AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జంతర్ మంతర్ చరిత్ర.. ఖగోళ వేధశాల నుంచి దేశ నిరసనల కేంద్రంగా ఎలా మారింది?

ఢిల్లీ అనగానే పార్లమెంట్, ఎర్రకోటతో పాటు అందరికీ గుర్తొచ్చే మరొక ముఖ్యమైన ప్రదేశం జంతర్ మంతర్. టీవీ న్యూస్‌లలో రోజువారీ ధర్నాలు, సత్యాగ్రహాలు, నిరసనల వార్తలు చూస్తున్నప్పుడు జంతర్ మంతర్ పేరు నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది. అయితే, ఒకప్పుడు నక్షత్రాలు, గ్రహాల గమనాన్ని పరిశీలించేందుకు నిర్మించిన ఈ ఖగోళ వేధశాల, భారత ప్రజాస్వామ్యంలో నిరసనలకు చిరునామాగా ఎలా మారింది? అక్కడ మొదటగా నిరసన తెలిపింది ఎవరు? అనే ఆసక్తికర చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం.

జంతర్ మంతర్ చరిత్ర.. ఖగోళ వేధశాల నుంచి దేశ నిరసనల కేంద్రంగా ఎలా మారింది?
Jantar Mantar History
Jyothi Gadda
|

Updated on: Oct 08, 2026 | 9:13 PM

Share

జాతీయ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ మరోసారి భారీ రాజకీయ, సామాజిక నిరసనలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, భారత ఎన్నికల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ వివిధ సంస్థలు నిరసనలు చేస్తున్నాయి. అయితే, ఈ ప్రసిద్ధ నిరసన ప్రదేశంలో మొదటగా ఎవరు నిరసన తెలిపారు? ఎవరికి వ్యతిరేకంగా? ఈ నిరసనలకు దారితీసిన కారణాలేమిటో తెలుసుకుందాం.

ఖగోళ వేధశాలగా నిర్మాణం:

జంతర్ మంతర్‌ను 1724లో జైపూర్ మహారాజు సవాయ్ జైసింగ్ II నిర్మించారు. ఖగోళ శాస్త్రంపై ఉన్న తీవ్ర ఆసక్తితో కాలక్రమాన్ని, గ్రహాల స్థితిగతులను ఖచ్చితంగా గణించడానికి ఆయన ఢిల్లీతో పాటు జైపూర్, ఉజ్జయిని, వారణాసి, మధురలలో వీటిని నిర్మించారు.

బోట్ క్లబ్ నుంచి జంతర్ మంతర్‌కు నిరసనలు:

1993 కంటే ముందు, భారతదేశంలో పెద్ద ఎత్తున జరిగే నిరసనలు, ర్యాలీలకు ఢిల్లీలోని బోట్ క్లబ్ కేంద్రంగా ఉండేది. అయితే 1988లో రైతు నాయకుడు మహేంద్ర సింగ్ తికాయత్ ఆధ్వర్యంలో లక్షలాది మంది రైతులు బోట్ క్లబ్ పరిసరాలను ముట్టడించి దాదాపు వారం రోజుల పాటు ఢిల్లీని దిగ్బంధించారు. ఈ సంఘటనతో తీవ్ర భద్రతా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. తదనంతరం, 1993లో ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పార్లమెంట్ సమీపంలోని బోట్ క్లబ్‌ వద్ద ధర్నాలను నిషేధించి, నిరసనకారుల కోసం పార్లమెంట్ వీధిలోని జంతర్ మంతర్ ను అధికారిక వేదికగా కేటాయించింది.

ఇవి కూడా చదవండి

చారిత్రక ఘట్టాలకు సాక్షి:

జంతర్ మంతర్ వద్ద మొదటిసారిగా చిన్నతరహా కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు తమ డిమాండ్ల సాధనకై ధర్నాలు ప్రారంభించాయి. ఆ తర్వాత, ఈ ప్రదేశం అనేక చారిత్రాత్మక ఉద్యమాలకు వేదికైంది. 2011లో అన్నా హజారే చేపట్టిన జన్ లోక్‌పాల్ ఉద్యమం ఇక్కడి నుంచే దేశవ్యాప్త ప్రభంజనంగా మారింది. తమిళనాడు, పంజాబ్ రైతుల వినూత్న నిరసనలు. రెజ్లర్లు జరిపిన ఆందోళనలు కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లడానికి పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కును చాటిచెప్పే బలమైన ప్రజాస్వామ్య చిహ్నంగా జంతర్ మంతర్ నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us