Friday Puja Tips: డబ్బుకి ఇబ్బందా.. శుక్రవారం ఈ పరిహారాలు చేసి చూడండి.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..
హిందూ మతంలో శుక్రవారం లక్ష్మీ దేవికి, శుక్ర గ్రహానికి అంకితం చేయబడింది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన అమ్మవారి అనుగ్రహం సొంతం అవుతుంది. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో ఆనందం, శ్రేయస్సు , సంపద లభిస్తాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రవారం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే.. లక్ష్మీ దేవి ఇంట్లోకి వస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.

హిందూ మతంలో శుక్రవారం లక్ష్మీ దేవిని పూజించడానికి అంకితమైన రోజుగా పరిగణించబడుతుంది. సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి , ఆమె ఆశీర్వాదాలను పొందడానికి ఈ రోజు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. లక్ష్మీ దేవి అనుగ్రహం వల్ల ఆనందం, శ్రేయస్సు, సంపద లభిస్తాయని మత విశ్వాసం. జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రవారంరోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే.. లక్ష్మీ దేవి ఇంట్లోకి వస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి తీసుకోవలసిన చర్యలు ఏమిటో తెలుసుకుందాం.
జ్యోతిషశాస్త్రంలో శుక్రవారం నాడు సంపద, ఆనందం, శ్రేయస్సు, అదృష్టాన్ని పొందడానికి కొన్ని ప్రత్యేక చర్యలను పేర్కొన్నారు. ఈ సులభమైన చర్యలు చేయడం ద్వారా డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే..
లక్ష్మీదేవి పూజ: శుక్రవారం లక్ష్మీదేవి పూజ చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. శుక్రవారం ఉదయం నిద్రలేచి స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి, లక్ష్మీదేవిని పూజించండి. తరువాత ఆలయంలో లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్టించి.. ఆమె ఎర్రటి బట్టలు, పసుపు, కుంకుమ, అక్షతలను, తామర పువ్వులను సమర్పించండి.
తెల్లని వస్తువులను దానం చేయడం: శుక్రవారం రోజున తెల్లని వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. తెల్లని వస్తువులు అంటే బియ్యం, పాలు, పెరుగు, తెల్లని వస్త్రాలను దానం చేయవచ్చు. శుక్రవారం రోజున పేదలకు తెల్లని వస్తువులను దానం చేయడం వలన లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఆశీర్వాదం ఇస్తుంది.
కర్పూరం వెలిగించడం: శుక్రవారం రోజున ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని, లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్ముతారు. శుక్రవారం రోజున ఇంటి అంతటా కర్పూరం, హారతి చూపడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది.
తామర విత్తనాల జపమాల జపించడం: దీనినే కమల గట్ట జప మాల అని అంటారు. శుక్రవారాల్లో తామర విత్తనాల జపమాలతో జపించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. శుక్రవారం సాయంత్రం శ్రీ సూక్త పారాయణం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. సంపద పెరుగుతుంది.
నెయ్యితో దీపం వెలిగించడం: శుక్రవారం రాత్రి ఈశాన్య దిశలో నెయ్యి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మిదేవి ఇంటి ఈశాన్యంలో అంటే ఈశాన మూలలో నివసిస్తుంది. కనుక శుక్రవారం ఈశాన్య మూలలో నెయ్యి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
ఆవుకు సేవ చేయడం: శుక్రవారం నాడు ఆవుకు ఆహారం తినిపించడం ద్వారా లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఈ రోజున ఆవుకు సేవ చేయడం లక్ష్మీని పొందడానికి ఒక ఖచ్చితమైన మార్గంగా పరిగణించబడుతుంది. శుక్రవారం నాడు ఆవుకు పచ్చి గడ్డి , బెల్లం, పప్పుధాన్యాలు, పసుపు కలిపిన పిండిని కూడా తినిపించవచ్చు.
లక్ష్మీ మంత్రాలను పఠించడం: శుక్రవారం రోజున లక్ష్మీ దేవి మంత్రాలను పఠించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. శుక్రవారం రోజున మీరు “ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం. మహాలక్ష్మ్యై నమః.” అనే మంత్రాన్ని జపించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








