Hanuman Chalisa: జీవితంలో కష్టాలా.. హనుమంతుడి అనుగ్రహం కోసం హనుమాన్ చాలీసాను ఎలా పారాయణం చేయాలంటే..
హిందూ మతంలో హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉంది. హనుమాన్ చాలీసాను ప్రతిరోజూ పారాయణం చేయడం వల్ల జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అటువంటి పరిస్థితిలో ఇంట్లో హనుమాన్ చాలీసాను ఎలా పారాయణం చేయాలి? ఎప్పుడు చేయాలి? హనుమాన్ చాలీసాను ఏ సమయంలో పారాయణం చేయకూడదో తెలుసుకుందాం..

మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడిన రోజుగా పరిగణించబడుతుంది. అయితే హనుమంతుడిని శనివారం మాత్రమే కాదు రోజు హనుమంతుడిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. అదే సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మనిషి తన జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారని హిందువులు విశ్వసిస్తారు. తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా పారాయణం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమాన్ చాలీసాను ప్రతిరోజూ పారాయణం చేయడం వల్ల జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఇంట్లో హనుమాన్ చాలీసాను ఎలా పారాయణం చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎన్ని రోజులు చేయాలి అనే విషయాలతో పాటు అసలు హనుమాన్ చాలీసాను ఎప్పుడు చదవకూడదో కూడా తెలుసుకుందాం..
హనుమాన్ చాలీసాను ఎలా పఠించాలి?
హనుమాన్ చాలీసాను ఎప్పుడూ బిగ్గరగా పఠించకూడదు. ఎల్లప్పుడూ నెమ్మదిగా.. మధురమైన స్వరంలో పఠించాలి. ఉచ్చారణలో ఎటువంటి తప్పు జరగకుండా జాగ్రత్త వహించండి. హనుమాన్ చాలీసాను త్వర త్వరగా ముగించాలి అనే ఉద్దేశ్యంతో పారాయణం చేయకూడదు. ప్రతి ద్విపదను అర్థం చేసుకుంటూ పారాయణం చేయాలి.
హనుమాన్ చాలీసా ఎన్నిసార్లు పారాయణం చేయాలి?
హనుమాన్ చాలీసాను 1, 3, 7, 9 లేదా 11 సార్లు పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. హనుమాన్ చాలీసాను 7, 21 రోజులు లేదా 41 రోజులు నిరంతరం పఠించడం ద్వారా వ్యక్తి కోరిన అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
హనుమాన్ చాలీసా చదవడానికి సరైన మార్గం ఏమిటి?
హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీని తరువాత స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి. హనుమాన్ చాలీసా పఠించడం ప్రారంభించండి. ఎప్పుడు మనస్సులో హనుమంతుని స్మరిస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసే సమయంలో ముఖం తూర్పు లేదా దక్షిణం వైపు ఉండాలి.
ఉత్తమ ఫలితాలను పొందడానికి హనుమాన్ చాలీసాను ఏ సమయంలో పారాయణం చేయాలి?
హనుమాన్ చాలీసాను ఉదయం లేదా సాయంత్రం పఠించవచ్చు. అయితే తెల్లవారు జామున 4 నుంచి 5 గంటల మధ్య.. రాత్రి నిద్ర పోయే ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసాను 7 సార్లు పఠించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు.
హనుమాన్ చాలీసా ఎప్పుడు పఠించకూడదంటే
సూతక సమయంలో, మాంసం, మద్యం తిన్న తర్వాత, స్నానం చేయకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేయకూడదు. దీనితో పాటు మనస్సులోకి ప్రతికూల ఆలోచనలు వస్తే హనుమాన్ చాలీసా పారాయణం సంపూర్ణంగా పరిగణించబడదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు