హిందూపురాణాల్లో వీరులు ఎన్ని రకాలో తెలుసా! అతిరథ మహారథులు ఏకకాలంలో ఎంతమందితో యుద్ధం చేస్తారంటే..

|

Sep 28, 2021 | 10:26 AM

Hinduism and Spirituality: అతిరథ మహారథులందరూ వచ్చారంటూ మాట్లాడుకోవడం మనకు తెలుసు.. అయితే అప్పుడు ఎవరో గొప్పవారు వచ్చినట్లు ఉన్నారు అని భావిస్తాం.. అంతవరకు మాత్రమే..

హిందూపురాణాల్లో వీరులు ఎన్ని రకాలో తెలుసా! అతిరథ మహారథులు ఏకకాలంలో ఎంతమందితో యుద్ధం చేస్తారంటే..
Atirathi And Maharathi
Follow us on

Hinduism and Spirituality: అతిరథ మహారథులందరూ వచ్చారంటూ మాట్లాడుకోవడం మనకు తెలుసు.. అయితే అప్పుడు ఎవరో గొప్పవారు వచ్చినట్లు ఉన్నారు అని భావిస్తాం.. అంతవరకు మాత్రమే అతిరథ మహారథులకు అర్ధం తెలుసు.. కానీ అతిరథ మహారథి పాదాలకు సరైన అర్ధం ప్రస్తుత జనరేషన్ లో చాలా మందికి తెలియదు. ఈపదాలు మన పురాణాల్లో, రామాయణ , మహాభారతంలోని కొన్ని పాత్రల యుద్ధనైపుణ్యాన్ని తెలుపుతాయి. అతిరథ, అతిరథ మహారథ పదాలను యుద్ధంలో పాల్గొనే యోధుల సామర్ధ్యాన్ని తెలుపుతాయి. వీటిని ఐదు స్థాయిలుగా విభజించారు. అవి రథి, అతిరథి, మహారథి, అతిమహారథి, మహామహారథి. ఈ రోజు ఈ పదాలకు పదాలకు అర్ధాన్ని ఏ సందర్భంలో వాడతారో.. రామాయణ, మహాభారతంలో వీరుల గురించి తెలుసుకుందాం..

 రథి: ఏకకాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలవారిని రథి అని అంటారు.  సోమదత్తుడు, సుదక్షిణ, శకుని, శిశుపాల, ఉత్తర, తో పాటు కౌరవుల్లో 96 మంది, శిఖండి, ఉత్తమౌజులు, ద్రౌపది కొడుకులు ఉపపాండవులు వీరందరూ రథులు. ఏకకాలంలో ఐదువేల మందితో యుధ్దం చేయగలరు. #

 అతిరథి : రథికి 12రెట్లు అంటే ఏకకాలంలో  60,000మందితో ఒకేసారి యుద్ధం చేయగలవారిని అతిరథి అని అంటారు. లవకుశులు, కృతవర్మ, శల్య, కృపాచార్య, భూరిశ్రవ, ద్రుపద, యుయుత్సు, విరాట, అకంపన, సాత్యకి, దృష్టద్యుమ్న, కుంతిభోజ, ఘటోత్కచ, ప్రహస్త, అంగద, దుర్యోధన, జయద్రథ, దుశ్శాసన, వికర్ణ, విరాట, యుధిష్ఠిర, నకుల, సహదేవ, ప్రద్యుమ్నులు వీరంతా అతిరథులు. ఏకకాలంలో 60వేల మందితో యుద్ధం చేయగల వీరులు.

మహారథి : అతిరథికి 12రెట్లు.. అంటే 7,20,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల వీరుడిని మహారథి అని అంటారు. ఈ కోవలోకి రాముడు, కృష్ణుడు, లక్ష్మణుడు , అభిమన్యుడు, వాలి, అంగద, అశ్వత్థామ, అతికాయ, భీమ, కర్ణ, అర్జున, భీష్మ, ద్రోణ, కుంభకర్ణ, సుగ్రీవ, జాంబవంత, రావణ, భగదత్త, నరకాసుర, లక్ష్మణ, బలరామ, జరాసంధుడు తదితర వీరులంతా మహారథుల కోవలోకి వస్తారు. వీరిని మహారథులు అంటారు.  రామరావణ యుద్ధంలో పాల్గొన్న రామలక్ష్మణ, రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.

అతిమహారథి : మహారథికి 12రెట్లు అంటే 86,40,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల వీరుడిని అతిమహారథుడు అని అంటారు. ఇంద్రజిత్తు, పరశురాముడు, ఆంజనేయుడు, వీరభద్రుడు, భైరవుడు వీరంతా అతి మహారథులు. వీరు ఏకకాలంలో  ఎనభై ఆరులక్షల నలభైవేల మందితో యుద్ధం చేయగలరు. సీతను విడిపించే సమయంలో జరిగిన రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు.. అటు ఇంద్రజిత్తు – ఇటు ఆంజనేయుడు.

మహామహారథి: అతిమహారథికి 24రెట్లు అంటే ఏకకాలంలో 207,360,000 మందితో ఏకకాలంలో యుద్ధం చేయగల వీరుడిని మహామహారథి అని అంటారు. ఈ కోవలోకి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు, దుర్గాదేవి, గణపతి , సుబ్రహ్మణ్య స్వామి లు వస్తారు.  వీరంతా..మహామహారథులు.. ఒకేసారి ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలమందితో యుద్ధం చేయగల నైపుణ్యం వీరి సొంతం.. అయితే  మహామహారథులలో దుర్గాదేవి అమ్మవారు ఉన్నారు. ఇది హిందూ ధర్మంలోనే కనిపించే మహిళా సాధికారతకు నిదర్శనం.

Also Read: Bamboo Farming: చదివింది ఎల్‌ఎల్‌బీ.. చేసేది వ్యవసాయం.. అంతరపంటగా వెదురు.. 7 ఏళ్లలో 4 రెట్లు లాభాలు ఆర్జించిన రైతు..