Festivals In February 2024
ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి నెల సంవత్సరంలో రెండవ నెల. చలికాలానికి ప్రజలు వీడ్కోలు పలికి వేసవి కాలానికి స్వాగతం పలికే నెల ఇది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ మాసంలో పుష్యమాసం పూర్తి అయ్యి.. మాఘమాసంలో అడుగు పెడుతోంది. అయితే మాఘమాసం ప్రవేశించిన వెంటనే హిందువులకు పూజలకు, శుభకార్యాలకు శుభ సమయం.. రథ సప్తమి, భీష్మాష్టమి వంటి అనేక పవిత్రమైన పండగలు మాఘమాసంలోనే వస్తాయి. అయితే ఈ సంవత్సరం లీప్ ఇయర్.. కనుక ఫిబ్రవరి 29 రోజులు ఉంటాయి. ఫిబ్రవరి నెలలో వచ్చే పండుగలు గురించి ఈ రోజు తెలుసుకుందాం..
- ఫిబ్రవరి6వ తేదీ 2024 మంగళవారం ఏకాదశి తిథి.. దీనిని షట్టిల ఏకాదశిగా జరుపుకుంటారు. మహా విష్ణువుకి పూజలను నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 9వ తేదీన శుక్రవారం పుష్య మాసంలో చివరి రోజు అమావాస్య తిధి.. ఈ అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ అమావాస్యను మౌని అమావాస్య, చొల్లంగి అమావాస్య అంటారు. ఏపీలోని ప్రజలు సముద్ర స్నానమాచరిస్తారు.
- ఫిబ్రవరి 14వ తేదీ 2024 బుధవారం: మాఘమాసంలో వచ్చే మొదటి పండగ.. వసంత పంచమి. ఈ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవిని పూజిస్తారు.
- ఫిబ్రవరి 16వ తేదీ 2024 శుక్రవారం: మాఘమాసం శుద్ధ సప్తమి. ఈ రోజుని ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుడు జన్మదినంగా రథ సప్తమిని జరుపుకుంటారు.
- ఫిబ్రవరి 20వ తేదీ 2024 మం మంగళవారం కౌరవ పితామహుడు భీష్ముడు విష్ణులోకానికి చేరుకున్న రోజు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి కల్యాణాని ఘనంగా జరుపుతారు.
- ఫిబ్రవరి 24వ తేదీ 2024 శనివారం పౌర్ణమి తిధి.. దీనిని మాఘ పౌర్ణమిగా హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా నది స్నానానికి ప్రత్యేక స్థానం ఉంది.
- ఈ నెలలో జరుపుకునే మరికొన్ని ముఖ్యమైన పండగలు .. ఫిబ్రవరి8వ తేదీ 2024 గురువారం మాస శివరాత్రి , 12 వ తేదీ సోమవారం శ్రీ మార్కండేయ జయంతిలు కూడా ఉన్నాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు