Srisailam: మల్లన్న ఆలయంలో పెరిగిన భక్తులు రద్దీ.. దర్శనానికి 8 గంటల సమయం.. భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు

| Edited By: Surya Kala

Aug 04, 2024 | 10:45 AM

శ్రీశైల క్షేత్రమంతా భక్తజనంతో నిండి సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజామునుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది.

Srisailam: మల్లన్న ఆలయంలో పెరిగిన భక్తులు రద్దీ.. దర్శనానికి 8 గంటల సమయం.. భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
Devotees Rush In Srisailam
Follow us on

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి అంతేకాదు అష్టాదశ శక్తిపీఠ క్షేత్రం కూడా.. శ్రీ గిరి పర్వతంపై శివ పార్వతులు మల్లికార్జునుడు, బ్రమరంభగా కొలువై భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆది దంపతులను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే దేశ వ్యాప్తంగా భక్తులు శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటారు.

శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో క్షేత్రంలో భక్తులు రద్దీ అనూహ్యంగా పెరిగింది. క్షేత్రమంతా భక్తజనంతో నిండి సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజామునుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది.

ఇవి కూడా చదవండి

మరోపక్క భక్తులు స్వామి అమ్మవారి రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్స్ మంచి నీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..