Garuda Puranam: ఈ నాలుగు తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే మీ జీవితం నాశనమైనట్లే.!

Garuda Puranam: 18 మహా పురాణాల్లో ఒకటైన గరుడ పురాణంలో జీవితాన్ని మెరుగుపరచడానికి అవసరమయ్యే అన్ని నియమాలు ఉన్నాయి. గరుడ పురాణం ప్రధాన దేవుడు విష్ణువు.

Garuda Puranam: ఈ నాలుగు తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే మీ జీవితం నాశనమైనట్లే.!
Garuda Puranam
Follow us

|

Updated on: Oct 01, 2021 | 6:38 PM

18 మహా పురాణాల్లో ఒకటైన గరుడ పురాణంలో జీవితాన్ని మెరుగుపరచడానికి అవసరమయ్యే అన్ని నియమాలు ఉన్నాయి. గరుడ పురాణం ప్రధాన దేవుడు విష్ణువు. ఇక ఆయన వాహనం గరుడ పక్షి. విష్ణువు, గరుడల మధ్య జరిగిన ప్రశ్నోత్తరాలు, సమాధానాల వివరణే గరుడ పురాణంలో పొందుపరిచి ఉంటుంది. మానవ సృష్టి ప్రారంభం నుంచి మరణం వరకు కర్మ ప్రకారం చేయాల్సిన, చేయకూడని వాటి గురించి గరుడ పురాణంలో వివరంగా విశ్లేషించారు. అలాగే మరణం తర్వాత జరిగే పరిస్థితులను వివరించడమే ఈ గ్రంధం ఉద్దేశ్యం. ఇక ఈ గ్రంధం ప్రకారం.. పురుషుడు, స్త్రీ వారి జీవితంలో చేయకూడదని నాలుగు తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వివాహం అనంతరం మనస్పర్ధలు రావడం, గొడవలు జరగడం సహజం. ఒకరిపై ఒకరు కోపాలు తాపాలు పెంచుకుని దూరంగా ఉండటం మంచిది కాదు. పెళ్లి తర్వాత ఎక్కువ కాలం ఒకరిని విడిచి ఒకరు ఉండకూడదు. అలా ఉండటం వల్ల వారి వైవాహిక జీవితంపై ఎక్కువ ప్రభావం పడుతుంది. ఎలప్పుడూ ప్రేమతో ఒకరినొకరు అర్ధం చేసుకుని కలిసుండాలి.

పేరు-ప్రతిష్ట: ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా తన పేరు ప్రతిష్టలను కాపాడుకోవాలి. ఏదైనా చిన్న తప్పు కారణంగా మీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగితే.. అప్పటివరకు మీకున్న హోదాను కోల్పోవాల్సి వస్తుంది. మళ్లీ దాన్ని తిరిగి పొందాలంటే చాలా కష్టపడాలి. అందుకే మీరు స్నేహం చేసే వ్యక్తులు కూడా ఎవరన్నది తెలుసుకోవడం మంచిది. చెడు సహవాసాలు మీ పేరును దెబ్బ తీస్తాయి.

గరుడ పురాణంలో పేర్కొన్నట్లుగా, ప్రతీ వ్యక్తి తమ జీవిత భాగస్వామిని గౌరవించాలి. వారిని మీరు అవమానించినట్లయితే.. ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ కర్మను తిరిగి పొందుతారు. కాబట్టి ప్రతీ ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి.

ఎవరైనా కూడా గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనుకుంటే.. తమ జీవిత భాగస్వామికి, తల్లిదండ్రులకు దూరంగా ఎక్కువ కాలం ఉండరు. జీవిత భాగస్వామిని విడిచిపెట్టి వేరొకరి ఇంట్లో ఎక్కువ కాలం ఉండటం వల్ల మీ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది.