Ganesh Temple: వినాయకుడిని ఏకదంతుడు అని ఎందుకంటారు? ఆ విరిగిన దంతం ఎక్కడ పడిందంటే..

|

Aug 25, 2024 | 11:38 AM

గజకర్ణుడు, లంబోదరుడు, వినాయకుడు, విఘ్ననాయకుడు, ధూమ్రకేతు, గణాధ్యక్షుడు, భాలచంద్రడు, గజానన మొదలైన పేర్లతో పాటు, గణేశుడిని ఏకదంతుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ పేరుకు సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి. అంతేకాదు వినాయకుడి దంతం పడిన ఒక ఆలయం కూడా ఉంది. ఇక్కడ వినాయకుడి విరిగిన దంతం పడిపోయింది అని నమ్మకం. ఈ నేపధ్యంలో గణేశుడి ఏకదంతునికి సంబంధించిన ఆసక్తికరమైన పురాణకథలు అనేకం తెలుసుకుందాం..

Ganesh Temple: వినాయకుడిని ఏకదంతుడు అని ఎందుకంటారు? ఆ విరిగిన దంతం ఎక్కడ పడిందంటే..
Dholkal Ganesh Temple
Follow us on

హిందూ మతంలో గణేశుడిని మొదట పుజిస్తారు. ఏదైనా మతపరమైన పని లేదా ఆరాధన ప్రారంభించే ముందు విఘ్నాలు ఏర్పడకుండా గణేశుడిని పూజిస్తారు. గణేశుడి ఆరాధన అత్యంత శ్రేష్ఠమైనదిగా పురాణ శాస్త్రాలలో పేర్కొనబడింది. వాస్తవానికి గజకర్ణుడు, లంబోదరుడు, వినాయకుడు, విఘ్ననాయకుడు, ధూమ్రకేతు, గణాధ్యక్షుడు, భాలచంద్రడు, గజానన మొదలైన పేర్లతో పాటు, గణేశుడిని ఏకదంతుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ పేరుకు సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి. అంతేకాదు వినాయకుడి దంతం పడిన ఒక ఆలయం కూడా ఉంది. ఇక్కడ వినాయకుడి విరిగిన దంతం పడిపోయింది అని నమ్మకం. ఈ నేపధ్యంలో గణేశుడి ఏకదంతునికి సంబంధించిన ఆసక్తికరమైన పురాణకథలు అనేకం తెలుసుకుందాం.

గణపతి ఏకదంతుడు ఎలా అయ్యాడు?

పురాణాల ప్రకారం పరశురాముడు గణేశుడి మధ్య జరిగిన యుద్ధమే దీనికి కారణం. ఒకప్పుడు పరశురాముడు శివుడిని కలవడానికి వచ్చాడు. అప్పుడు అతను తలుపు బయట నిలబడి ఉన్న వినాయకుడిని చూసి తాను శివుడిని కలవాలనుకుంటున్నానని లోపలికి వెళ్లనివ్వమని అడిగాడు. అయితే గణపతి పరశురాముడిని లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో పరశురాముడికి కోపం వచ్చింది. తనను లోపలికి వెళ్లనివ్వకపోతే యుద్ధం చేయాల్సి ఉంటుందని గణేష్‌తో చెప్పాడు. తను గెలిస్తే శివుడిని కలవడానికి లోపలికి అనుమతించాలని చెప్పాడు. గణేశుడు యుద్ధ సవాలును స్వీకరించాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. యుద్ధ సమయంలో పరశురాముడు తన గొడ్డలితో గణేశుడిపై దాడి చేశాడు. ఈ గొడ్డలి కారణంగా గణపతి దంతాలలో ఒకటి విరిగి పడిపోయింది. అప్పటి నుండి గణపతి ఏక దంతుడు అయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఇతర పురాణర కథలు

ఇతర పురాణ కథనాల ప్రకారం గణేశుడి దంతం విరగడానికి కారణం పరశురాముడు కాదు అతని సోదరుడు కార్తికేయుడు. ఇద్దరు సోదరుల వ్యతిరేక స్వభావం కారణంగా శివ పార్వతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే గణేశుడు కార్తికేయుడిని చాలా ఇబ్బంది పెట్టాడు. అలాంటి ఒక పోరాటంలో కార్తికేయుడు గణేశుడికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు గణపతిని కొట్టాడు. అప్పుడు దంతాలలో ఒకటి విరిగిపోయాడు. అంతేకాదు మహర్షి వేదవ్యాసుడు మహాభారతాన్ని వ్రాయమని గణపతిని కోరినప్పుడు ఒక షరతు పెట్టాడని కూడా ఒక ప్రసిద్ధ కథనం. తాను మాట్లాడటం మాననని.. అంటే కంటిన్యూగా మాట్లాడతాడని అదే సమయంలో వ్యాసుడు చెప్పే మహాభారత కథను రాస్తానని చెప్పాడు. అప్పుడు గణపతి స్వయంగా తన దంతాలలో ఒకదానిని విరిచి పెన్నులా తయారు చేశాడు.

ఎక్కడ వినాయకుడి దంతాలు పడిపోయాయంటే

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్సూర్ గ్రామంలోని ధోల్కల్ కొండలపై వందల సంవత్సరాల పురాతనమైన ఈ గణేష్ విగ్రహం సుమారు 3000 అడుగుల ఎత్తులో ఉంది. ఇది మొత్తం ప్రపంచంలోని అరుదైన విగ్రహాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇతడిని దంతెవాడ రక్షకుడిగా కూడా పిలుస్తారు.

యుద్ధంలో పంటి విరిగిపోయింది
దంతేవాడ జిల్లాలో కైలాస గుహ కూడా ఉంది. ఇదే కైలాస ప్రాంతమని, వినాయకుడికి, పరశురాముడికి మధ్య భీకర యుద్ధం జరిగిందని చెబుతారు. ఈ యుద్ధంలో గణపతి దంతం ఒకటి విరిగి ఇక్కడ పడింది. అందుకే కొండ శిఖరం క్రింద ఉన్న గ్రామానికి ఫరస్పాల్ అని పేరు పెట్టారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు