Tirumala: శ్రీవారి ఎన్నారై భక్తులకు గుడ్ న్యూస్… కొండపైనే రూ.300 దర్శన టికెట్ల అమ్మకం.. ఎలా పొందాలంటే

| Edited By: Ravi Kiran

Jun 17, 2022 | 4:09 PM

నిబంధనలను సడలిస్తూ.. కోనేటిరాయుడిని దర్శించుకోవడానికి భక్తులకు అనుమతినిస్తున్న నేపథ్యంలో మళ్ళీ తిరుమల గిరుల్లో భక్తుల సందడి నెలకొంది. తాజాగా ఎన్నారై భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.

Tirumala: శ్రీవారి ఎన్నారై భక్తులకు గుడ్ న్యూస్... కొండపైనే రూ.300 దర్శన టికెట్ల అమ్మకం.. ఎలా పొందాలంటే
Tirumala Tirupati
Follow us on

Tirumala: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి క్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy) కలియుగదైవంగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. స్వామివారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లోని భక్తులతో పాటు.. దేశ విదేశాల్లోని వారు కూడా తిరుమల క్షేత్రానికి వస్తారు. రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనాని అరికట్టడానికి తీసుకున్న నిబంధనలతో శ్రీవారిని దర్శించుకునే భక్తులకు అనుమతినిస్తోంది. అయితే కరోనా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో అనేక నిబంధనలను సడలిస్తూ.. కోనేటిరాయుడిని దర్శించుకోవడానికి భక్తులకు అనుమతినిస్తున్న నేపథ్యంలో మళ్ళీ తిరుమల గిరుల్లో భక్తుల సందడి నెలకొంది. తాజాగా ఎన్నారై భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.  వెంకటనాథుడి దర్శనం కోసం తిరుమల తిరుపతి వచ్చే ప్రవాసభారతీయులకు దర్శనం విషయంలో కొన్ని వెసులుబాటులు కల్పించింది. వివరాల్లోకి వెళ్తే..

NRI భక్తులకు తిరుమల వైకుఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద ప్రత్యేక ₹300దర్శన టికెట్ల అమ్మకాన్ని తిరిగి కొనసాగిస్తూ..టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ నేపథ్యంలో ఆగిపోయిన ఈ సదుపాయాన్ని తిరిగి కొనసాగించనుంది. ప్రత్యేక దర్శన టికెట్లు కావాల్సిన ప్రవాసాంధ్ర భక్తులు VQC-1 వద్ద ఉన్న కౌంటర్లలో టికెట్లు పొందవచ్చు. ఇందుకు గాను NRI భక్తులు తమ పాస్‌పోర్ట్, వీసాలను చూపించి నేరుగా ₹300 దర్శన టికెట్లను పొందవచ్చునని పేర్కొంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి