Owl Weeping: గుడ్లగూబ 3 రోజులు ఏడిస్తే అనర్ధం జరుగుతుందనే.. నమ్మకం వెనుక నిజం ఏమిటంటే..

|

Jun 22, 2023 | 10:46 AM

పక్షుల్లో ఒకటి గుడ్లగూబ. చూడడానికి కొంచెం భయంకరంగా ఉండే ఈ పక్షిని కొద్ది మంది చూసి ఉంటారు. ఇది  పగటిపూట నిద్రపోతూ, నిద్రలేచి రాత్రి వేటాడుతుందని చెబుతారు. రాత్రివేళ చీకట్లో చురుకుగా చూసే గుడ్ల గూబ .. తన ఎరను చూసి పట్టుకోకుండా.. గొంతు విని పట్టుకుంటుందని అంటారు. గుడ్లగూబకు సంబంధించిన ఒక నమ్మకం సమాజంలో ప్రచారంలో ఉంది.

Owl Weeping: గుడ్లగూబ 3 రోజులు ఏడిస్తే అనర్ధం జరుగుతుందనే.. నమ్మకం వెనుక నిజం ఏమిటంటే..
Owl Weeping
Follow us on

శతాబ్దాలుగా మన సమాజంలో శకునాలు, కలలుకు సంబంధించిన అనేక మూఢనమ్మకాలున్నాయి. కొన్ని కొన్ని సంఘటనలను ప్రజలు నిజమని నమ్ముతారు. అయితే వీటిల్లో కొన్నింటిని గుడ్డిగా నమ్మే అనేక విషయాలు ఉన్నాయి. పిల్లి ఎదురు రావడం బయటకు వెళ్తుంటే తుమ్మడం వంటి వాటిని దుశ్శకునాలుగా భావిస్తారు. అంతేకాదు గుడ్లగూబకు సంబంధించిన ఒక మూఢ నమ్మకం కూడా ఉంది. పురాణంలో ఉన్న గుడ్లగూబకు సంబదించిన ఒక నమ్మకం గురించి తెల్సుకుందాం..

పక్షుల్లో ఒకటి గుడ్లగూబ. చూడడానికి కొంచెం భయంకరంగా ఉండే ఈ పక్షిని కొద్ది మంది చూసి ఉంటారు. ఇది  పగటిపూట నిద్రపోతూ, నిద్రలేచి రాత్రి వేటాడుతుందని చెబుతారు. రాత్రివేళ చీకట్లో చురుకుగా చూసే గుడ్ల గూబ .. తన ఎరను చూసి పట్టుకోకుండా.. గొంతు విని పట్టుకుంటుందని అంటారు. గుడ్లగూబకు సంబంధించిన ఒక నమ్మకం సమాజంలో ప్రచారంలో ఉంది. గుడ్లగూబ ఏడుపు చెడు శకునం అని అంటారు. ఎవరి ఇంటివద్దనైనా గుడ్లగూబ మూడు రోజుల పాటు నిరంతరం ఏడుస్తూ ఉంటే.. ఆ ఇంట్లో అసాధారణ పరిస్థితులు నెలకొంటాయని.. కొన్ని అవాంఛనీయ లేదా దొంగతనం-దోపిడీ సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయని చాలా మంది నమ్ముతారు.

ఈ నమ్మకంలో నిజం ఏమిటంటే?
గుడ్లగూబకు సంబంధించిన ఈ విషయాలను గుడ్డిగా నమ్మేవారిలో మీరు కూడా ఒకరా? అయితే ఇది కేవలం మూఢనమ్మకం, అపోహలు మాత్రమేనని చెబుతున్నారు. ఇలాంటి నమ్మకాలకు ఎంత దూరంగా ఉంటె అంత మంచిదని చెబుతున్నారు. గుడ్లగూబ నవ్వులు, ఏడ్పులతో మానవ జీవితానికి ఎటువంటి సంబంధం లేదు. గుడ్లగూబ అరుపు వల్ల డబ్బు నష్టం జరగదు..  దొంగతనం-దోపిడీ జరగదు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. కనుక ఆధునిక కాలంలో ఉన్న మనం ఇలాంటి వాటిని కేవలం మూఢనమ్మకంగా మాత్రమే పరిగణిస్తే మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).