Holi 2022: స్మశానంలోని చితి బూడిదతో హోలీ.. 350 ఏళ్లుగా అదే ఆచారం.. ఎక్కడంటే..

|

Mar 16, 2022 | 8:25 AM

హిందూ సాంప్రదాయంలో హోలీ (Holi) పండగకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. విష్ణువు నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశపుడిని

Holi 2022: స్మశానంలోని చితి బూడిదతో హోలీ.. 350 ఏళ్లుగా అదే ఆచారం.. ఎక్కడంటే..
Holi
Follow us on

హిందూ సాంప్రదాయంలో హోలీ (Holi) పండగకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. విష్ణువు నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశపుడిని చంపడం వలన ఈ పండగ వచ్చిందని విశ్వాసం. ఈ హోలీ పండగను దేశవ్యాప్తంగా ఈ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మథుర, బృందావనం, బర్సానా ప్రాంతాలలో హోలీని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అలాగే కాశీలో హోలీ ఏకాదశితో ప్రారంభమవుతుంది. ఈరోజున అక్కడి ప్రజలు.. మహేశ్వరుడి సన్నిదికి సమీపంలోని స్మశానంలో చితి బూడిదతో హోలీ జరుపుకుంటారు. చితి బూడిదతో హోలీ పండగను ప్రారంభించిన తర్వాతే.. కాశీలో హోలీ మొదలవుతుంది.

మోక్షదాయిని కాశిలో స్మశానవాటిక అయిన హరిశ్చంద్ర ఘాట్ వద్ద చితి మంట ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. ఇక్కడ 24 గంటలు దహనాలు.. అంత్యక్రియలు జరుగుతుంటాయి. కలుపు మొక్కల మధ్య స్మశానవాటికలో ఎప్పుడూ దహన సంస్కారాలు జరుగుతున్న చోట సంవత్సరానికి ఒక పండగ వస్తుంది. అదే రంగభారీ ఏకాదశి. వారణమాసిలో సోమవారం మార్చి 14న రంగుల ఏకాదశి స్మశానవాటికలో చితాభస్మంతో హోలీని ఆడారు.. డ్రమ్.. ఘరియాల్, మృదంగంతో సహా అన్నిరకాల సంగీత ద్వనుల మధ్య హోలీని చితాభస్మంతో ఆడారు. రంగులకు అతీతంగా ఈ చితాభస్మంతో ఏల్ల తరబడి ఈ హోలీని ఆడతారు. ఈ చితాభస్మంతో హోలీ ఆటను దాదాపుగా 350 ఏళ్లుగా ఆడుతున్నారని అంటుంటారు.. ఈ నమ్మకం చాలా పురాతనకాలం నుంచి ఉంది. రంగభారీ ఏకాదశి రోజున విశ్వనాథుడు పార్వతీ దేవికి ఆవును సమర్పించి కాశీకి చేరుకున్నప్పుడు.. అతను తన గణాలతో హోలీ ఆడినట్లుగా చెబుతుంటారు. కానీ ఆ శివయ్యకు తాను ఉండే స్మశానవాటికలో అఘోరాలతో కలిసి హోలీ ఆడలేకపోయాడు.. అందుకే రంగభారీ ఏకాదశి ప్రారంభమైన ఐదు రోజుల హోలీ పండగలో విశ్వనాథ్ అంత్యక్రియల చితిపై వారితో కలిసి హోలీ ఆడటానికి స్మశానవాటికకు వస్తాడు.

అలాగే రంగభారీ ఏకాదశి హరిశ్చంద్ర ఘాట్ వద్ద మహాశంషన్ హారతితో ప్రారంభమవుతుంది. ఈ పండగకు ఊరేగింపు కూడా చేస్తారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దోమ్ రాజ కుటుంబానికి చెందిన బహదూర్ చౌదరి ప్రారంభిస్తారు. ఇది అనాధిగా వస్తున్న ఆచారం. పార్వతి ఆవును పొందిన తర్వాత దయ్యాలు.. వారి గణాలు..స్మశానవాటికలో హోలీ ఆడటానికి వస్తాయి. ఇదే నమ్మకంతో హోలీ ప్రారంభమవుతుంది. బాబా ఊరేగింపు కీనారం ఆశ్రమం నుండి బయలుదేరి మహా శ్మశాన వాటిక హరిశ్చంద్ర ఘాట్‌కు చేరుకుంటుంది. దీని తరువాత మహాశంషణ్ నాథ్ పూజలు , హరతి ఇస్తారు.

Also Read: RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో ట్రైలర్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో జక్కన్న..

Boyapati Srinu: తన మార్క్ ఆఫ్ యాక్షన్‌ జానర్‌ పాన్ ఇండియా మూవీ వైపు అడుగులేస్తున్న బోయపాటి

Alia Bhatt : బాలీవుడ్ టు హాలీవుడ్ వయా టాలీవుడ్.. బీటౌన్ బ్యూటీ జోరు మాములుగా లేదుగా.

Pushpa The Rise: ఇంకా తగ్గని పుష్ప మేనియా.. ఈసారి పోలీసుల వంతు.. వైరల్ అవుతున్న వీడియో..