గురువు అనే పార్శ్వాన్ని గ్రహించగలిగే అవకాశమున్న ప్రత్యేకమైన రోజు గుుపూర్ణిమ. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును పంచేవాడు.. గురువు అంటే ఒక ప్రత్యేకమైన స్ధానం సుమారు అరవై, డెబ్భై ఏళ్ళ క్రితం వరకూ కూడా, మన దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గురు పూర్ణిమ ఒకటి.
శుభ ముహుర్తము..
జూలై 224 శనివారం.. గురు పూర్ణిమ..
తిథి ప్రారంభం.. జూలై 23న ఉదయం.. 10.43 నిమిషాలకు.
ముగింపు సమయం.. జూలైన 24న ఉదయం 8.6 నినిమిషాలకు.
కొన్ని వేల సంవత్సరాల క్రితం, శివుడు సిద్ధి పొంది, హిమాలయాల్లో పారవశ్య నృత్యం చేసి నిశ్చలుడయ్యాడు. తాము అర్ధం చేసుకోలేని గాఢ అనుభూతినేదో ఆయన పొందుతున్నారని ఆయన్ని చూసినవారు అనుకున్నారు. శివుడు తమతో మాట్లాడతాడేమో అని జనాలు ఎదురు చూడడం మోదలుపెట్టారు. కానీ అక్కడ జనాలు ఉన్నారన్న స్పృహ శివుడికి లేదు. దీంతో కొంతకాలం ఎదురు చూసి అంతా వెళ్లిపోయారు. కేవలం ఏడుగురు మాత్రం అలాగే వేచి ఉన్నారు. ఈ ఏడుగురు ఆయన వద్ద నేర్చుకోవాలని ఎంతో పట్టుదలతో అక్కడే ఉన్నారు. మీకు తెలిసింది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. వారు ఆయనను బతిమిలాడారు. శివుడు వారిని పట్టించుకోలేదు. మీరున్న స్ధితిలో కోట్ల సంవత్సరాలైనా మీకేమీ తెలియదు. ముందు మీరు అందుకు కావాలిసిన యోగ్యత పొందాలి. ఇందుకోసం ఎంతో సాధన చేయవలిసి ఉంటుంది. ఇది వినోదం కాదు అని శివుడు చెప్పగా.. వారు అందుకు సంసిద్దయమయ్యారు. అలా 84 ఏళ్ల సాధన తరువాత, ఒక పున్నమి రోజున, సూర్యుడు ఉత్తర దిశ నుండి దక్షిణ దిశలోకి మారుతున్నప్పుడు, మన సంప్రదాయంలో దక్షిణాయనం ఆరంభమవుతుందనే కాలంలో ఆదియోగి ఈ ఏడుగురిని చూశారు. పూర్ణ చంద్రోదయమైన రోజున ఆదియోగి తనను తాను ఆదిగురువుగా మార్చుకున్నారు. దక్షిణ దిశవైపుకి తిరిగి, యోగ శాస్త్రం వారికి చెప్పడం ప్రారంభించారు. ఆయన దక్షిణ దిశవైపుకి తిరిగి, ఆది గురువుగా కూర్చున్నారు కాబట్టి, మనం ఆయనని దక్షిణామూర్తి అంటాం. ఆ రోజున మొదటి గురువు జన్మించారు. అందుకని ఆ రోజుని గురుపూర్ణిమ అంటారు.
ఈరోజున గురువులకు శిష్యులు పూజలు చేసి.. గౌరవం అందిస్తారు. ఆషాడ మాసంలో వచ్చిన గురు పూర్ణిమ వేద వ్యాస జన్మదినంగా భావిస్తారు. ఈ రోజున ఆదిశక్తికి ఆలయాలలో పూజలు నిర్వహిస్తారు. ఈరోజు కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తారు. పూజ చేసేటప్పుడు ఉత్తరం వైపు తిరిగి ఐదు దూది వత్తులతో పంచహారతులు ఇవ్వాలి. అంతకంటే ముందు స్త్రోత్రాలు పఠించాలి. ఆలయాలలో పాలాభిషేకం.. పంచామృతాభిషేకం చేయిస్తారు. అరటి పండ్లు, ఉడకబెట్టిన శెనగలను నివేదన చేసి ప్రసాదంగా పంచుతారు.
Also Read: Tokyo Olympics 2021: ఘనంగా ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్.. ఈరోజు పోటీ పడనున్న క్రీడాకారులు ఎవరంటే..