Vastu Tips: ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే అనారోగ్యం మీ ఇంటి కాంపౌండ్‌లోకి రాదు.. చాలా సింపుల్‌ టిప్స్‌.

| Edited By: Narender Vaitla

Jan 19, 2023 | 6:49 AM

ఆరోగ్యమనేది ప్రపంచంలో ఎంతో ఎక్కువగా చర్చించే ఒక ముఖ్యమైన అంశం. ప్రతి ఒక్కరి దృష్టి ఆరోగ్యం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం కోసం, శ్రేయస్సు కోసం చేయని ప్రయత్నం ఉండదు. ఆధునిక వైద్య పద్ధతులనే కాదు, సంప్రదాయ పద్ధతులను కూడా ఉపయోగించి..

Vastu Tips: ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే అనారోగ్యం మీ ఇంటి కాంపౌండ్‌లోకి రాదు.. చాలా సింపుల్‌ టిప్స్‌.
Vastu Tips
Follow us on

ఆరోగ్యమనేది ప్రపంచంలో ఎంతో ఎక్కువగా చర్చించే ఒక ముఖ్యమైన అంశం. ప్రతి ఒక్కరి దృష్టి ఆరోగ్యం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం కోసం, శ్రేయస్సు కోసం చేయని ప్రయత్నం ఉండదు. ఆధునిక వైద్య పద్ధతులనే కాదు, సంప్రదాయ పద్ధతులను కూడా ఉపయోగించి తమ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి తెగ తాపత్రయ పడుతుంటారు. ఆరోగ్యం కోసం అనేక శక్తివంతమైన పద్ధతులను అనుసరిస్తుంటారు. అనేక మార్గాలలో ప్రయత్నాలు చేస్తుంటారు. మార్గాలలో ఒక ప్రధానమైన మార్గం వాస్తు శాస్త్రం. అతి తక్కువ ఖర్చుతో అద్భుతమైన సానుకూల ఫలితాలను ఇచ్చే వాస్తు మార్గాలను అనుసరించడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. ఆరోగ్యాన్ని మించిన అభాగ్యం మరొకటి ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. ఎవరు ఎంత సంపాదించినా ఆరోగ్యం లేనిదే ఆ సంపాదనను అనుభవించడం సాధ్యం కాదు. అందువల్ల అతి ప్రాచీన కాలం నుంచి వాస్తు శాస్త్రంలో దీనికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వటం జరుగుతోంది. పటిష్టమైన ఆరోగ్యానికి ప్రధానంగా ఏడు చిట్కాలను నిపుణులు సూచించారు.

చక్కని మానసిక, శారీరక ఆరోగ్యానికి మొట్టమొదటగా చేయాల్సిన పని ఇంటి ఈశాన్య మూలలో ఉదయాన్నే ఒక చిన్న దీపాన్ని వెలిగించడం. ఇక్కడ కొవ్వొత్తి వెలిగించినా ఇదే ఫలితం ఉంటుంది. ఇది అతి తక్కువ కాలంలో ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఈ విధంగా దీపం వెలిగించడం ప్రారంభించిన ఐదు ఆరు రోజుల్లోనే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటం మొదలవుతుంది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా అతి తక్కువ కాలంలో ఆశించిన స్థాయిలో ఉపశమనం లభిస్తుంది. ఇక ఇంట్లో ఎక్కడైనా నీళ్లు కారుతున్నా, గొట్టాలు, పైపులు పగిలి ఉన్నా వెంటనే వాటిని మరమ్మతు చేయడం మంచిది. ఇంట్లో నీళ్లు కారడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఇంటి యజమానికే కాదు, ఇంట్లోని ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆరోగ్య సమస్య పట్టుకుంటుంది. ఇంట్లో నీళ్లు కారడం సంపదకు కూడా మంచిది కాదు. ఇంట్లో నీటి మడుగులు ఏర్పడటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంట్లో నీటి చుక్కలు పడుతున్న శబ్దాన్ని వినటం కూడా ఇంట్లోని వారికి శ్రేయస్కరం కాదు.

