Vinayaka Chavithi: వినాయక చవితి పర్యావరణ అనుకూలంగా లోహ విగ్రహాలతో జరుపుకోండి.. ఏ లోహానికి ఏ విశిష్టిత అంటే

హిందువులు జరుపుకునే అత్యంత ప్రియమైన పండుగలలో ఒకటైన వినాయక చవితికి ఇంక నాలుగు రోజులే సమయం ఉంది. త్వరలో వీధులు గణపతి బప్పా మోరియా నినాదాలతో ప్రతిధ్వనిస్తాయి. గణపయ్య భక్తులు గణేశుడిని భక్తితో ఆనందంతో తమ ఇంట్లోకి స్వాగతించడానికి రెడీ అవుతున్నాయి. అయితే వినాయక చవితి పండగ పూజా విధానం పూర్తిగా ప్రక్రుతితో ముడి పడి ఉంటుంది. అటువంటి నేపధ్యంలో పర్యావరణ అనుకూల లోహ గణపతి విగ్రహాలతో జరుపుకోవాలని ఎప్పుడైనా ఆలోచించారా?

Vinayaka Chavithi: వినాయక చవితి పర్యావరణ అనుకూలంగా లోహ విగ్రహాలతో జరుపుకోండి.. ఏ లోహానికి ఏ విశిష్టిత అంటే
Ganesh Chaturthi 2025

Updated on: Aug 24, 2025 | 8:40 AM

హిందువులు జరుపుకునే అత్యంత ప్రియమైన పండుగలలో ఒకటైన వినాయక చవితికి ఇంక నాలుగు రోజులే సమయం ఉంది. త్వరలో వీధులు గణపతి బప్పా మోరియా నినాదాలతో ప్రతిధ్వనిస్తాయి. గణపయ్య భక్తులు గణేశుడిని భక్తితో ఆనందంతో తమ ఇంట్లోకి స్వాగతించడానికి రెడీ అవుతున్నాయి. అయితే వినాయక చవితి పండగ పూజా విధానం పూర్తిగా ప్రక్రుతితో ముడి పడి ఉంటుంది. అటువంటి నేపధ్యంలో పర్యావరణాన్ని కాపాడుకుంటూ మనం వినాయక చవితిని జరుపుకోవాలని నినాదం రోజు రోజు కీ పెరుగుతోంది. ఈ నేపధ్యంలో ఈ సంవత్సరం పర్యావరణ అనుకూలమైన లోహ గణపతి విగ్రహాన్ని ఇంటికి స్వాగతించడం ద్వారా సంప్రదాయాన్ని పాటించవచ్చు.

లోహ గణపతి విగ్రహాలు ఎందుకు?

సాంప్రదాయకంగా బంకమట్టి విగ్రహాలను పర్యావరణ అనుకూలమైన ఎంపికగా పరిగణించేవారు.. అయితే కాలక్రమంలో మట్టి విగ్రహాల స్థానంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) విగ్రహాల వినియోగం పెరిగింది. దీంతో నీటి కాలుష్యం ఏర్పడింది. ఈ విగ్రహాలు నీటిలో నిమజ్జనం చేయడం వలన నదులు, సరస్సులలోకి విషపదార్థాలు , హానికరమైన పెయింట్‌లను విడుదల అవుతాయి. ఈ నేపధ్యంలో మట్టి విగ్రహాల వైపు మళ్ళీ దృష్టి సారిస్తున్నారు. అంతేకాదు వినాయక చవితికి లోహంతో చేసిన గణపయ్య విగ్రహాని కూడా ప్రతిష్టించి పూజించవచ్చు. వీటిని అందంగా భద్రపరచుకోవచ్చు. తరతరాలుగా అందించవచ్చు.

ఇవి కూడా చదవండి

లోహ విగ్రహాలు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

ఇత్తడి, కాంస్య, వెండి, బంగారం లేదా పంచధాతు, అష్టధాతు వంటి పవిత్ర మిశ్రమాలతో తయారు చేయబడిన గణపతి విగ్రహాలు చూడడానికి అద్భుతంగా ఉండటమే కాకుండా దీర్ఘకాలం మన్నిక కలిగి ఉంటాయి. (5) పవిత్ర లోహాలతో తయారు చేయబడిన పంచధాతు, పవిత్ర లోహాల మిశ్రమం అయిన అష్టధాతుతో చేసే విగ్రహాలు దేవాలయాలలో ఉంచబడతాయి. ఇవి అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి, దైవిక శక్తిని ప్రసరింపజేస్తాయని నమ్ముతారు.

