Tulasi Plant: తులసి పూజ కోసం ప్రత్యేక నియమాలు.. పొరపాటున కూడా ఆకులు కోసే సమయంలో ఇలాంటి తప్పులు చేయవద్దు..

|

Nov 22, 2022 | 9:13 AM

తులసి మొక్కలో విష్ణువు,లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు. ఆకులను కోయరాదు. తులసి ఆకులను ఉదయం లేదా పగలు మాత్రమే తెంపుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులను మొక్కనుంచి కట్ చేయవద్దు. 

Tulasi Plant: తులసి పూజ కోసం ప్రత్యేక నియమాలు.. పొరపాటున కూడా ఆకులు కోసే సమయంలో ఇలాంటి తప్పులు చేయవద్దు..
Tulasi Puja
Follow us on

హిందూమతంలో తులసి చాలా పవిత్రమైన మొక్కగా పరిగణించబడుతుంది. తులసి మొక్కను దేవతగా భావించి ప్రతిరోజూ పూజిస్తారు. హిందూ మతాన్ని అనుసరించే ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది. తులసిని ఆనందం, శ్రేయస్సు , విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు. తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. అందుకే తులసిని హరిప్రియ అని పిలుస్తారు. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.

తులసి మొక్క మతపరమైన ప్రాముఖ్యతతో పాటు.. అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. తులసి ఆకులలోని ఔషధ గుణాల కారణంగా అనేక వ్యాధులను నయం చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అంతేకాదు జ్యోతిష్యం, వాస్తు శాస్త్రంలో తులసి మొక్కకు ప్రాముఖ్యత ఉంది. తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది. తులసి మొక్క ప్రాముఖ్యత, పూజా విధానం, జాగ్రత్తలు, చేయవలసినవి, చేయకూడనివి ఈరోజు తెలుసుకుందాం.

తులసి పూజ విధానం
తులసి మొక్కలో విష్ణువు,లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు. ఆకులను కోయరాదు. తులసి ఆకులను ఉదయం లేదా పగలు మాత్రమే తెంపుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులను మొక్కనుంచి కట్ చేయవద్దు.

ఇవి కూడా చదవండి

తులసి ఆకులను తెంపడానికి నియమాలు:
పురాణ గ్రంథాల్లో తులసి ఆకులను తెంపడానికి కూడా నియమాలు పేర్కొన్నారు. తులసి ఆకులను ఎప్పుడూ గోళ్ల సహాయంతోతెంపరాదు. తులసి మొక్కల ఎండిన ఆకులు నేలపై పడితే.. వాటిని పాదాలకు తాకని విధంగా పడేయాల్సి ఉంటుంది. లేదా తిరిగి మొక్క దగ్గర ఉంచండి. తులసి మొక్కను  అవమానించిన ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవని విశ్వాసం. తులసి మొక్కను ఎటువంటి పరిస్థితిలోనూ దక్షిణ దిశలో పెంచుకోరాదు. తులసి మొక్కను ఎల్లప్పుడూ తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచండి లేదా భూమిలో నాటండి.

శాస్త్రాల ప్రకారం, ఆదివారం, ఏకాదశి , గ్రహణం రోజున తులసి ఆకులను తీయకూడదు. అంతే కాకుండా ఆదివారం, ఏకాదశి రోజుల్లో తులసి మొక్కకు నీరు సమర్పించకూడదు. ఎందుకంటే ఈ రెండు రోజుల్లో తులసి విష్ణువు కోసం ఉపవాస దీక్షలో ఉంటుందని.. అందుకనే నీరు తీసుకోదని.. కనుక ఈ రోజుల్లో తులసికి నీరు పెట్టడం నిషేధం.

తులసి మొక్క మతపరమైన ప్రాముఖ్యత
తులసి మొక్కకు చాలా మతపరమైన ప్రాముఖ్యత ఉంది. తులసి దళం లేకుండా దేవుని ఆరాధన సంపూర్ణంగా పరిగణించబడదు. తులసి ఆకులు దేవుడి పూజకు వినియోగిస్తారు. తులసి దళం లేని విష్ణువు, కృష్ణుడు, రామభక్తుల ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. లక్ష్మి తులసి మొక్కలో నివసిస్తుంది. తులసిని ప్రతిరోజూ ఎక్కడ పూజిస్తారో, అక్కడ ఆనందం , శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు తీరతాయని..  అన్ని రకాల ప్రతికూల నుంచి రక్షణ ఇస్తుందని విశ్వరం. హిందూ మతంలో ఒక వ్యక్తి మరణించిన అనంతరం అతని నోట్లో గంగాజలంతో తులసి ఆకులను వేసి మృతదేహం నోటిలో వేస్తారు. దీనిని తులసి తీర్ధం అని అంటారు. ఇలా చేయడం వల్ల మరణించిన వ్యక్తుల ఆత్మకు శాంతి చేకూరుతుందని విష్ణుమూర్తి పాదాల చెంత స్వర్గంలో స్థానం పొందుతారని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..