ఇక పొరపాటున కూడా మెట్ల కింది జాగాను వస్తువులతో నింపకూడదు. ఇప్పటికే వస్తువులతో నింపి ఉంటే వాటిని వెంటనే తొలగించడం మంచిది. దీనివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. మెట్ల కింది ఖాళీ ప్రదేశాన్ని విరిగిపోయిన వస్తువులు, ఇనుప వస్తువులు, కర్రలు, నిచ్చెనులతో నింపడం జరిగితే అది తప్పకుండా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆ ఖాళీ ప్రదేశంలో దుమ్ము ధూళి నిండినా ఆ ఇంటివారిని దీర్ఘకాలిక అనారోగ్యాలు పట్టిపీడిస్తాయి. ఆ ఖాళీ ప్రదేశాన్ని వస్తువులతో నింపడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ ప్రదేశాన్ని ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచాలి. ఇంట్లో కూర్చుని ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, లేక మరేదైనా వృత్తిని కొనసాగిస్తున్నా, చివరికి చదువుకుంటున్నా తప్పనిసరిగా తూర్పు లేదా ఉత్తర దిక్కుకు అభిముఖంగానే కూర్చోవడం మంచిది. దీనివల్ల సునాయాసంగా విజయాలు సిద్ధించడంతోపాటు ఆరోగ్యం పటిష్టంగా ఉండి, ఉత్సాహంగా, చురుకుగా పని చేసుకోవడానికి వీలుంటుంది.

ఇవి కూడా చదవండి

మొక్కలతో జాగ్రత్త..

ఇంట్లో కానీ, పెరట్లో కానీ, ఇంటి ఆవరణలో కానీ గాలిని శుభ్రపరిచే మొక్కలను మాత్రమే నాటడం వల్ల ఆరోగ్యం చెక్కు చెదరకుండా పదిలంగా ఉంటుంది. అనారోగ్యంతో ఉన్నవారు కూడా త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ అద్దె ఇళ్లకు కూడా వర్తిస్తాయి. పరిశుభ్రమైన గాలిని ఇచ్చే మొక్కలలో తులసి మొక్క ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇక ఏ పూల మొక్కైనా ఆరోగ్యానికి మంచిదే. గులాబీ, బంతి, చామంతి, మందార మొక్కలు కూడా గాలిని శుభ్రంగా ఉంచుతాయి. పొరపాటున కూడా ముళ్ళ మొక్కలను, రబ్బర్ మొక్కలను, బోన్సాయ్ మొక్కలను ఇంటి ఆవరణలో ఉంచకూడదు. వాటికి గాలిని శుభ్రం చేసే గుణం లేదు. అవి ఆరోగ్యానికి హానికరం. ఇంటికి ఈశాన్యంలో మెట్లు ఉండటం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. వైద్యానికి అందని అనారోగ్యాలు ఆ ఇంట్లోని వారిని పట్టి పీడిస్తాయి. ఆరోగ్యం ఏ మాత్రం బాగుండాలన్నా ఈశాన్యం మూల మెట్లు ఉండకూడదు. మంచి ఆరోగ్యానికి ఇంతకన్నా అత్యుత్తమ వాస్తు చిట్కా మరొకటి ఉండదు.

ఇంట్లో ఆరోగ్యకర వాతావరణం నెలకొనాలంటే వాయువ్య మూలలో పడకగది ఉండటం మంచిది. దీనివల్ల ఆరోగ్యం చక్కగా ఉండటంతో పాటు, ఆ ఇల్లు ఎల్లవేళలా కళకళలాడుతూ ఉంటుంది. దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఆ ఇంట్లో వారికి అంటవు. ఇంట్లో తూర్పు, ఉత్తర దిక్కులలో కిటికీలు ఉండటం, వాటిని ఎప్పుడూ తెరిచే ఉంచడం వల్ల అనారోగ్యాలు దగ్గరకు కూడా రావు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. శారీరక ఆరోగ్యమే కాక మానసిక ఆరోగ్యం కూడా పటిష్టంగా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..