Horoscope Today: ‘జన్మాష్టమి’ వీరికి ఎంతో ప్రత్యేకమైన రోజు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today 19 August 2022: ఈరోజు రాశిఫలం మొత్తం 12 రాశుల వారికి ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు ఎలా ఉంటుందో అని చాలామంది దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఆగస్టు 19వ తేదీ శుక్రవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
Horoscope Today 19 August 2022: ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని వెంటనే తమ దినఫలాల(Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆగస్టు 19వ తేదీ ) శుక్రవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..! గ్రహం, రాశుల కదలిక ఆధారంగా ఈ రోజున నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయో లేదో రోజువారీ జాతకం మీకు తెలియజేస్తుంది.
మేషం- ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యాపార ప్రణాళికలు విజయవంతం అవుతాయి. సోదరుల సహకారంతో పనులు సాగుతాయి.
వృషభం- కొంతమంది స్నేహితుల సహాయంతో, మీరు కొత్త వ్యాపార ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. రాజకీయాల్లో విజయం సాధిస్తారు.
మిథునం- ఈరోజు ఉద్యోగ, వ్యాపారాలలో లాభం చేకూరనుంది. కాకుంటే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు.
కర్కాటకం- మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో టెన్షన్ ఉంటుంది. ఏదైనా కొత్త వ్యాపార ప్రణాళిక ఫలవంతంగా ఉంటుంది.
సింహం- మీరు కొన్ని కొత్త పనుల పట్ల ప్రేరణ పొందుతారు. ఉద్యోగ మార్పు ప్రణాళిక ఉంటుంది. స్నేహితుని సహాయంతో వ్యాపారంలో విజయం సాధిస్తారు.
కన్య- ఈరోజు వాహనం కొనుగోలు చేయవచ్చు. ఈరోజు మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు.
తుల రాశి- ఈరోజు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కుటుంబంలో ఏదైనా బంధుత్వం కారణంగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది.
వృశ్చికం- ఈరోజు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కుటుంబంలో ఏదైనా బంధుత్వం కారణంగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి- ఉద్యోగంలో శుభవార్తలు అందుతాయి. నిలిచిపోయిన డబ్బు రాక సంకేతాలు ఉన్నాయి.
మకరం- ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు. తండ్రి పాదాలను తాకి ఆశీస్సులు పొందండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కుంభం- విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు. వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఉద్యోగ విషయంలో సంతృప్తిగా ఉంటారు.
మీనం- ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు విజయం సాధిస్తారు.
గమనిక: రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం.