spiritual: సంతోషదాయక జీవితానికి బంగారు సూత్రాలు.. హైదరాబాద్ లో సాగుతున్న స్వామి ముకుందానంద ప్రవచనాలు..

|

Dec 11, 2022 | 8:35 PM

అంతర్జాతీయంగా పేరొందిన ప్రవచనకర్త, తాత్వికులు, యోగా, ఆధ్యాత్మిక, మైండ్ మేనేజ్ మెంట్ బోధకులు స్వామి ముక్తానంద ప్రవచనాలు హైదరాబాద్‌లో సాగుతున్నాయి. డిసెంబర్ 10వ తేదీ శనివారం హైదరాబాద్‌ నగరంలో ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ లో ఈ కార్యక్రమం..

spiritual: సంతోషదాయక జీవితానికి బంగారు సూత్రాలు.. హైదరాబాద్ లో సాగుతున్న స్వామి ముకుందానంద ప్రవచనాలు..
Swami Mukundananda
Follow us on

అంతర్జాతీయంగా పేరొందిన ప్రవచనకర్త, తాత్వికులు, యోగా, ఆధ్యాత్మిక, మైండ్ మేనేజ్ మెంట్ బోధకులు స్వామి ముకుందానంద ప్రవచనాలు హైదరాబాద్‌లో సాగుతున్నాయి. డిసెంబర్ 10వ తేదీ శనివారం హైదరాబాద్‌ నగరంలో ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఐదు రోజులపాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. డిసెంబర్ 14 వరకు స్వామి ముకుందానంద హైదరాబాద్ లో ఉండనున్నారు. ఆయన ఇటీవలే ఆవిష్కరించిన ‘గోల్డెన్ రూల్స్ ఫర్ లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్’ నుంచి వివిధ అంశాలపై ప్రసంగిస్తున్నారు. తాత్విక అంశాలపై విస్తృత అవగాహన కలిగిన స్వామి ముకుందానంద వివిధ అంశాలపై తన ప్రసంగాలతో సభికులను ఆకట్టుకుంటున్నారు. ఆయన ప్రవచనాల్లో ముఖ్యంగా వివిధ పరిణామాలకు ముందుగానే సిద్ధం కావడం, శ్రేయస్సుకు సంబం ధించి అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలు ఉంటున్నాయి. ఐఐటి-ఐఐఎం పూర్వవిద్యార్థి, దాతృత్వ సంస్థ అయిన జేకే యోగ్ ఇండియా వ్యవస్థాపకులు ముకుందానంద ‘ఆలోచనల శక్తిని వెలికితీయడం, అత్యుత్తమ జీవితాన్ని గడపడం’పై ప్రసంగిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారు స్వామీజీ తాజా పుస్తకాలు ‘గోల్డెన్ రూల్స్ ఫర్ లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్’, ‘ది పవర్ ఆఫ్ థాట్స్’ పుస్తకాలను స్వామీ ఆటోగ్రాఫ్ తో పొందే వీలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

డిసెంబర్ 14వ తేదీ వరకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు స్వామీజీ ప్రవచన కార్యక్రమాలు జరగుతున్నాయి. నిజమైన సంతోషం, పరిపూర్ణ ప్రేమ, వృత్తిపరమైన నైపుణ్యం, చక్కటి ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యం, సంక్షేమం వంటి అంశాలపై స్వామి తన ప్రసంగాల్లో చెబుతున్నారు. దురదృష్టవశాత్తూ జీవితం చాలా సందర్భాల్లో మనకు నిరాశ కలిగించేదిగా, వైఫల్యాలను అందించేదిగా ఉంటోంది. దీంతో జీవితంపై నిరాశతో ఉన్నవారిలో కొత్త ఆశలు కల్పించడానికి స్వామి ప్రవచనాలు దోహదపడతాయని జేకే యోగ్ హైదరాబాద్ కేంద్రం ముఖ్య సభ్యులు దివాకర్ బోయినపల్లి, హరీశ్ రంగా చార్య, గాయత్రి శెట్టి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం చూడండి..