ఇత్తడి, కాంస్య విగ్రహాలు దృఢంగా, బడ్జెట్‌కు అనుకూలంగా ఉంటాయి. అయితే వెండి, బంగారం, పంచధాతువు. అష్టధాతు విగ్రహాలు కాలక్రమేణా ఆర్థిక, ఆధ్యాత్మిక విలువను కలిగి ఉంటాయి. ఈ లోహ విగ్రహాలను ఎంచుకోవడం ద్వారా దీర్ఘకాలంలో డబ్బు ఆదా చేయవచ్చు.

స్థిరత్వంతో పాటు, లోహ విగ్రహాలు ఆధ్యాత్మిక ప్రతీకలను కలిగి ఉంటాయి.

అయితే, నిమజ్జనం చుట్టూ పర్యావరణ ఆందోళనలు ఉన్నందున, భక్తులు లోహాల వైపు మొగ్గు చూపుతున్నారు. అవి కూడా అంతే లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం లోహ గణపతి విగ్రహం శ్రేయస్సును తెస్తుందని, అడ్డంకులను తొలగిస్తుందని, ఇంటి అంతటా సానుకూలతను వ్యాపింపజేస్తుందని చెబుతారు. ప్రతి లోహం, మిశ్రమం దాని సొంత విశిష్టతని కలిగి ఉంటాయి..

ఇత్తడి , కాంస్య గణపతి విగ్రహం : ఓర్పు, స్థిరత్వం, దైవిక శక్తి

వెండి గణపతి విగ్రహం: స్వచ్ఛత, శాంతి , శ్రేయస్సు

బంగారం గణపతి విగ్రహం: సంపద, సమృద్ధి , విజయం

పంచధాతుగణపతి విగ్రహం: ఐదు పవిత్ర లోహాల మిశ్రమం..సహజ మూలకాల సమతుల్యత, సామరస్యాన్ని సూచిస్తుంది.

అష్టధాతు గణపతి విగ్రహం: ఎనిమిది లోహాల విశ్వ శక్తులను మిళితం చేసి, ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందని, గృహాన్ని రక్షిస్తుందని నమ్ముతారు.

ప్రకృతి గురించి తెలియజేసే పండగ

గణేష్ చతుర్థి అనేది అంతర్గత జ్ఞానాన్ని మేల్కొల్పడానికి.. ప్రకృతి లయకు అనుగుణంగా జరుపుకునే ఒక పవిత్రమైన పండగ..

మానసిక ప్రశాంత కోసం అశోక లేదా మామిడి ఆకుల సహజ తోరణాలుగా ఉపయోగించండి. ఆనందం, ఆధ్యాత్మిక శక్తిని సక్రియం చేయడానికి నారింజ పువ్వులను ఉపయోగించండి.

పర్యావరణానికి మద్దతు ఇచ్చే, భూమిని గౌరవించే సహజ వస్తువులను అలంకరణగా ఎంచుకోండి. సింథటిక్ పదార్థాలను నివారించండి

ఇంట్లో తయారుచేసిన కుడుములు, జిల్లేడు కాయలు, ఉండ్రాళ్ళు వంటి వాటిని సిద్ధం చేయండి.

నిజమైన జ్ఞానం నిశ్శబ్దంలో పుడుతుంది.. గణపతి మండపాలలో సంగీతం వీనుల విందుగా ఉండేలా చూడండి.. ప్రశాంతమైన, ప్రశాంతమైన వాతావరణాలను సృష్టించండి.

శతాబ్దాలుగా కుటుంబాలు తమ పూజ గదులలో చిన్న వెండి లేదా ఇత్తడి గణేష్ విగ్రహాలను ఉంచుతారు. ఇలా చేయడం వలన ఇంటికి సామరస్యాన్ని, అదృష్టాన్ని తెస్తాయని నమ్ముతారు. కనుక లోహ విగ్రహాన్ని ఎంచుకోవడం అనేది ఆధునిక పర్యావరణ స్పృహతో కూడిన నిర్ణయం మాత్రమే కాదు.. పురాతన నమ్మకాన్ని కొనసాగించడం కూడా..

సాంప్రదాయకంగా మట్టి విగ్రహాలను పవిత్రమైనవిగా భావిస్తారు. ఎందుకంటే నిమజ్జనం చేయడం అనేది పండుగ జరుపుకునే నియమాలలో ఒక నియమం కూడా.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.