AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?

మరణించిన వ్యక్తుల వస్తువులను ఉపయోగించడంపై గరుడ పురాణంలో కీలక విషయాలు పేర్కొనబడ్డాయి. ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా వారి ఆత్మ కొంతకాలం భూలోకంలోనే ఉంటుందని, వారు వాడిన వస్తువులలో సూక్ష్మ శక్తులు నిలిచి ఉంటాయని నమ్ముతారు. అయితే, వారు ప్రేమతో ఇచ్చిన ఆభరణాలను కరిగించి కొత్త డిజైన్‌లలో మార్చుకుని ధరించడం వల్ల ఎలాంటి దోషం ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఇంతకీ మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటో ఇక్కద తెలుసుకుందాం..

గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?
Garuda Purana Rules
Jyothi Gadda
|

Updated on: Oct 10, 2026 | 7:59 AM

Share

హిందూ ధర్మంలో వేదవ్యాసుడు రచించిన 18 మహా పురాణాలలో గరుడ పురాణం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇందులో మానవుని జననం, మరణం, మరణానంతర ఆత్మ ప్రయాణానికి సంబంధించిన అనేక రహస్యాలు వివరించబడ్డాయి. సాధారణంగా కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినప్పుడు వారి గుర్తుగా వారు వాడిన బట్టలు, వాచీలు, పాదరక్షలు లేదా ఆభరణాలను ఉపయోగించడం చాలా మందికి అలవాటు. అయితే గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తుల వస్తువులను పొరపాటున కూడా వాడకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. దానికి గల కారణాలు, నియమాలను వివరంగా తెలుసుకుందాం.

1. పాదరక్షలు, వస్త్రాలు వాడకూడదు

చనిపోయిన వ్యక్తి తన దైనందిన జీవితంలో నిరంతరం ఉపయోగించిన వస్తువులపై వారి శక్తి ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా వారి పాదరక్షలు, వ్యక్తిగత వస్త్రాలను కుటుంబ సభ్యులు ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల అందులోని సూక్ష్మ శక్తుల ప్రభావం మీపై పడి మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేసే పనుల్లో ఆటంకాలు, నిరాశ ఎదురయ్యే ప్రమాదం ఉంది.

2. ఆత్మ శాంతికి ఆటంకం

మరణం తర్వాత ఆత్మ భూలోక బంధాల నుంచి విముక్తి పొంది పరలోక ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులు వారి వస్తువులను వాడుతూ ఉంటే, ఆ ఆత్మ భూమిపై ఉన్న బంధాలను వదులుకోలేక ఇబ్బందిపడుతుంది. ఇది వారి ఆత్మశాంతికి భంగం కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

ఇవి కూడా చదవండి

3. దాన ధర్మాలు చేయడం శ్రేయస్కరం

చనిపోయిన వారి వస్తువులను ఇంట్లో అలాగే ఉంచుకోవడం లేదా దుర్వినియోగం చేయడానికి బదులుగా, అవసరమున్న పేదలకు దానం చేయాలి. ఇలా చేయడం వలన పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరడమే కాకుండా, కుటుంబానికి పుణ్యఫలం లభిస్తుంది.

4. ఆభరణాలు ధరించవచ్చా?

మరణించిన వారి బంగారం లేదా వెండి ఆభరణాలను నేరుగా ధరించడం మంచిది కాదు. అయితే వారి ఆభరణాలను ఇంట్లో భద్రంగా ఉంచుకోవచ్చు. ఒకవేళ వాటిని ధరించాలనుకుంటే, ఆ బంగారాన్ని కరిగించి కొత్త డిజైన్‌లో తయారు చేయించి ధరించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనివల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు. పూర్వీకుల జ్ఞాపకాలను గౌరవిస్తూనే, గరుడ పురాణంలో చెప్పిన ఈ నియమాలను పాటించడం వల్ల కుటుంబంలో శాంతి, సౌఖ్యాలు నిలుస్తాయి.

(Disclaimer: ఈ కథనంలోని మరణానంతర జీవితం, కర్మఫలాలు, పుణ్యపాపాలకు సంబంధించిన అంశాలు మతపరమైన విశ్వాసాల ఆధారంగా మాత్రమే వివరించబడ్డాయి.)

Follow Us
గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?
గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?
ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. భారీ బందోబస్తు..
ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. భారీ బందోబస్తు..
రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. పొందటం ఈజీ
రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. పొందటం ఈజీ
కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన తెలుగోడు
కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన తెలుగోడు
వెంకటేశ్, ఐశ్వర్య రాయ్ కాంబోలో మిస్సైన సినిమా అదే..
వెంకటేశ్, ఐశ్వర్య రాయ్ కాంబోలో మిస్సైన సినిమా అదే..
కాలీఫ్లవర్ Vs బ్రోకలీ.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది?
కాలీఫ్లవర్ Vs బ్రోకలీ.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది?
శరీరానికి ఎన్నో పోషకాలను అందించే అద్భుతమైన కూరగాయ..నెలకొసారైనా
శరీరానికి ఎన్నో పోషకాలను అందించే అద్భుతమైన కూరగాయ..నెలకొసారైనా
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు