Tirupati: టీటీడీకి కేంద్ర ప్రభుత్వం ఊరట.. ఫారెన్ కరెన్సీ డిపాజిట్లకు లైన్ క్లియర్..
ఫారిన్ కరెన్సీ విషయంలో టీటీడీకి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. భక్తుల వివరాలు లేకున్నా డిపాజిట్ చేసుకునేందుకు టీటీడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తిరుమల తిరుపతి దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించింది. శ్రీవారికి విదేశీ భక్తులు సమర్పించే ఫారెన్ కరెన్సీ డిపాజిట్లకు ఓకే చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఫారిన్ కరెన్సీ సమర్పించిన దాతల వివరాలు లేకపోయినా.. భక్తులు సమర్పించిన ఫారెన్ కరెన్సీని బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు టీటీడీకి మినహయింపు ఇచ్చింది కేంద్రం. భక్తులు శ్రీవారికి సమర్పించిన వాటిని కానుకలు గానే చూడాలని తెలిపింది కేంద్రం. సెక్షన్ 50 ప్రకారం టీటీడీకి మాత్రమే ఇలాంటి మినహయింపు ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
అయితే గత కొద్దిరోజుల క్రితం ఫారిన్ కరెన్సీ డిపాజిట్ల వ్యవహరంలో టీటీడీకి 3 కోట్ల జరిమాన విధించింది కేంద్రం. సెక్షన్ 50 ప్రకారం టిటిడికి మాత్రమే ఇలాంటి మినహయింపు ఇస్తున్నట్లు ఇఓ దర్మారెడ్డికి సమాచారమిచ్చారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముత్తుకుమార్. జరిమాన చెల్లించిన అనంతరం ఫారిన్ కరెన్సీ డిపాజిట్ చేసుకునేందుకు లైసెన్స్ రెన్యూవల్ చేసింది. లైసెన్స్ రెన్యువల్ చేసిన తర్వాత.. ఫారిన్ కరెన్సీ డిపాజిట్ చేసే సమయంలో దాతల వివరాలు తెలపాలన్న నిబంధనను సడలించలేదు కేంద్రం.
అయితే టీటీడీ చేసిన చేసిన తాజా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది కేంద్రం. ఫారిన్ కరెన్సీ సమర్పించిన దాతల వివరాలు లేకపోయినా.. భక్తులు సమర్పించిన ఫారెన్ కరెన్సీని బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు టీటీడీకి మినహయింపు ఇచ్చింది కేంద్రం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..