HOROSCOPE TODAY : సంఘంలో విశేషమైన గౌరవం.. స్థిరాస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.. నూతన పెట్టుబడులకు శ్రీకారం..
RASI PHALALU- 2021 ON MAY 27 : మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ
RASI PHALALU- 2021 ON MAY 27 : మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. ఈరోజు బుధవారం (మే 27న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి : సంఘంలో విశేషమైన గౌరవం లభిస్తుంది. అన్ని పనులను ప్రణాళిక వేసుకుని మొదలు పెట్టండి. ఈరోజు ఏ పనులను పెండింగ్ ఉంచకూడదు అనే పూర్తి ఉత్సాహంతో మొత్తం పనులను పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.
వృషభ రాశి : పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అతి కోపము, నిరాశావాదం ఈ రెండూ మీకు పనికిరావు గుర్తుంచుకోండి. ఉద్యోగంలో అధిక శ్రమ ఉన్నా పనులను పూర్తిచేస్తారు. రాబడి కన్నా ఖర్చు అధికంగా ఉండే అవకాశం జాగ్రత్త వహించండి.
మిధున రాశి : ఈ కరోనా సమయంలో ఆరోగ్యం కాపాడుకోవడానికి నడక మంచిది. వంశపారంపర్యంగా రావలసిన ఆస్తుల విషయంలో మీకు అనుకూలంగా ఒక విషయం తెలుస్తుంది. విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి.
కర్కాటక రాశి : వ్యాపారంలో రావలసిన పెట్టుబడులు సమకూరుతాయి. ఆఫీసులో పనులు నిదానంగా సాగటం వలన అశాంతి. కొందరికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత నిరాశ కలిగించినా క్రమేపీ మెరుగుపడుతుంది.
సింహరాశి : పనులు పూర్తి కావాలంటే ప్రణాళిక తప్పనిసరి ఇది మీ జీవితంలో గుర్తుంచుకోండి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా ఖర్చులను తగ్గించండి డబ్బును పొదుపు చేయండి. పనులలో అతి శ్రమ మీకు అశాంతి కలిగిస్తుంది. ఈ రాశి స్త్రీలకు కొన్ని పనులు ఆందోళనను కలిగిస్తాయి.
కన్య రాశి : కుటుంబంలోని వ్యక్తులతో నిజాయితీతో మెలగండి అందరి మద్దతు మీకు లభిస్తుంది. ఆఫీసులో కొత్త బాధ్యతలు మిమ్మల్ని శ్రమకు గురి చేస్తాయి. మనస్సులోకి ఆందోళనను రానీయకుండా ప్రశాంతంగా పని చేయండి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. స్పెక్యులేషన్ వల్ల ధన నష్టం అనవసరపు ఖర్చులు జోలికి పోకండి.
తులారాశి : ఈ కరోనా సమయంలో డబ్బు ఉద్యోగం, కుటుంబం విషయాలలో లేనిపోని అనుమానాలతో టెన్షన్ పడతారు. ఏది ముగిసిపోలేదు అని గుర్తుంచుకోండి సరైన ప్రణాళికతో వీటన్నిటినీ అధిగమిస్తారు. ఫిట్నెస్ కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆఫీసులో మీ కింది ఉద్యోగులు అన్ని విధాలుగా మీకు మద్దతు తెలుపుతారు.
వృశ్చిక రాశి : ఆకస్మిక ధన లాభం. వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తిలో మీకో శుభవార్త. అతిగా తినకండి ఫిట్నెస్ కాపాడుకోండి వ్యాయామం చేయండి. అన్ని విధాలుగా మంచి రోజు ఉద్యోగంలో మీ పనిని పై అధికారులు ప్రశంసిస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ జీవిత భాగస్వామి యొక్క కేరింగ్ మీకు పూర్తి భరోసా ఇస్తుంది.
ధనస్సు రాశి : కుటుంబంలోని వాతావరణం మీకు ప్రశాంతతను ఇస్తుంది. స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలమైన సమయం. ముఖ్యమైన నిర్ణయాలలో మీ విలువలను వదులుకోకండి. మీకు రావలసిన బాకీలు కొంత ఇబ్బంది పెట్టినా చివరికి దక్కుతాయి. ఆఫీసులో పని విషయంలో శ్రమ పెరిగినా పట్టుదలతో సహనంతో పూర్తిచేస్తారు.
కుంభరాశి : వ్యాపారంలో, ఆఫీసులో, కుటుంబ వ్యవహారాలలో ఇతరుల సహకారం తీసుకోండి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి వారితో సమయం గడపండి. దానివలన కుటుంబ వ్యవహారాలు పూర్తిగా సంతృప్తి నిస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు లో అనుకోని అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మకర రాశి : ఆర్థిక విషయాలలో ప్రణాళిక వేసుకోండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్త పరచుకోండి. వచ్చిన అవకాశాలను కాలదన్ను కోకండి. తెలివైన నిర్ణయం తీసుకోండి. ఆఫీసులో సహోద్యోగుల తో మరియు పై అధికారులతో వాదోపవాదాలకు దిగకండి. ఉద్యోగానికి ప్రమాదం. నూతన పెట్టుబడులకు సరైన సమయం.
మీన రాశి : సామాజిక కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు. మీకు అందరి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక విషయాలలో మీరు కోరుకున్న స్థితి లభించే అవకాశం. ఫిట్ నెస్ కాపాడుకోవటానికి అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తారు. మీ సరైన ఆలోచన అన్ని విధాలుగా మీకు విజయం వైపు మార్గం చూపుతుంది. ఆత్మీయులతో గడపటం వలన మానసిక ప్రశాంతత.