Tirumala: ఈ నెలలోనే రెండు సార్లు గరుడ వాహనంపై శ్రీవారి దర్శనం. ఎందుకో తెలుసా..!

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఆగస్టు నెలలో రెండు సార్లు గరుడవాహనసేవ జరుగనుంది. ఆగస్టు 9వ తేదీ గరుడ పంచమి, ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

Tirumala: ఈ నెలలోనే రెండు సార్లు గరుడ వాహనంపై శ్రీవారి దర్శనం. ఎందుకో తెలుసా..!
Sri Malayappa Swamy
Follow us
Raju M P R

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 04, 2024 | 2:12 PM

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గరుడ వాహనంపై ఈ నెలలో రెండు సార్లు దర్శనం ఇవ్వనున్నారు. ఆగష్టు నెలలోనే మలయప్ప స్వామి గరుడవాహనంపై రెండుసార్లు విహరించనున్నారు. ఆగస్టు 9న గరుడ పంచమి, ఆగస్టు 19న శ్రావణ పౌర్ణమి పర్వదినాల్లో గరుడ సేవ చేయనున్నారు. గరుడ పంచమి, శ్రావణి పౌర్ణమి రోజు శ్రీమలయప్పస్వామి గరుడవాహనంపై నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఆగస్టు 9న గరుడ పంచమి రోజు రాత్రి 7 నుండి 9 గంటల వరకు ఇష్టవాహనమైన గరుడునిపై అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. శ్రీవారి వాహనాల్లో సేవకుల్లోనూ అగ్రగణ్యుడు గరుత్మంతుడు. ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్ల పక్షమి 5 వ రోజు ఘనంగా నిర్వహిస్తోంది టిటిడి.

గరుడపంచమి పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు పూజిస్తారని ప్రాశస్త్యం. ఇక ఆగస్టు 19న శ్రావణ పౌర్ణమి కాగా ప్రతి నెల పౌర్ణమి రోజు టిటిడి గరుడ వాహన సేవ నిర్వహిస్తోంది. పౌర్ణమి గరుడసేవను ఆగస్టు 19న శ్రావణ పౌర్ణమి నాడు అత్యంత వైభవంగా నిర్వహించనుంది. ఇందులో భాగంగానే రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీవారు గరుడునిపై ఆలయ నాలుగు వీధులల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు టిటిడి ఏర్పాట్లు చేస్తోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..