AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తప్పు చేస్తే తల్లి, తమ్ముళ్లు అయినా ఒకటే అన్న ఆది శేషుడు.. విష్ణు శేషతల్పంగా ఎలా మారాడో తెలుసా..!

కద్రు, వినీత దక్ష్ ప్రజాపతి కుమార్తెలు అయినప్పటికీ, కద్రుకి.. వినత అంటే అసూయ. కద్రు ఒకసారి వినీతను ఒక ఆటలో మోసంతో ఓడించి తన బానిసగా చేసుకుంది. తన తల్లి, సోదరులు కలిసి తన తల్లిలాంటి వినతను మోసం చేయడం చూసిన శేషనాగుడు చాలా బాధపడ్డాడు. అప్పుడే అతను తన తల్లిని, సోదరులను విడిచిపెట్టాడు. తర్వాత గంధమాదన పర్వతంపై తపస్సు చేయడం ప్రారంభించాడు.

తప్పు చేస్తే తల్లి, తమ్ముళ్లు అయినా ఒకటే అన్న ఆది శేషుడు.. విష్ణు శేషతల్పంగా ఎలా మారాడో తెలుసా..!
Aadi Sheshudu
Surya Kala
|

Updated on: Jun 03, 2024 | 12:05 PM

Share

హిందువులు ప్రకృతిలోని ప్రతి జీవిలో దైవాన్ని చూస్తారు. పాము, కుక్క, నెమలి, ఆవు ఇలా ప్రతి జీవిని పూజిస్తారు. అలాంటి జీవుల్లో ఒకటి పాము..హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు శయనించే శేషతల్పమే ఆదిశేషుడు. సర్పాలకు ఆద్యుడు. అందువల్ల శేషుడు విశ్వంలోని మొదటి పాముగా పరిగణించబడ్డాడు. ఈ సర్పానికే అనంత శేషుడనే పేరు కూడా ఉంది. ఆది శేషుడు వేయి పడగలను కలిగి ఉన్నాడు. తన పడగలపై గ్రహాలతో సహా సమస్త భూమండల బరువును మోస్తున్నాడు. విశ్వం సృష్టి , విధ్వంసంలో శేషుడికి ప్రత్యేక పాత్ర ఉంది. ఆది శేషుడు అవతారాల వర్ణనలు మహాభారతం, రామాయణం సహా అనేక ఇతర పురాణాలలో కూడా కనిపిస్తాయి. అయితే ఆది శేషుడు తన తల్లి చేసిన మోసానికి కోపం వచ్చి ఆమెను విడిచిపెట్టాడు. ఆ తర్వాత శాశ్వతంగా వైకుంటానికి చేరుకొని శ్రీ మహా విష్ణువు శయన తలపంగా సేవలను అందిస్తున్నాడు.

శేషనాగ జననం బ్రహ్మా మానస కుమారుడు ప్రజాపతి కశ్యపుడికి ఇద్దరు భార్యలు. దక్ష ప్రజాపతి కుమార్తెలు కద్రూ, వినతలు. ఒకసారి సంతోషంగా కశ్యప మహర్షి వినీత, కద్రుని ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. ఆ తర్వాత కద్రుడు తనంత ప్రకాశవంతంగా వెయ్యి పాములకు జన్మ నిచ్చే వరం కోరగా, వినత కేవలం ఇద్దరు బలవంతులైన పుత్రులకు జన్మ నిచ్చే వరాన్ని కోరింది. ఆ వరం పొందిన తర్వాత కద్రుడు 100 పాములకు జన్మనిచ్చింది. పాములలో శేషనాగుడు మొదట జన్మించాడు. వినతకు ఇద్దరు పక్షులు జన్మించాయి.

తన తల్లి, సోదరులను విడిచిపెట్టిన శేషనాగుడు కద్రు, వినీత దక్ష్ ప్రజాపతి కుమార్తెలు అయినప్పటికీ, కద్రుకి.. వినత అంటే అసూయ. కద్రు ఒకసారి వినీతను ఒక ఆటలో మోసంతో ఓడించి తన బానిసగా చేసుకుంది. తన తల్లి, సోదరులు కలిసి తన తల్లిలాంటి వినతను మోసం చేయడం చూసిన శేషనాగుడు చాలా బాధపడ్డాడు. అప్పుడే అతను తన తల్లిని, సోదరులను విడిచిపెట్టాడు. తర్వాత గంధమాదన పర్వతంపై తపస్సు చేయడం ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి

బ్రహ్మదేవుని నుండి వరం శేషనాగుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని సంతోషపెట్టాడు. తనకు వరం ఇవ్వడానికి వచ్చిన బ్రహ్మదేవుడితో అన్నాడు, ప్రభూ నా సోదరులందరూ స్వార్ధపరులు నేను వారితో కలిసి జీవించ లేను.. అది కు ఇష్టం లేదని చెప్పాడు. శేషనాగుడి ఈ నిస్వార్థ భక్తికి సంతోషించిన బ్రహ్మా దేవుడు నీ మనస్సు ఎప్పుడూ విష్ణువు నామం నుంచి ఎప్పటికీ వైదొలగదని వరం ఇచ్చాడు. అలాగే నిరంతరం కదిలే భూమిని నీ పడగలపై ధరించే అదృష్టం దక్కుతుందని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి శేష నాగుడు భూమిని తన పడగపై మోస్తూ ఉన్నాడని చెబుతారు.

అనంత నాగ శేషుడు శేష నాగుడి తల్లి పేరు కద్రు అయినందున,, ఇతనిని కద్రునందన్ అని కూడా పిలుస్తారు, అనంత నాగు, ఆదిశేషుడు, కశ్యప్ మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు. ఇతర మత గ్రంథాల్లో అనేక ఇతర పాముల వివరణ కనిపిస్తుంది. వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, ధనంజయుడు వంటి పాముల ప్రస్తావన ఉంది. వీరంతా ఆది శేషుడు తమ్ముళ్లు. శేషనాగుడు శ్రీ మహా విష్ణువుతో పాటు అనేక అవతారాలు ధరించాడు. మహాభారత గ్రంథం ప్రకారం శేషనాగ్ త్రేతాయుగంలో లక్ష్మణుడిగా అవతరించాడు, ద్వాపర యుగంలో బల రాముడిగా అవతరించాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు