది వినాయక చవితి పండుగ జరుపుకునే సమయంలో శుభ ఘడియలు ఎప్పుడు అన్న గందరగోళం నెలకొంది. వినాయక చవితి ఈనెల 18న జరుపుకోవాలా..? 19న జరుపుకోవాలా అన్నది 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.
Ganesh Chaturthi 2023: ఏదైనా పండుగ చేసుకోవాలంటే ఆ పండుగకు సంబంధించిన శుభ ఘడియలు ఉన్న సమయంలోనే జరుపుకోవాలి. పండితులు కూడా అదే చెబుతుంటారు. అయితే ఈ ఏడాది వినాయక చవితి పండుగ జరుపుకునే సమయంలో శుభ ఘడియలు ఎప్పుడు అన్న గందరగోళం నెలకొంది. వినాయక చవితి ఈనెల 18న జరుపుకోవాలా..? 19న జరుపుకోవాలా అన్నది 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. దీంతో వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దేవస్థానం వేద పడితులు… భక్తులు ధర్మసందేహానికి క్లారిటీ ఇచ్చారు.
పండుగ ఏదైనా కాంట్రవర్సీ కామనే. విజ్ఞాలకు అధిపతి అయిన వినాయకుడి ఫెస్టివల్‌కు కూడా ఈ కష్టాలు తప్పలేదు. వాస్తవానికి ఈ మధ్య ఏ పండుగ వచ్చినా.. అది ఏ రోజు నిర్వహించుకోవాలని అనేదానిపై కొంత కన్‌ఫ్యూజ్ నెలకొంటుంది.. వేద పండితులు, అర్చకుల్లోనూ దీనిపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతుంటారు. కొంతమంది ఈ తిథిలో జరుపుకోవాలంటే.. అలా కాదు.. ఆ గడియాలే కీలకం అని వాధిస్తుంటారు ఇంకొందరు. అయితే, ఈ నెలలో రాబోతోన్న వినాయక చవితి విషయంలోనూ ఇదే సందిగ్ధత నెలకొంది. ఈ నెల 18వ తేదీన వినాయక చవితి నిర్వహించుకోవాలని కొందరు పండితులు, అర్చకులు అంటుంటే.. లేదు 19వ తేదీనే మంచిదని మరికొందరు అంటున్నారు. దాంతో ఈ ఏడాది వినాయక చవితి 18వ తేదీన జరుపుకోవాలా.. లేక 19వ తేదీన చవితి చేసుకోవాలా అన్న కన్ఫ్యూజన్ కొనసాగుతోంది.
వినాయకుడు విజ్ఞాలన్నింటికీ అధిపతి అయినా చవితి పండుగ ఎప్పుడు జరుపుకోవాలన్న దానిపై ఒక కొత్త సమస్యకు కారణమైంది. అయితే వినాయక చవితి ఈనెల 18వ తేదీనే జరుపుకోవాలని స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం స్పష్టం చేస్తోంది. 18నే కాణిపాకం దేవస్థానం వినాయక చవితి పండుగను జరుపుతోంది. భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి పై ఎన్నో వాదనలు ఉన్నాయంటున్న అర్చకులు.. చంద్రమానం ప్రకారం చవితి తిధి 18నే ఉందని చెబుతున్నారు. వినాయక చవితి పండుగ అదేరోజు జరుపుకోవాలంటున్నారు. ఇదీ.. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం అర్చకులు చెబుతున్నమాట. ఈ నెల 18వ తేదీ నుండి 21 రోజుల పాటు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం వేద పండితులు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..