AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే వాస్తు దోషం ఉన్నట్లే! ఇలా వదిలించుకోండి

వాస్తు శాస్త్రం అనేది మన ఇంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపే శాస్త్రం. ఏ వస్తువును ఎక్కడ ఉంచాలో, ఏ రీతిగా గదులను ఏర్పాటు చేసుకోవాలో చెప్పడం వలన జీవితం సుఖంగా, సంతోషంగా సాగుతుందని నమ్మకం ఉంది. అయితే, అనేక మంది వాస్తు నియమాలను అనుసరించకపోవడం వల్ల చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వాస్తు దోషాలను గుర్తించడానికి కొన్ని సాధ్యమైన మార్గాలు కూడా ఉన్నాయి.

మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే వాస్తు దోషం ఉన్నట్లే! ఇలా వదిలించుకోండి
Vastu
Rajashekher G
|

Updated on: Jan 10, 2026 | 5:23 PM

Share

వాస్తు శాస్త్రం అనేది ఇంట్లోని అనేక సమస్యలకు పరిస్కారం చూపిస్తుంది. ఇంటి నిర్మాణం, వస్తువుల అమరిక, ఇలా అనేక విషయాల గురించి వివరిస్తుంది. ఏ వస్తువు ఎక్కడ ఉంటే జీవితం సాగిపోతుందో తెలియజేస్తుంది. వాస్తు శాస్త్రం ఇంటికి సంబంధించిన నియమాలను వివరిస్తుంది. వీటిని పాటిస్తే జీవితం సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. అయితే, చాలా మంది వాస్తు నియమాలను పాటించకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు దోషాలను తెలుసుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.

మీ ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి ఉపయోగించే కొన్ని సంకేతాలను వాస్తు శాస్త్రం వివరిస్తుంది. మీ ఇంట్లో ఈ సంకేతాలను మీరు గమనించినట్లయితే.. వాటిని విస్మరించకుండా, వాటిని సరిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది.

వాస్తు దోష సంకేతాలు

ఇంట్లో వివరించలేని బాధ వాస్తు దోషానికి సంకేతంగా చెప్పవచ్చు. కష్టపడి పనిచేసినా విజయం లేకపోవడం కూడా వాస్తు దోషానికి సంకేతంగా పరిగణించవచ్చు. ఇంట్లో నిరంతర అనారోగ్యం, ఆర్థిక సమస్యలు కూడా వాస్తు దోషానికి సంకేతాలు కావచ్చు. లీకయ్యే కుళాయి ఆర్థిక నష్టాలను, వాస్తు దోషాలను సూచిస్తుంది.

ఇంట్లో ఈశాన్యంలో టాయిలెట్లు ఉండటం వల్ల కూడా వాస్తు దోషం రావచ్చు. సహజ కాంతి లేని ఇంటి మూలల్లో ప్రతికూల శక్తి నివాసం ఉండి, వాస్తు దోషాలకు దారితీస్తుంది. ఇంకా, ఇంటి చుట్టూ, ప్రధాన ద్వారం వద్ద వస్తువులు, ఇతర వ్యర్థ పదార్థాలు చిందరవందరగా ఉండటం కూడా వాస్తు దోషాలకు కారణమవుతుంది.

వాస్తు దోషాల నివారణ

వాస్తు దోషాలు తొలగించేందుకు ఇంట్లో వాస్తు శాంతి పారాయణ చేయాలి సాయంత్రం సమయంలో కర్పూరం వెలిగించి ఇంటి చుట్టూ తిప్పాలి సాయంత్రం వేళల్లో ఇంటి ప్రధాన ద్వారా దగ్గర, తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. ఇల్లు శుభ్రంగా, గాలి వచ్చేలా చూడాలి. ఈ చర్యలను పాటించడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పునరుద్ధించవచ్చని విశ్వాసం.

Note: ఈ వార్తలోని సమాచారం వాస్తుశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9 ధృవీకరించదు.

తెలంగాణలో పోటీకి సై అంటోన్న జససేనా..!
తెలంగాణలో పోటీకి సై అంటోన్న జససేనా..!
తత్కాల్‌ టికెట్‌ను రద్దు చేసుకుంటే రీఫండ్‌ ఎందుకు రాదు?
తత్కాల్‌ టికెట్‌ను రద్దు చేసుకుంటే రీఫండ్‌ ఎందుకు రాదు?
మీకు GST నోటీస్‌ వచ్చిందా? అది నిజమైందా? ఫేకా ఇలా తెలుసుకోండి!
మీకు GST నోటీస్‌ వచ్చిందా? అది నిజమైందా? ఫేకా ఇలా తెలుసుకోండి!
టమోటాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే మీరు పెద్ద తప్పు చేసినట్టే
టమోటాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే మీరు పెద్ద తప్పు చేసినట్టే
ఇక డిగ్రీ విద్యార్ధులకూ ఇంటర్న్‌షిప్ తప్పనిసరి.. స్టైపెండ్‌ కూడా!
ఇక డిగ్రీ విద్యార్ధులకూ ఇంటర్న్‌షిప్ తప్పనిసరి.. స్టైపెండ్‌ కూడా!
అద్దం అక్కడ ఉందా..? మీ ఇంట్లో ఈ సమస్యలు ఖాయం.. వెంటనే ఇలా..
అద్దం అక్కడ ఉందా..? మీ ఇంట్లో ఈ సమస్యలు ఖాయం.. వెంటనే ఇలా..
ప్రాణం తీసిన పొగమంచు.. నలుగురు దుర్మరణం..!
ప్రాణం తీసిన పొగమంచు.. నలుగురు దుర్మరణం..!
ఉడికించిన గుడ్లను ఎంతటైంలోపు తొనొచ్చు? వాటిని ఎలా స్టోర్ చేయాలి
ఉడికించిన గుడ్లను ఎంతటైంలోపు తొనొచ్చు? వాటిని ఎలా స్టోర్ చేయాలి
చికెన్ లెగ్ పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న..
చికెన్ లెగ్ పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న..
చైనాకు చెక్‌? అమెరికా నుంచి భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం!
చైనాకు చెక్‌? అమెరికా నుంచి భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం!